ప్రధాన మంత్రి కార్యాలయం
‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ను బలపరచవలసింది గా ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
స్వతంత్ర భారతదేశానికి ఒక జెండా ఉండాలి అని కలలు గన్న వారి అసాధారణసాహసాన్ని మరియు ప్రయాసలను సైతం గుర్తుకు తెచ్చుకున్న ప్రధానమంత్రి
జులై 22వ తేదీ కి మన చరిత్ర లో ఒకవిశేషమైన సందర్భశుద్ధి ఉంది; 1947వ సంవత్సరం లో ఇదే రోజున, మన జాతీయ పతాకాన్ని మనం అంగీకరింపచేసుకొన్నాం:ప్రధానమంత్రి
Posted On:
22 JUL 2022 9:31AM by PIB Hyderabad
‘ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమం’ (‘హర్ ఘర్ తిరంగా అభియాన్’) ను బలపరచవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల కు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర భారతదేశాని కి ఒక జెండా అనేది ఉండాలని స్వప్నించినటువంటి వ్యక్తుల యొక్క అసాధారణమైన సాహసాన్ని మరియు ప్రయాసల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. మువ్వన్నెల జెండా తో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి కమిటీ మరియు పండిత్ నెహ్రూ గారు ఆవిష్కరించినటువంటి తొలి త్రివర్ణ పతాకం గురించిన కొన్ని ఆసక్తిదాయక అంశాల ను కూడా ఆయన ఈ సందర్భం లో శేర్ చేశారు. జులై 22వ తేదీ కి మన చరిత్ర లో ఒక విశేషమైన ప్రాసంగికత ఉంది, ఎందుకంటే 1947వ సంవత్సరం లో ఇదే రోజు న మన జాతీయ పతాకాన్ని అంగీకరింపచేసుకోవడం జరిగింది అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘ఈ సంవత్సరం లో, ఎప్పుడైతే మనం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్నామో – రండి, మనం ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ను పటిష్టం చేద్దాం. ఆగస్టు 13వ తేదీ మరియు ఆగస్టు 15వ తేదీ ల మధ్య కాలం లో మీ మీ ఇళ్ళ లో మీరు అందరూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడమో లేదా ఆ పతాకాన్ని ప్రదర్శించడమో చేయండి. ఈ ఉద్యమం జాతీయ ధ్వజం తో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని మరింత గా బలపరుస్తుంది.’’
‘‘ఈ దినాని కి, అంటే జులై 22వ తేదీ కి, మన చరిత్ర లో ప్రత్యేకమైనటువంటి ప్రాసంగికత ఉన్నది. 1947వ సంవత్సరం లో ఇదే రోజు న మన జాతీయ జెండా ను అంగీకరింపచేసుకోవడమైంది. చరిత్ర లోని కొన్ని ఆసక్తిదాయకమైన విషయాల ను నేను మీతో శేర్ చేస్తున్నాను.. వీటిలో మన మూడు రంగు ల జెండా తో జతపడ్డ కమిటీ యొక్క వివరణ తో పాటు పండిత్ నెహ్రూ గారు ఆవిష్కరించిన తొలి త్రివర్ణ పతాకం కూడా ఉంది.’’
‘‘వలసవాదుల పాలన కు వ్యతిరేకం గా మనం పోరాటాన్ని జరుపుతూ ఉన్నటువంటి కాలం లో స్వతంత్ర భారతదేశాని కి ఒక ధ్వజమంటూ ఉండాలని కల గన్న వారందరి అసాధారణ సాహసాన్ని మరియు ప్రయాసల ను మనం ఈ రోజున స్మరించుకొంటూ ఉంటాం. వారి దార్శనికత కు కార్యరూపాన్ని ఇవ్వడం కోసం మరియు వారు స్వప్నించినటువంటి భారతదేశం యొక్క నిర్మాణం కోసం మనం మన వచన బద్ధత ను పునరుద్ఘాటించుదాం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1843783)
Visitor Counter : 334
Read this release in:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada