కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వివిధ పోస్టుల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన గ్రామీణ డాక్ సేవకుల (జీడీఎస్) డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం చివరి తేదీని 15 జూలై 2022 వరకు పొడిగించిన తపాలా శాఖ
प्रविष्टि तिथि:
01 JUL 2022 2:19PM by PIB Hyderabad
వివిధ పోస్టుల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన గ్రామీణ డాక్ సేవకుల (జీడీఎస్) డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం చివరి తేదీని జూలై 15, 2022 వరకు పొడిగించాలని పోస్ట్‌ల శాఖ నిర్ణయించింది. అసొంలో నెలకొన్న వరద పరిస్థితుల కారణంగా తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. "అసోంలో వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివిధ పోస్టుల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీని జూన్ 30 నుండి జూలై 15, 2022 వరకు పొడిగించడమైంది" అని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 1838640)
आगंतुक पटल : 224