ఆయుష్

సంప్రదాయ విధానాలతో కోవిడ్ -19 చికిత్సకు ఔషధం అభివృద్ధి

Posted On: 19 JUL 2022 2:40PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఆయుష్ సంస్థల నుండి ప్రాతినిధ్యంతో ఇంటర్-డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. అశ్వగంధ, యష్టిమధు, గుడుచి + పిప్పలి , పాలీహెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్-64) అనే నాలుగు విభిన్న జోక్యాలను అధ్యయనం చేయడానికి ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ ప్రొఫిలాక్టిక్ అధ్యయనాలు,  కోవిడ్-19 పాజిటివ్ కేసులలో యాడ్-ఆన్ జోక్యాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రోటోకాల్స్ ను  రూపొందించింది  ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ కౌన్సిల్స్ , నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ద్వారా 150 క్లినికల్, ప్రీ క్లినికల్,  ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు చేపట్టారు.

కోవిడ్-19 వంటి అంటు వ్యాధులను నిరోధించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవలు/చర్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి-

1.కోవిడ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మరియు ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సలహాను జారీ చేసింది. హ్యాండ్ వాష్, మాస్క్ వాడకం వంటి పరిశుభ్రతను పాటించడంతో పాటు, సులభమైన ఇంటి చికిత్సలను కూడా ప్రజలకు సూచించారు.

2.ప్రజల సాధారణ రోగనిరోధక శక్తిని పెంపొందించడం , రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య విభాగాల సమన్వయంతో అవసరమైన చోట ఆయుష్ జోక్యం గురించి మరింత నిర్దిష్ట సూచనలతో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మంత్రిత్వ శాఖ ఒక లేఖ ను పంపింది.

3.కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి భారీ ఆయుష్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేసి, ఉపయోగించుకోవాలని కోరుతూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు (ఎంఓహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యు) కు కూడా ఒక లేఖ పంపారు.

4.కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి వైద్య, పారామెడికల్ సిబ్బంది తో పాటు ఆసుపత్రి (ఐపిడి & ఒపిడి), పాథాలజీ లేబొరేటరీ, ఐసియు , మానవ వనరులు వంటి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని అన్ని ఆయుర్వేద, సిద్ధ, యునాని ,హోమియోపతి (ఎఎస్యు & హెచ్) కళాశాలల ప్రిన్సి పాల్స్ కు  మంత్రిత్వ శాఖ డి.ఓ. లేఖను పంపింది. అందువల్ల, పరిస్థితిని బట్టి అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి స్థానిక ఆరోగ్య అధికారులకు తమ సేవలను అందించాలని వారికి  సూచించారు. దీని ప్రకారం, వివిధ ఆయుష్ సంస్థలు ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని క్వారంటైన్ సెంటర్, ఐసోలేషన్ సెంటర్, కోవిడ్ కేర్ సెంటర్ , కోవిడ్ హెల్త్ సెంటర్లుగా వ్యవహరించాయి.

5.ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు , రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ స్వీయ-సంరక్షణ మార్గదర్శకాలను సిఫారసు చేసింది.

*సాధారణ చర్యలు

*ఆయుర్వేద రోగనిరోధక శక్తిని పెంపొందించే చర్యలు

*సరళమైన ఆయుర్వేద పద్ధతులు

*పొడి దగ్గు/గొంతునొప్పి సమయంలో

6. ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబినార్ ద్వారా "ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ" అనే అంశంపై మూడు నెలల ప్రచారాన్ని ప్రారంభించారు. రోగనిరోధక శక్తి కోసం ఆయుష్ పై ప్రచార బులెటిన్ ను కూడా వెలువరించారు. వెబినార్ లో 50 వేల మందికి పైగా పాల్గొన్నారు.

7. 33,000 మంది ఆయుష్ మాస్టర్ ట్రైనర్లకు ఆయుష్, ఎంఓహెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా శిక్షణను అందించింది. మొత్తం 83,000 మంది ఆయుష్ సిబ్బంది igot.in వేదిక పై నిరంతర ప్రాతిపదికన శిక్షణ పొందారు. గుర్తించిన పాత్రలతో కోవిడ్-19 నిర్వహణ కోసం ఆయుష్ సిబ్బందిని కోవిడ్ వారియర్ గా  ఉపయోగించుకోవడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యు తో సమన్వయం చేసుకుంది.

8. రోగనిరోధక చర్యలు, క్వారంటైన్ సమయంలో జోక్యం, కోవిడ్-19 లక్షణం లేని, ఉన్న  కేసులు, పబ్లిక్ హెల్త్ రీసెర్చ్, సర్వే, ల్యాబ్ ఆధారిత పరిశోధన సహా ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి వ్యవస్థల ద్వారా కోవిడ్-19 పై పరిశోధనను చేపట్టడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది, టాస్క్ ఫోర్స్ సిఫారసుల ఆధారంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 కోసం ఆయుష్ జోక్యాలతో కూడిన ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలను కూడా ప్రారంభించింది. ఆయుష్ జోక్యాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ పరిశోధనా సంస్థలు,  జాతీయ సంస్థల ఆధ్వర్యంలో, దేశంలో 140 పరిశోధన అధ్యయనాలు పురోగతి లో ఉన్నాయి.

9. ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ ను కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. సుమారు 1.35 కోట్ల మంది ప్రతిస్పందకులలో  మొబైల్ యాప్ ఆధారిత జనాభా అధ్యయనం ద్వారా కోవిడ్-19 నివారణలో ఆయుష్ సలహాలు ,చర్యల సమర్థత, ఆమోదం, వినియోగ ప్రభావ మదింపును ఇది డాక్యుమెంట్ చేసింది. 85.1% మంది కోవిడ్-19 నివారణకు ఆయుష్ చర్యలను ఉపయోగించినట్లు నివేదించారు, వారిలో 89.8% మంది ఆయుష్ సలహా విధానం నుండి ప్రయోజనం పొందినట్టు అంగీకరించారు.

10. సంబంధిత ఆయుష్ సిస్టమ్‌లోని రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ల కోసం మార్గదర్శకాలను రీసెర్చ్ కౌన్సిల్స్ డైరెక్టర్ జనరల్స్ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ల డైరెక్టర్లు వారి నిపుణుల బృందంతో తయారు చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ ద్వారా వాటిని పరిశీలించారు. హోమియోపతితో సహా రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్ల ప్రయోజనం కోసం ఈ మార్గదర్శకాలు పబ్లిక్ డొమైన్ లో  అందుబాటులో ఉన్నాయి, ఇది కోవిడ్ 19 మహమ్మారిని ఏకరీతిగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

11. నేషనల్ టాస్క్ ఫోర్స్ తయారు చేసిన ఆయుర్వేదం, యోగా ఆధారంగా 'కోవిడ్-19 నిర్వహణ కోసం నేషనల్ క్లినికల్ మేనేజ్ మెంట్  ప్రోటోకాల్'ను భారత ప్రభుత్వం విడుదల చేసింది.

12. కోవిడ్-19 సమయంలో స్వీయ సంరక్షణ కోసం ఆయుర్వేద, యునానీ, సిద్ధ నివారణ చర్యలు, హోం ఐసోలేషన్ లో  ఉన్న కోవిడ్-19 రోగుల కోసం , ఆయుష్ ప్రాక్టీషనర్ల కోసం మార్గదర్శకాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

13. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నైతిక పద్ధతులపై ఆయుష్ ప్రాక్టీషనర్లకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సలహాను కూడా జారీ చేసింది.

14.కోవిడ్ -19 నిర్వహణకు మానవ వనరులు , మౌలిక సదుపాయాల కొరతను సకాలంలో పరిష్కరించేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ తన డి. ఓ. లెటర్ నెంబరు వై-18020/2/2020 -ఇపి-3 ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 నిర్వహణ , నివారణలో జిల్లా ఆయుర్వేద అధికారులను తక్షణమే భాగస్వామ్యం చేయడానికి, ఆయుష్ వైద్యులు, ఆయుష్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ల సేవలను,  ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను  విస్తృతంగా వినియోగించు కోవడానికి,తగిన సూచనలను జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు/ యు టి లను అభ్యర్థించింది.

15. కోవిడ్-19 కేసుల నిర్వహణ కోసం మానవ వనరులను పెంచే ప్రయత్నాలను కొనసాగించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కేసుల క్లినికల్ మేనేజ్మెంట్ కోసం అందుబాటులో ఉన్న శిక్షణ పొందిన ఆయుష్ మానవ వనరులను ఉపయోగించడానికి సలహాను జారీ చేసింది.

16. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పిల్లల కోసం ప్రొఫిలాక్టిక్ సంరక్షణ గురించి ఆయుష్ మంత్రిత్వ శాఖ పిల్లల కోసం హోం కేర్ మార్గదర్శకాలను , ఆయుష్ ప్రాక్టీషనర్ల కోసం సలహాను విడుదల చేసింది.

17.ప్రొఫిలాక్టిక్, అనుమానిత , నిర్ధారిత మ్యూకోర్మైకోసిస్ కేసుల నిర్వహణ కోసం ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ కు ఆయుష్ మంత్రిత్వ శాఖ సమాచారాన్ని విడుదల చేసింది.

18. కోవిడ్-19,  లాంగ్ కోవిడ్-19 సమయంలో సంపూర్ణ ఆరోగ్యం , శ్రేయస్సు కోసం  నివారణ చర్యలు , సంరక్షణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజల కోసం ఆయుష్ సిఫార్సులను కూడా విడుదల చేసింది.

19. కోవిడ్-19 మహమ్మారి సమయంలో హోం ఐసోలేషన్ లోని రోగుల కోసం ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు మార్గదర్శకాలను, , స్వీయ సంరక్షణ కోసం ఆయుర్వేద- యునానీ ఆధారిత నివారణ చర్యలను  ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

20. కోవిడ్-19 ప్రొఫిలాక్సిస్ , నిర్వహణ కోసం ఆయుష్ జోక్యాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సలహాను జారీ చేసింది.  కోవిడ్ -19 కేసుల సంరక్షకులు కోసం ఆయుష్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

కోవిడ్-19 చికిత్సకు ప్రస్తుతం ఇస్తున్న అల్లోపతి, హోమియోపతి మందులు లేదా వ్యాక్సిన్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల ఔషధం ఏదీ ఇంతవరకు అభివృద్ధి చేయబడలేదు.

ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.

    

***



(Release ID: 1842885) Visitor Counter : 143