నీతి ఆయోగ్
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ మూడవ ఎడిషన్‌ను ప్రారంభించనున్న నీతి ఆయోగ్
Posted On:
20 JUL 2022 9:10AM by PIB Hyderabad
2022 జూలై 21న నీతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ మూడవ ఎడిషన్‌ను నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021ని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ శ్రీ సుమన్ బేరీ..సభ్యుడు డాక్టర్ వి కె సరస్వత్, శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఇతర గౌరవనీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తారు.
ఇండెక్స్ మూడవ ఎడిషన్ విడుదల - మొదటి మరియు రెండవ ఎడిషన్‌లు వరుసగా అక్టోబర్, 2019 మరియు జనవరి, 2021లో ప్రారంభించబడ్డాయి. దేశాన్ని ఒక ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం చేస్తోన్న నిరంతర నిబద్ధతను ఇది ధృవీకరిస్తుంది.
కొవిడ్ మహమ్మారి గ్లోబల్ డెమోగ్రాఫిక్ ల్యాండ్‌స్కేప్‌కు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 రూపొందించ బడింది. స్థితిస్థాపకత మరియు సంక్షోభం-ఆధారిత ఆవిష్కరణలు ఈ క్లిష్ట సమయాల్లో భారతదేశం తిరిగి పుంజుకోవడానికి సహాయపడ్డాయి. ఉప జాతీయ స్థాయిలో ఆవిష్కరణ సామర్థ్యాలు మరియు పర్యావరణ వ్యవస్థలను పరిశీలించే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 అటువంటి సంక్షోభ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉపయోగపడే కారకాలు మరియు ఉత్ప్రేరకాలను హైలైట్ చేస్తుంది.
మూడవ ఎడిషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) ఫ్రేమ్‌వర్క్ ను రూపొందించడం ద్వారా దేశంలో ఆవిష్కరణ విశ్లేషణ పరిధిని బలోపేతం చేస్తుంది. మునుపటి ఎడిషన్‌లో ఉపయోగించిన 36 సూచికలతో పోలిస్తే (విజ్. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020) 66 ప్రత్యేక సూచికల పరిచయంతో కొత్త ఫ్రేమ్‌వర్క్ భారతదేశంలో ఆవిష్కరణ పనితీరును కొలవడానికి మరింత సూక్ష్మమైన మరియు సమగ్రమైన దృక్పథాన్ని అందిస్తుంది. ఈ సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఈ ఇండెక్స్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆవిష్కరణ పనితీరును అంచనా వేస్తుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పనితీరును సమర్థవంతంగా పోల్చడం కోసం 17 'ప్రధాన రాష్ట్రాలు', 10 'ఈశాన్య మరియు కొండ ప్రాంతాలు' మరియు 9 'కేంద్రపాలిత ప్రాంతాలు మరియు నగర రాష్ట్రాలు'గా విభజించబడ్డాయి.
ఇండికేటర్లలో మెరుగుదలని మూల్యాంకనం చేయడం ద్వారా ఇన్నోవేషన్ డ్రైవర్ల వివరణాత్మక విశ్లేషణను ప్రదర్శించడానికి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో ప్రత్యేక విభాగం కూడా ప్రవేశపెట్టబడింది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో రాష్ట్రాలు తమ స్థానాన్ని మరియు వాటి ర్యాంకింగ్‌లో మార్పుకు దారితీసిన అంశాలను అంచనా వేయవచ్చు.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌తో నీతి ఆయోగ్ దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బెంచ్‌మార్క్ చేయడానికి ఒక పొందికైన సాధనాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది. తద్వారా వాటిలో పోటీతత్వ మరియు సహకార సమాఖ్య రెండింటినీ ప్రోత్సహిస్తుంది.
కార్యక్రమం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది: https://youtu.be/h9Esk5EFpP4
***
(Release ID: 1843034)
Visitor Counter : 243