వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22 ఆర్ధిక సంవత్సరానికి 30% వృద్ధితో అత్యధిక స్థాయి లో రూ. 57,586.48 కోట్ల ( 7.76 బిలియన్ డాలర్ల)కు చేరిన మనదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు


ప్రధాన ఎగుమతిగా అగ్రస్థానంలో ఉన్న శీతలీకరించిన రొయ్యలు

అమెరికా, చైనా, యూరప్ కూటమి , ఆగ్నేయ ఆసియా, జపాన్ , మధ్య తూర్పు దేశాలు మన సముద్ర ఉత్పత్తుల ప్రధాన దిగుమతిదారులు

Posted On: 29 JUN 2022 3:15PM by PIB Hyderabad

భారతదేశం 2021-22 ఎగుమతుల్లో భారీ అసమానతలు ఉన్నప్పటికీ రూ. 57,586.48 కోట్ల (7.76 బిలియన్ డాలర్ల ) విలువైన 13,69,264 మెట్రిక్ టన్నుల సముద్ర ఆహారాన్ని రవాణా చేసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరం ఎగుమతుల్లో రూపాయి పరంగా 31.71%, డాలర్ మారకంగా 30.26% పరిమాణ పరంగా 19.12% మెరుగుపడింది. 2020-21లో, భారతదేశం రూ. 43,720.98 కోట్ల ( 5,956.93 మిలియన్ డాలర్ల) విలువైన 11,49,510 మెట్రిక్ టన్నుల సముద్రపు ఆహారాన్ని ఎగుమతి చేసింది.

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (MPEDA) ఛైర్మన్ శ్రీ కె ఎన్ రాఘవన్ మాట్లాడుతూ, భారతదేశం తన ప్రధాన ఎగుమతి మార్కెట్లలో కోవిడ్ మహమ్మారి కారణాన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, 13,69,264 మెట్రిక్ టన్నుల  పరిమాణంతో   7.76 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగింది.
శీతలీకరించిన రొయ్యలు పరిమాణం, విలువ పరంగా ప్రధాన ఎగుమతి వస్తువు. రూ. 42,706.04 కోట్లు 5,828.59 మిలియన్ డాలర్లు) ఆర్జించిన  రొయ్యల ఎగుమతులు  పరిమాణంలో 53.18 శాతం, మొత్తం విదేశీ మారక ఆదాయంలో 75.11 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ కాలంలో రొయ్యల ఎగుమతులు డాలర్  విలువలో 31.68 శాతం పరిమాణంలో 23.35 శాతం పెరిగాయి.

2021-22లో రొయ్యల మొత్తం ఎగుమతి 7,28,123 మెట్రిక్ టన్నులైతే అమెరికా  అతిపెద్ద మార్కెట్ గా   3,42,572 మెట్రిక్ టన్నుల  రొయ్యలను దిగుమతి చేసుకుంటుంది, చైనా (1,25,667 మెట్రిక్ టన్నుల), యూరోపియన్ యూనియన్ (90,549 మెట్రిక్ టన్నుల), సౌత్ ఈస్ట్ ఆసియా (44,683 మెట్రిక్ టన్నుల), జపాన్ (38,492 మెట్రిక్ టన్నుల),   మధ్యప్రాచ్యం (37,158 మెట్రిక్ టన్నుల) గణాంకాలతో  శీతలీకరించిన  రొయ్యల ఎగుమతి విలువ ప్రకారం అన్ని మార్కెట్లలో పెరుగుదలను చూపింది.

వన్నామీ (వైట్ లెగ్) రొయ్యల ఎగుమతి 2021-22లో 5,15,907 మెట్రిక్ టన్నుల నుండి 6,43,037 మెట్రిక్ టన్నులకి పెరిగింది. డాలర్  విలువ పరంగా మొత్తం వన్నామీ రొయ్యల ఎగుమతులలో, అమెరికా 59.05% వాటాను కలిగి ఉంది, చైనా (14.59 %), యూరోపియన్ యూనియన్ (8.16 %), సౌత్ ఈస్ట్ ఆసియా (4.78 %), జపాన్ (3.61 %) , (3.17 %)తో  మధ్య ప్రాచ్యం ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. డాలర్  విలువ పరంగా 25.90% వాటాతో బ్లాక్ టైగర్ రొయ్యలకు అమెరికా  ప్రధాన మార్కెట్‌గా మారింది, యూరోపియన్ యూనియన్ (23.78%) జపాన్ (22.71%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

 రెండవ అతిపెద్ద ఎగుమతి వస్తువుగా సురిమి ఉత్పత్తులు, రూ. 3,979.99 కోట్లు (USD 540.73 మిలియన్లు) పొందింది, పరిమాణంలో 12.96% మరియు డాలర్ ఆదాయంలో 6.97 %. ఇతర వస్తువుల ఎగుమతులు రూపాయి విలువలో 43.8% మరియు డాలర్ విలువలో 42.94% పెరిగాయి. ఇతర సముద్ర ఎగుమతుల్లో  USD పరంగా 56.55%  వాటాతో సురిమి ఉత్పత్తులు ఉంటాయి.

మూడవ అతిపెద్ద ఎగుమతి వస్తువు శీతలీకరించిన చేపలు రూ. 3471.91 కోట్లు (471.45 మిలియన్ డాలర్లు)  పరిమాణంలో 16.55 శాతం, డాలర్ ఆదాయంలో 6.08 శాతం. ఘనీభవించిన చేపల ఎగుమతి పరిమాణంలో 20.44% మరియు డాలర్ విలువలో 17.19% పెరుగుదల సాధ్యం అయ్యింది.

 

స్క్విడ్( కోమటి సంచులు అని పిలిచే జలచరం) ఎగుమతి, 75,750 మెట్రిక్ టన్నుల వద్ద నమోదైంది, పరిమాణంలో 23.82% మరియు డాలర్ పరంగా 40.24 శాతం వృద్ధిని చూపి,రూ. 2,806.09 కోట్లు (383.37 USD మిలియన్లు) ఆర్జించింది.

 

 నురుగు చేప (కటిల్ ఫిష్) ఎగుమతి, 58,992 మెట్రిక్ టన్నుల వద్ద నమోదైంది, రూపాయి విలువలో 26.83 % మరియు USD విలువలో 26.18 % వృద్ధిని చూపి, రూ. 2062.63 కోట్లు (280.08 USD మిలియన్లు) ఆర్జించింది.

 

ఎండు చేపల ఎగుమతి, 73,679 మెట్రిక్ టన్నుల వద్ద నమోదైంది, రూపాయి విలువలో 28.27 % వృద్ధిని చూపింది కానీ USD విలువలో 8.59 % క్షీణించింది. రూ. 1472.98 కోట్లు (143.46 USD మిలియన్లు) ఆర్జించింది.
ఆశాజనక రంగంగా పరిగణించే శీతలీకరించిన వస్తువుల ఎగుమతి కూడా పరిమాణం పరంగా 23.08 %,  రూపాయి పరంగా 53.45 % పెరిగింది కానీ డాలర్  పరంగా 1.87 శాతం క్షీణించింది.

ప్రత్యక్ష వస్తువుల ఎగుమతి, 7,032 మెట్రిక్ టన్నుల వద్ద నమోదైంది, పరిమాణంలో 60.57%, రూపాయి విలువలో 47.43%, డాలర్  పరంగా 46.67% వృద్ధిని చూపింది.

 

మొత్తం మీద శీతలీకరించిన  రొయ్యలు,   కటిల్ ఫిష్,   స్క్విడ్, ఎండిన వస్తువులు, ఇతర వస్తువుల యూనిట్ విలువ వాస్తవ సానుకూల వృద్ధిని చూపింది.

 

విదేశీ మార్కెట్ల విషయానికొస్తే, అమెరికా 3371.66 మిలియన్ డాలర్ల దిగుమతివిలువతో  భారతీయ మత్స్య ఉత్పత్తుల  ప్రధాన దిగుమతిదారుగా కొనసాగింది, డాలర్ విలువ పరంగా 37.56 % వాటాను కలిగి  ఎగుమతులు పరిమాణంలో 27.63 %, రూపాయి విలువలో 36.76 % డాలర్ ఆదాయాలలో 37.56 % వృద్ధిని నమోదు చేశాయి. ఘనీభవించిన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అయిన ప్రధాన వస్తువుగా తన గత పరంపరను  కొనసాగించింది, వన్నామీ రొయ్యల ఎగుమతులు పరిమాణంలో 26.81% మరియు డాలర్ పరంగా 34.65% వృద్ధిని కనబరిచాయి. అమెరికాకు  బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులు పరిమాణం పరంగా 68.99% మరియు డాలర్ పరంగా 152.06% పెరిగాయి.
 

డాలర్లలో  1,175.05 మిలియన్ల విలువైన 2,66,989 మెట్రిక్ టన్నుల దిగుమతితో భారతదేశం నుండి చైనా రెండవ అతిపెద్ద సముద్ర ఆహార ఎగుమతి గమ్యస్థానంగా ఉద్భవించింది, పరిమాణంలో 19.50% డాలర్ పరంగా 15.14%. చైనా మార్కెట్‌కు ఎగుమతులు పరిమాణంలో 22.28%, రూపాయి విలువలో 31.09% డాలర్  విలువలో  25.12% పెరిగాయి. చైనాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువైన   రొయ్యలు పరిమాణంలో 47.07% మరియు డాలర్ విలువలో 67.04% వాటాను కలిగి ఉండగా,   చేప పరిమాణం పరంగా 32.10% మరియు మొత్తంలో విలువ పరంగా 15.19% వాటాను కలిగి ఉంది. చైనాకు ఎగుమతులలో   రొయ్యలు   పరిమాణంలో సానుకూల వృద్ధిని చూపించాయి.

ఎగుమతులలో ప్రధాన వస్తువు అయిన ఘనీభవించిన రొయ్యలతో భారతీయ సముద్ర ఆహారానికి యూరోపియన్ యూనియన్ మూడవ అతిపెద్ద గమ్యస్థానంగా కొనసాగింది, పరిమాణం డాలర్ విలువలో వరుసగా 29.11% మరియు 37.09% పెరుగుదల నమోదు చేసింది.

 

ఆగ్నేయాసియా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ఘనీభవించిన రొయ్యలు, ఎగుమతులలో ప్రధాన వస్తువు, పరిమాణంలో 18.36% వాటా మరియు డాలర్  విలువ ద్వారా 36.81% 22.29% వృద్ధితో. ఘనీభవించిన చేప,  పరిమాణంలో 33.42% వాటాతో,డాలర్  విలువ ద్వారా 21.42% 82.24% వృద్ధితో ఎగుమతులలో రెండవ ప్రధాన అంశంగా ఉంది.

 

డాలర్  విలువ పరంగా 5.68%, పరిమాణంలో 6.60% వాటాతో జపాన్ ఐదవ అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగింది, డాలర్  విలువలో 6.95 % వృద్ధిని నమోదు చేసింది. ఘనీభవించిన రొయ్యలు 74.55% % వాటాతో డాలర్ విలువలో 3.73% వృద్ధితో జపాన్‌కు ఎగుమతులలో ప్రధాన వస్తువుగా కొనసాగింది.

మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు   పరిమాణంలో 20.2%, రూపాయిలో 21.27% డాలర్ పరంగా 20.7% వృద్ధిని చూపించాయి.

 

***

 

(Release ID: 1838112) Visitor Counter : 154