వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుర్వేద, సిద్ధ, యునాని ఔషధాల విక్రయాలపై ఇ-కామర్స్ సంస్థలకు సలహాలు జారీ చేసిన సీసీపీఏ


ఇ-కామర్స్ సంస్థలు రిజిస్టర్డ్ చేయబడ్డ ఆయుర్వేదం, సిద్ధ లేదా యునాని ప్రాక్టీషనర్ ఆమోదిత ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే మందులను విక్రయించాలి.

Posted On: 14 JUL 2022 4:59PM by PIB Hyderabad

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ రూల్స్, 1945లో నమోదు చేసిన షెడ్యూల్ E (1)లో ఉన్న ఆయుర్వేదసిద్ధ మరియు యునాని ఔషధాల విక్రయానికి సంబంధించి ఇ-కామర్స్ సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఒక సలహాను జారీ చేసింది. ఈ-కామర్స్ సంస్థలు రిజిస్టర్ చేయబడ్డ ఆయుర్వేదసిద్ధ లేదా యునాని వైద్యులు రాసిన ఆమోదిత స్క్రిప్షన్‌ను ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అప్‌లోడ్ చేసిన తర్వాత మాత్రమే అటువంటి మందుల విక్రయం చేయాలని సూచించబడింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇటువంటి మందులను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్, 1945లోని రూల్ 161(2) ప్రకారంమానవ రోగాల చికిత్స కోసం, అంతర్గత ఉపయోగం కోసం ఒక ఔషధం యొక్క కంటైనర్షెడ్యూల్ E (1)లో పేర్కొన్న పదార్ధంతో రూపొందించబడి ఉంటేఅది లేబుల్ చేయబడాలి. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో "జాగ్రత్త: వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి" అనే పదాలతో స్పష్టంగా రాసి ఉండాలి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ 01.02.2016 న ఒక పబ్లిక్ నోటీసును జారీ చేసింది. పైన పేర్కొన్న ఔషధాలను వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలని, వైద్య సలహా లేకుండా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడాన్ని నివారించాలని వాటాదారులకు తెలియజేస్తుంది.

వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 18 ప్రకారంసీసీపీఏ వినియోగదారుల హక్కులను రక్షించడానికిప్రోత్సహించడానికి మరియు హక్కులను అమలు చేయడానికి, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి చర్యలు తీసుకుంటుంది. సీసీపీఏ అక్రమ వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి, ఏ వ్యక్తి కూడా అన్యాయమైన వ్యాపార పద్ధతుల్లో తనను తాను మోసపోకుండా ఉండేందుకు చర్యలను తీసుకుంటుంది.

వినియోగదారుల సంక్షేమాన్ని ప్రభావితం చేసే సమస్యలను సీసీపీఏ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇటీవల, CCPA అక్రమ వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో సేవా ఛార్జీల విధింపుకు సంబంధించి వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు మార్గదర్శకాలను జారీ చేసింది. సీసీపీఏ తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. అటువంటి ప్రకటనల నుండి వినియోగదారులను రక్షించడానికి తప్పుదారి పట్టించే ప్రకటనలపై సిఫార్సులు చేసింది.

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారుల హక్కులను కాపాడేందుకువినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) రూల్స్, 2020లోని రూల్ 6లోని సబ్-రూల్ (5) ప్రకారం విక్రేతల వివరాలను తప్పనిసరిగా అందించాలని సీసీపీఏ అన్ని మార్కెట్‌ప్లేస్ ఇ-కామర్స్ సంస్థలకు ఒక సలహాను జారీ చేసింది. ఫిర్యాదు అధికారి పేరు, సంప్రదింపు నంబర్‌తో సహాప్లాట్‌ఫారమ్‌లోని వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా అందించాలని పేర్కొనబడింది.

చట్టంలోని సెక్షన్ 18(2)(j) ప్రకారం, ఐఎస్ఐ మార్క్ లేని, BIS ప్రమాణాలను ఉల్లంఘించే వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను అప్రమత్తం చేయడానికి సీసీపీఏ భద్రతా నోటీసులను జారీ చేసింది. హెల్మెట్‌లుప్రెజర్ కుక్కర్లు మరియు వంట గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి మొదటి సేఫ్టీ నోటీసు జారీ చేయగాఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్లుకుట్టు మిషన్లుమైక్రోవేవ్ ఓవెన్‌లుఎల్‌పిజితో కూడిన గృహోపకరణాలు మొదలైన గృహోపకరణాలకు సంబంధించి రెండవ సేఫ్టీ నోటీసు జారీ చేయబడింది.

 

*****

 

(Release ID: 1841671) Visitor Counter : 217