బొగ్గు మంత్రిత్వ శాఖ

నాన్ ఎగ్జిక్యూటివ్ వర్క్‌ఫోర్స్ వేతన ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.


పరస్పర అంగీకార ఒప్పందం కోసం చర్చలు పురోగతిలో ఉన్నాయి

Posted On: 06 JUL 2022 10:47AM by PIB Hyderabad

కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఎన్‌సిడబ్ల్యూఏ- XI ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు సమావేశాలను నిర్వహించిందని బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కంపెనీ తన నాన్-ఎగ్జిక్యూటివ్ వర్క్‌ఫోర్స్ వేతన ఒప్పందాన్ని పరస్పరం ఆమోదయోగ్యమైన పద్ధతిలో త్వరగా ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సీఐఎల్‌ దాని యూనియన్‌లతో స్నేహపూర్వక మరియు సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంది. దేశంలో బొగ్గు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని  విభేదాలు లేదా సమ్మెలను నివారించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయి మరియు సాధారణంగా ఒప్పందాన్ని ముగించడానికి సమయం పడుతుంది.

ఇంతకుముందు మూడు వేతన ఒప్పందాలను విజయవంతంగా ముగించిన దేశంలోనే మొదటి సిపిఎస్‌యు సీఐఎల్‌ అని పేర్కొనడం సముచితం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా వేతన ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని సిఐఎల్ భావిస్తోంది.

పై ప్రకటనకు విరుద్ధమైన ఏదైనా నివేదిక వాస్తవికంగా తప్పు మరియు ఏకపక్షంగా ఉంటుందని పేర్కొనబడింది.

 

 

****



(Release ID: 1839560) Visitor Counter : 165