రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

భారత్‌లో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న వివిధ వర్గాలకు చెందిన తేలికపాటి, మధ్యస్థ, హెవీ డ్యూటీ మోటారు వాహనాల కోసం ఇంధన వినియోగ ప్రమాణాలకు (FCS) అనుగుణంగా ఉండేలా నోటిఫికేషన్ జారీ

Posted On: 06 JUL 2022 2:22PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తేలికపాటిమధ్యస్థ, హెవీ డ్యూటీ మోటారుల కోసం ఇంధన వినియోగ ప్రమాణాలకు (ఎఫ్‌సిఎస్) సమ్మతిని చేర్చడానికి సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ (సిఎమ్‌విఆర్) 1989లోని రూల్ 115G ని సవరిస్తూ జూలై 1, 2022 తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేయబడిన వివిధ వర్గాల వాహనాలు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 149లో వివరించిన ఉత్పత్తికి అనుగుణమైన విధానం ప్రకారం ఎఫ్‌సీఎస్‌కు కొనసాగింపు సమ్మతి ధృవీకరించబడుతుంది.

ఈ నోటిఫికేషన్‌కు ముందువార్షిక ఇంధన వినియోగ ప్రమాణానికి అనుగుణంగా M1 కేటగిరీ (ప్రయాణికుల కోసం ఉపయోగించే మోటారు వాహనండ్రైవర్ సీటుతో పాటు 8 సీట్లకు మించకుండా) స్థూల వాహన బరువు (GVW)తో 3.5 టన్నుల వరకు పరిమితం చేయబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క లక్ష్యం FCSకు అనుగుణంగా వాహనాల పరిధిని విస్తరించడం, మరింత ఇంధన సామర్థ్య వాహనాలను వాడుకలోకి తీసుకురావడం.

ఈ నోటిఫికేషన్ వర్తించే తేదీ 01 ఏప్రిల్ 2023. నోటిఫికేషన్ తేదీ నుండి 30 రోజులలోపు వాటాదారులందరి నుండి వ్యాఖ్యలు స్వీకరించబడతాయి.

***(Release ID: 1839772) Visitor Counter : 126