వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సౌరశక్తి, రక్షణ,వాణిజ్య, భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య ఫార్మా రంగాల్లో రెండు దేశాల ప్రయోజనాల పరిరక్షణకు ఆఫ్రికాతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కృషి... శ్రీ పీయూష్ గోయల్.
ఆఫ్రికాతో భారతదేశ సంబంధాలు నమ్మకం, స్నేహం మరియు పరస్పర అవసరాలపై లోతైన అవగాహన పై ఆధారపడి ఉన్నాయి;ఆఫ్రికా అభిప్రాయాలకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది: శ్రీ గోయల్
తాగునీటి అవసరాలు, ఆరోగ్య పరిరక్షణ విద్య , ఫిన్‌టెక్ మరియు సౌరశక్తి వంటి అనేక రంగాలలో తక్కువ ఖర్చుతో పరిష్కారాల అభివృద్ధికి భారతదేశం, ఆఫ్రికా కలిసి పని చేయవచ్చు: శ్రీ పీయూష్ గోయల్
భారతదేశం మరియు ఆఫ్రికా కలిసి అనేక ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం: శ్రీ పీయూష్ గోయల్
డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాణి వినిపించిన భారత్, ఆఫ్రికా దేశాలు
ప్రయోజనాల పరిరక్షణ, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ రక్షణ కోసం భారత్, ఆఫ్రికా కృషి
భారత్-ఆఫ్రికా అభివృద్ధి భాగస్వామ్యం పై సీఐఐ-ఎక్సిమ్ బ్యాంకు సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్.
Posted On:
19 JUL 2022 2:30PM by PIB Hyderabad
వివిధ రంగాలలో ఆఫ్రికాతో సంబంధాలను మెరుగు పరుచుకుని రెండు దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్-ఆఫ్రికా అభివృద్ధి భాగస్వామ్యం పై సీఐఐ-ఎక్సిమ్ బ్యాంకు సదస్సు ప్రారంభ సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్ పాల్గొని ప్రసంగించారు.
రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలను సాధించేందుకు నాలుగు రంగాల్లో ఆఫ్రికాతో తన సంబంధాలను మెరుగు పరుచుకోవాలని భారత్ యోచిస్తోంది. స్వచ్చమైన ఇంధనం సరఫరా చేసి, ఇంధన భద్రత కల్పించే రంగంలో ఆఫ్రికా తో కలిసి పనిచేయాలని భారతదేశం భావిస్తోంది. దీనివల్ల ఆఫ్రికా లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. హిందూ మహాసముద్రంలో రక్షణ వాణిజ్యం మరియు సైనిక మార్పిడి, సాయుధ వాహనాలు మరియు యూఏవీ ల తయారీ. భౌతిక, డిజిటల్ సదుపాయాల అభివృద్ధి, ఐటీ/సంప్రదింపులు/ ప్రాజెక్ట్ ఎగుమతులలో సహాయం, ఆరోగ్య రక్షణ, ఫార్మా రంగాల్లో ఆఫ్రికాతో సంబంధాలను మరింత మెరుగుపరుచు కుంటామని శ్రీ గోయల్ వివరించారు.
భారతదేశం, ఆఫ్రికా దేశాల మధ్య స్నేహబంధం చరిత్ర, వాణిజ్య రంగ ఒప్పందాలు, సినిమా పై మక్కువ లాంటి అంశాలపై ఆధారపడి బలంగా ఉన్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. సత్య, అహింస సిద్ధాంతాలకు ఆఫ్రికా గడ్డపై శ్రీకారం చుట్టారని శ్రీ గోయల్ అన్నారు. స్వాతంత్య్రం కోసం రెండు దేశాలు ఒకే విధమైన సాగించిన పోరాటం సంబంధాలను మరింత బలపరచాయని అన్నారు.
ఆఫ్రికా ప్రయోజనాల పరిరక్షణకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ గోయల్ తెలిపారు. రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పరస్పర విశ్వాసం, స్నేహం, అవగాహన ప్రాతిపదికగా ఆఫ్రికాతో భారతదేశం సంబంధాలను సాగిస్తుందని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
ప్రపంచ జనాభాలో 1/3 జనాభా కలిగి ఉన్న భారతదేశం, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ గోయల్ వివరించారు.
ఆఫ్రికా దేశాలతో కలిసి సీఐఐ, ఎక్సిమ్ బ్యాంకు కలిగి ఉన్న సంబంధాలు ఆఫ్రికా, భారతదేశ ప్రయోజనాల పరిరక్షణ ప్రజా శ్రేయస్సు అంశాలలో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ గోయల్ అన్నారు.
రెండు దేశాల్లో ప్రజలకు ఆహార భద్రత కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచి, ప్రజా శ్రేయస్సు కోసం భారతదేశం,ఆఫ్రికా కృషి చేస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. వ్యాక్సిన్-మైత్రి భారతదేశం,ఆఫ్రికా మధ్య స్నేహ సంబంధాలను మరోసారి వెల్లడించిందని అన్నారు.
స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నసమయంలో సదస్సును నిర్వహించడం పట్ల శ్రీ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. నవ భారత నిర్మాణం కోసం నూతన లక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నామని మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆజాదీ కా అమృత్ కాల్ (స్వర్ణయుగం) లో నడుస్తున్నదని అన్నారు. భారతదేశాన్ని సంపన్న దేశంగా రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. కేవలం భారతదేశ ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన అన్నారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 100 సంవత్సరాలు పూర్తవుతాయని చెప్పిన శ్రీ గోయల్ రానున్న 25 ఏళ్లలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి, వృద్ధి మరియు ప్రపంచ శ్రేయస్సుకు నాయకత్వం వహించే దేశంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
ఆఫ్రికా నుంచి భారతదేశం పొందుతున్న సహకారాన్ని ప్రస్తావించిన శ్రీ గోయల్ పరస్పర సహకారంలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం ట్రిప్స్ మాఫీ ( భారతదేశం, ఆఫ్రికా స్పాన్సర్ చేయబడింది) సౌకర్యాన్ని పొందుతున్నదని వివరించారు. దీనికి అన్ని ఆఫ్రికా దేశాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా కలిసి పనిచేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది అమలు జరుగుతోందని మంత్రి వివరించారు. దీనిలో భాగంగా డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశంలో అభివృద్ధి చెందుతున్న, అంతగా అభివృద్ధి చెందని దేశాల సమస్యలను ఆఫ్రికా, భారతదేశం ప్రస్తావించాయని శ్రీ గోయల్ వివరించారు. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థల రూపకల్పనకు కృషి చేసిన రెండు దేశాలు తమ భవిష్యత్తు అభివృద్ధి ప్రయోజనాలను రక్షించుకున్నాయని ఆయన అన్నారు. భారతదేశం మరియు ఆఫ్రికా కలిసి అనేక ప్రపంచ సమస్యలను పరిష్కరించగలవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ప్రజా శ్రేయస్సు, వర్తకం, వాణిజ్యం, ప్రభుత్వ పనితీరు ప్రతిపాదికన రెండు దేశాల మధ్య సంబంధాలు సాగుతున్నాయని శ్రీ గోయల్ అన్నారు. 46 ఆఫ్రికా దేశాల్లో భారతదేశ ప్రభావం ఉందని అన్నారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన దేశాల జాబితాలో భారతదేశం మొదటి అయిదు స్థానాల్లో ఉందని శ్రీ గోయల్ వివరించారు. గత 25 సంవత్సరాల కాలంలో ఆఫ్రికాలో భారతదేశం 71 అమెరికా బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టిందని అన్నారు. ఆఫ్రికా దేశానికి చెందిన స్థానిక సంస్థల అభివృద్ధికి భారత్ సహకరిస్తున్నదని తెలిపిన శ్రీ గోయల్ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ప్రస్తావించిన శ్రీ గోయల్ ఆఫ్రికా భారతదేశం యొక్క 4 వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యాపారం 2019-20లో $67 బిలియన్ల నుంచి 34% వృద్ధి సాధించి 2021-22 నాటికి $89 బిలియన్లకు పెరిగిందని ఆయన చెప్పారు. భారతదేశం ఎగుమతి $40 బిలియన్లు మరియు వివిధ ఆఫ్రికా దేశాల నుంచి $49 బిలియన్ల మేరకు దిగుమతులు జరిగాయన్నారు.
ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు భారతదేశం మరియు ఆఫ్రికా సిద్ధంగా శ్రీ గోయల్ అన్నారు. ఆఫ్రికాను పురోగతిలో భాగస్వామిగా భారతదేశం పరిగణిస్తుందని అన్నారు. 27 ఎల్డీసీ ఆఫ్రికా దేశాలకు డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రాధాన్యత ప్రయోజనాన్ని భారతదేశం అందించిందని ఆయన అన్నారు.
ఈ -విద్యాభారత్, ఈ-ఆరోగ్య భారతి ద్వారా ఆఫ్రికా లో విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు సహకారం అందిస్తున్నదని శ్రీ గోయల్ తెలియజేశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ మరియు విద్య రంగాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధి ఆఫ్రికాతో సంబంధాలను మరింతగా మెరుగుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
తాగునీటి అవసరాలు, ఆరోగ్య పరిరక్షణ విద్య,సౌర ఇంధనం లాన్టి రంగాలలో తక్కువ ఖర్చుతో సమస్యల పరిష్కారానికి రెండు దేశాలు కలిసి పని చేయడానికి అవకాశాలు ఉన్నాయని శ్రీ గోయల్ తెలిపారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను భారతదేశం కలిగి ఉందని శ్రీ గోయల్ అన్నారు. వివిధ ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకారం అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. స్టార్టప్ ఇండియా ద్వారా సాధించిన అనుభవం, నైపుణ్యాన్నిస్టార్టప్ ఆఫ్రికా కోసం అందించడానికి డీపీఐఐటీ సిద్ధంగా ఉందని శ్రీ గోయల్ అన్నారు.
“మీరు వేగంగా వెళ్లాలనుకుంటే, ఒంటరిగా వెళ్ళండి; మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే, కలిసి వెళ్లండి” అన్న ఒక ప్రసిద్ధ ఆఫ్రికా సామెతను ఉటంకించిన శ్రీ గోయల్ “కలిసి రండి, కలిసి పని చేద్దాం మరియు కలిసి అభివృద్ధి సాధిద్దాం !” అని అన్నారు.
***
(Release ID: 1842884)
Visitor Counter : 162