ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 04 JUL 2022 11:22AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.98 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,13,864

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

గత 24 గంటల్లో 13,958 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,79,477 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,135 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.85%

వారపు పాజిటివిటీ రేటు 3.74%

గత 24 గంటల్లో చేసిన 3,32,978 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.39 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1839091) Visitor Counter : 115