రక్షణ మంత్రిత్వ శాఖ
ఒడిషా తీరం నుంచి విజయవంతంగా అభ్యాస్- హైస్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గట్ ప్రయోగం
Posted On:
29 JUN 2022 2:50PM by PIB Hyderabad
హైస్పీడ్ ఎక్సపెండబుల్ ఏరియల్ టార్గెట్ (అత్యంత వేగంగా సాగగల గగన లక్ష్యం - హెచ్ఇఎటి) - అభ్యాస్ (ఎబిహెచ్ఎఎస్)ను ఓడిషా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి 29 జూన్ 2022న విజయవంతంగా పరీక్షించారు. స్థిరమైన స్థాయి, అత్యధిక విన్యాసాలు సహా తక్కువ ఎత్తులో విమానం పనితీరు ఈ ప్రయోగం సందర్భంగా ప్రదర్శితమైంది. ముందస్తుగా నిర్దేశించిన తక్కువ ఎత్తులో విమాన పథంలో భూమిపై ఉండే నియంత్రిక నుంచి లక్ష్యిత విమానాన్ని ప్రయోగించారు. దీనిని రాడార్, ఎలెక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ వ్యవస్థ సహా ఐటిఆర్ మోహరించిన పలు అనుగామి సెన్సార్ల ద్వారా దీనిని పర్యవేక్షించారు.
అభ్యాస్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజషన్ (డిఆర్‌డిఒ)కు చెందిన ఎయిరోనాటికల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఈ గగన వాహనాన్ని దిగువన అమర్చిన రెండు బూస్టర్లను ఉపయోగించి ప్రయోగించారు. ఇది వాహనానం తొలి దశలో వేగంగా వెళ్ళేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక సబ్‌సోనిక్ వేగంలో విమానం ఎగరడాన్ని ఎక్కువ సమయం భరించడాన్ని స్థిరపరచేందుకు చిన్న గ్యాస్ పరివర్తక (టర్బైన్) ఇంజిన్ శక్తిని అందిస్తుంది. లక్ష్యిత విమానానికి ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్‌తో పాటుగా మైక్రో- ఎలక్ట్రోమెకానికల్ సిస్థం ఆధారిత చోదన వ్యవస్థను మార్గదర్శనానికి, నియంత్రణ కోసం అమర్చడమే కాక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు, లక్ష్యిత విమానానికి మధ్య సంక్షిప్త సంకేత సందేశాల కోసం డాటా లింక్‌ను ప్రతి తక్కువ ఎత్తులో ఉన్న విమానానికి దేశీయ రేడియో ఆల్టిమీటర్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో స్వీయప్రేరితంగా ఎగిరేందుకు వాహనాన్ని ప్రోగ్రాం చేశారు.
అభ్యాస్ విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఒను, సాయుధ దళాలను, పరిశ్రమను అభినందించారు. సాయుధ దళాల గగన లక్ష్యాల అవసరాలను ఈ వ్యవస్థ నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, పరీక్షకు కారణమైన బృందాల కృషిని రక్షణ శాఖ ఆర్&డి విభాగం కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి ప్రశంసించారు.
***
(Release ID: 1838111)
Visitor Counter : 220