ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ కాన్ఫరెన్స్ 2022కు అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ.
భారత ఫార్మకోపియా 9 వ ఎడిషన్‌ను విడుదలచేసిన మంత్రి.
ప్రపంచంలోనే అతిపెద్ద జనిరిక్ మెడికేషన్ సరఫరాదారు భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నజెనిరిక్ మెడిసిన్ లో 20 శాతం భారతదేశం నుంచే సరఫరా అవుతున్నది.
అంతర్జాతీయ వాణిజ్యం, దేశీయ పరిశ్రమలు, అంతర్జాతీయ మార్కెట్ దృష్టితో ఫార్మకోపియా రంగానికి మనం ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించవలసి ఉంది : డాక్టర్ మన్‌సుక్ మాండవీయ
"వైద్య ఉత్పత్తుల ప్రామాణికత, నాణ్యతను పాటించడం ద్వారా స్వాస్త్య,సమృద్ధ్ భారత్‌ను అభివృద్ధి చేయడానికి ఫార్మకోపియా ఎంతో కీలకమైనది "
Posted On:
01 JUL 2022 3:57PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం , రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన భారత ఫార్మకోపియా సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఇండియన్ ఫార్మకోపియా 9వ ఎడిషన్ ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తోకలిసి విడుదల చేశారు. ఈ ఏడాది జరుగుతున్న ఈ సదస్సు ఇతివృత్తం భవిష్యత్తుకోసం ఔషధ నాణ్యతా సమస్యను పరిష్కరించడం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ , కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ, ప్రపంచవ్యాప్తంగా భారత ఫార్మకోపియా విజ్ఞానం గుర్తింపు పొందిందని, ప్రపంచ వ్యాప్త ప్రశంసలు అందుకుంటున్నదని అన్నారు. మనం ప్రపంచ ఫార్మసీగా రూపుదిద్దుకున్నామని, జెనిరిక్ మెడిసిన్‌ఫార్ములేషన్ , తయారీ, ప్రపంచానికి తక్కువ ధరకే ఔషధాలు సరఫరాచేయడంలో ప్రపంచవ్యాప్త పేరు తెచ్చుకున్నామని చెప్పారు. అయితే మనం ఇంకా ఫార్మాసూటికల్స్ రంగంలో పరిశోధనలను బలోపేతం చేసుకోవలసి ఉందిని, ఇప్పటివరకు నాలుగు దేశాలు, ఆప్ఘనిస్థాన్, ఘనా, నేపాల్ , మారిషస్‌లు ఐపిని ప్రమాణాల పుస్తకంగా అంగీకరించాయని అన్నారు. మనం ఇందుకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించుకుని ముందుకు కదలాలని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. దీనివల్ల మరిన్ని దేశాలు మన ఫార్మకోపియాను ఆమోదించడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం పాత్ర గురించి ప్రస్తావిస్తూ, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత , మనం ఆ దిశగా సాగిస్తున్న కృషితో ప్రపంచం మనల్నిగుర్తించడం మొదలు పెట్టిందని అన్నారు. ఆయా దేశాలు మన కృషిని గుర్తిస్తూ దానిని ఆమోదిస్తున్నాయని అన్నారు. దేశీయ ఔషధాలలో మన సమర్ధత ఆధారంగా అంతర్జాతీయ వాణిజ్యం , పరిశ్రమలపై దృష్టి సారించడం ద్వారా మన దేశ ఫార్మాకోపియా ఎలా ప్రయోజనం పొందగలదనే దానిపై మనం దృష్టి పెట్టాలని మాండవీయ అన్నారు.మన వైద్య ఉత్పత్తులు-వ్యాక్సిన్‌లు, మందులు, పరికరాలు మొదలైన వాటి ప్రామాణిక నాణ్యతను పాటించడానికి, రోగులపై ఈ మందుల ప్రభావంపై నిఘా ఉంచడానికి, స్వాస్త్య, సమృద్ధ్ భారత్‌ను అభివృద్ధి చేయడానికి ఫార్మకోపియా ముఖ్యమైనదని ఆయన అన్నారు.
జనిరిక్ మందులకు సంబంధించి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద సరఫరా దారు అని, ప్రపంచ వ్యాప్త జనిరిక్ మందుల సరఫరాలో ఇది 20 శాతం వరకు ఉన్నదని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇండియా వాక్సిన్‌ను 150 దేశాలకు తక్కువ ధరకు సరఫరాచేసిందన్నారు.వాక్సిన్ లు ఇతర జెనిరిక్ ఔషధాలను ఎన్నో దేశాలకు పంపిణీ చేయడంలో భారతదేశం నాణ్యత, ప్రమాణాల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. నకిలీ మందుల సరఫరా కానీ లేదా నాణ్యత లేని ఔషధాల పంపిణీ వంటి పనులు చేయలేదు. అందువల్లే ఇండియా ఈ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది అని మంత్రి అన్నారు.
భారత ఫార్మకోపియా గురించి,
ఇండియన్ ఫార్మకోపియా (ఐపి)ని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (ఐపిసి) భారతప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత ఫార్మకోపియా కమిషన్ (ఐపిసి ) ప్రచురించింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940 ప్రకారం తీసుకోవలసిన చర్యలకు అనుగుణంగా ప్రభుత్వం దీనిని ప్రచురించింది. ఐపి అనేది భారతదేశంలో తయారయ్యే, లేదా మార్కెట్ చేసే ఔషధాలకు సంబంధించి అధికారిక ప్రమాణాలను సూచిస్తుంది. ఆ రకంగా మందుల నాణ్యత నియంత్రణకు వీలు కల్పిస్తుంది. ఈ ఐపి ప్రమాణాలు అధీకృతమైనవి, చట్టపరంగా అమలు చేయదగ్గవి. ఇది తయారీ లైసెన్సింగ్, పరిశీలన, మందుల పంపిణీకి సహాయపడేందుకు ఉద్దేశించినది.
ఐపి 2022 లో మొత్తం 92 కొత్త మోనోగ్రాఫ్‌లు ఉన్నాయి. ఇందులో 60 రసాయన, 21 విటమిన్‌లు, మినరల్స్, అమినో యాసిడ్‌లు, ఫాటీ యాసిడ్‌లు తదితరాలుఉన్నాయి. 3 బయోటెక్నాలజీ నుంచి వచ్చిన థెరాపిటిక్ ఉత్పత్తులు, 4 మానవ వాక్సిన్‌లు, 3 రక్తం, రక్త సంబంధిత ఉత్పత్తులు, 2 వనమూలికలు, వనమూలికల ఆధారిత ఉత్పత్తులు, 7 ఫైటో ఫార్మసూటికల్ పదార్థాలు కలిగిన రకగం మోనోగ్రాఫ్‌లు ఉన్నాయి. ఇది ప్రస్తుత ఐపి ఎడిషన్‌తో మొత్తం 3,152కు మోనోగ్రాఫ్లకు చేరుకుంది. దీనికితోడు, 12 కొత్త చాప్టర్లు కూడా ప్రవేశపెట్టారు. పలు మోనోగ్రాఫ్‌లు, జనరల్ చాప్టర్లు కూడా రివైజ్‌చేసి అప్‌డేట్ చేశారు. వీటిని ప్రస్తుత అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దారు. ఇతర ఫార్మకోపియాలు అయిన యుఎస్ పి, బిపి, ఇపి తదితరాలకు అనుగుణంగా తీర్చి దిద్దారు. ఈ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టుచేయడం వల్ల ఐపికి విదేశాలలో గుర్తింపు, ఆమోదం లభించడానికి తోడ్పడుతోంది.
ఐపి విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని ఐపిసి , ఐపిసి కాన్ఫరెన్స్ 2022ను ఏర్పాటు చేసింది. ఫార్మా పరిశ్రమకు చెందిన 350 రిజిస్టర్డ్ ఉన్నతస్థాయి ఫార్మా సంస్థలు, రాష్ట్ర కేంద్ర డ్రగ్ రెగ్యులేటరీ సంస్థలు, అంతర్జాతీయ ఫార్మకోపియా సంస్థలు (బిపి, యుఎస్‌పి), పరిశ్రమ సంస్థలైన ఐడిఎంఎ, బిడిఎంఎ, ఐపిఎ వంటివి, విద్యా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.ఈ సదస్సులో ఫార్మకోపియాకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు తమ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఫార్మకోపియా ప్రమాణాలు, రెగ్యులేటరీ, నాణ్యతా అంచనాలు, భారత ఫార్మా పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగించారు.. అనంతరం పానెల్ చర్చ జరిగింది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఆరోగ్య సేవల డైరక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి.సోమాని, ఐపిసి సెక్రటరీ, సైంటిఫిక్ డైరక్టర్ డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశి, పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1838876)
Visitor Counter : 187