మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మణిపూర్ మహిళా వ్యాపారుల కోసం సామర్ధ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన జాతీయ మహిళా కమిషన్
Posted On:
05 JUL 2022 5:14PM by PIB Hyderabad
మహిళా వ్యాపారుల సమగ్ర అభివృద్ధికి, వారికి మరిన్ని వ్యవస్థాపక అవకాశాలను కల్పించడం కోసం రాష్ట్ర మహిళా కమిషన్ సహకారంతో మణిపూర్ మహిళా వ్యాపారుల కోసం జాతీయ మహిళా కమిషన్ ఒక రోజు సామర్ధ్య నిర్మాణ శిక్షణా కార్యకక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
హీఖం డింగో సింగ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ పాల్గొన్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో స్టాళ్ళను నిర్వహించే మణిపూర్‌లోని ఇమా కీథెల్ ఆసియాలోనే అతి పెద్ద మహిళా మార్కెట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఈశాన్య రాష్ట్రాలలో కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనుగుణంగా మూడు ఇమా కీథెళ్ళకు చెందిన మహిళా వ్యాపారుల కోసం జాతీయ మహిళా కార్యక్రమం వారి జీవనోపాధి, సామాజిక భద్రతను, మొత్తంగా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరేన్ సింగ్ ఇందులో పాల్గొన్న మహిళలను ప్రోత్సహించారు. మహిళా సాధికారత కోసం జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. నేటి వరకూ ఏడు ఇమా మార్కెట్ల నిర్మాణం జరిగిందని, త్వరలోనే మరిన్ని మార్కెట్ల నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు మణిపూర్‌లోని అన్ని రంగాలలోనూ భాగస్వాములుగా ఉండడమే కాక తాము దేనినైనా, ఏదైనా చేసుకోగలమని రుజువు చేసుకున్నారని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ చెప్పారు. ఇ- మార్కెట్లలో కూడా మణిపూర్ మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించాలని తాము కోరుకుంటామని ఆమె అన్నారు. మహిళలు తమను తాము మణిపూర్‌కు పరిమితం చేసుకోకూడదని, ప్రపంచం మారుతోందని, ప్రపంచంలో ఏ మైలకైనా తమ ఉత్పత్తులు చేరుకునేలా చేసేందుకు మహిళలు సాంకేతిక పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మేం వారు ఎగరడానికి రెక్కలను ఇవ్వడమే కాక, ఈ ఉత్పత్తుల గురించి ప్రపంచం తెలుసుకునేలా ఇ-కామర్స్, ఇతర సాంకేతికతలలో శిక్షణ ఇస్తామని రేఖా శర్మ వివరించారు.
వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులనే కాక, ఇ- కామర్స్, బ్యాంకింగ్, పన్ను చట్టాలు తదితర ముఖ్య అంశాల గురించి మహిళలకు చెప్పి, బోధించేందుకు బ్యాంకింగ్ రంగానికి చెందిన వారిని రిసోర్స్ పర్సన్లుగా కమిషన్ ఆహ్వానించింది. ఈ శిక్షణా కార్యక్రమం మూడు సాంకేతిక సెషన్లుగా విభజించారు. తొలి సెషన్ - సంబంధిత బ్యాంకింగ్ పథకాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడం ఎలా అన్నదానిపై కాగా, రెండవ సెషన్ - పన్ను చట్టాలు/ జిఎస్టీ చట్టాలు, పన్ను వర్తింపు అన్న అంశం కాగా, మూడవ సెషన్ ఇ- కామర్స్ డెమాన్‌స్ట్రేషన్ అన్న అంశంపై నిర్వహించారు.
***
(Release ID: 1839494)
Visitor Counter : 221