యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ భారతదేశంలోకి అడుగుపెట్టిన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే


- ఉత్తర భారతదేశంలోని 20 నగరాలలో ప‌ర్య‌టించిన త‌రువాత ప‌శ్చిమ భార‌తావ‌నిలోకి..

Posted On: 29 JUN 2022 3:03PM by PIB Hyderabad

మొట్టమొదటి చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ఈరోజు ఉదయం జైపూర్‌కు చేరుకుంది. దీంతో టార్చ్ రిలే పశ్చిమ భారతదేశంలోకి అడుగుపెట్టిన‌ట్ట‌యింది. అజ్మీర్ దాటిన తర్వాత, టార్చ్ రిలే అహ్మదాబాద్‌లోకి ప్రవేశించి, కెవాడియా, వడోద‌రా, సూరత్, దండి, డామన్, నాగ్‌పూర్, పుణే, పంజిమ్‌ న‌గ‌రాల‌లోకి ప్రయాణిస్తుంది. ఆ తర్వాత టార్చ్ రిలే భారతదేశం యొక్క తూర్పు భాగంలోకి ప్రవేశిస్తుంది, ఆ త‌రువాత ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశానికి చేరుకుంటుంది. ఈ టార్చ్ తొలిసారిగా ఉత్తర భారతదేశం నుంచి త‌న యాత్ర‌ను ప్రారంబించింది.  ఆ త‌రువాత గత 10 రోజుల‌లో ఢిల్లీ, జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్‌లోని 20 నగరాలగుండా ప్రయాణించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థంగా జ‌రుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు వేడుక‌ల‌కు గుర్తుగా ఈ టార్చ్ రిలే మొత్తం 75 నగరాలకు వెళుతుంది.  
ప్ర‌ధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభం..
ఈ చెస్ ఒలింపియాడ్ కోసం మొట్టమొదటి టార్చ్ రిలేను భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 19, 2022న న్యూఢిల్లీలోని ఐజీ స్టేడియంలో ప్రారంభించారు. ఎఫ్ఐడీఈ అధ్య‌క్షుడు  ఆర్కాడీ డ్వోర్కోవిచ్ టార్చ్‌ను ప్రధానికి అందజేయగా, ఆయన దానిని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు అందజేశారు. చారిత్రాత్మక ప్రయోగం తరువాత, ఈ టార్చ్  దేశ రాజధానిలోని ఎర్రకోట, ధర్మశాలలోని హెచ్‌పీసీఏ, అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు, ఆగ్రాలోని తాజ్ మహల్ మరియు లక్నోలోని విధానసభతో సహా ప్రముఖ ప్రదేశాలలో ప్రయాణించింది. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వరీలాల్ పురోహిత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజీజు వంటి ప్ర‌ముఖులు  చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేకు సంబంధించిన వివిధ‌ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. టార్చ్ రిలే ఈవెంట్‌లు సిమల్ చెస్‌తో ప్రారంభమవుతాయి, ఇందేలో గ్రాండ్‌మాస్టర్‌లు, ప్రముఖులు స్థానిక క్రీడాకారులతో గేమ్ ఆడతారు. ఆ తరువాత టార్చ్‌ జీప్ ద్వారా వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా, ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించే ఇంటరాక్టివ్ బస్ టూర్, యువ చెస్ ప్లేయర్స్ కమ్యూనిటీని కలిగి ఉన్న ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉండే సాంస్కృతిక కవాతుతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
చెస్ ఒలింపియాడ్‌లో 20 మంది ఆటగాళ్లు
ప్రతిష్టాత్మక ఈ పోటీ చరిత్రలో మొదటి సారిగా భారతదేశం 44వ ఎఫ్ఐడీఈ చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించడమే కాకుండా, 1927 ఏడాదిలో ప్రారంభమైన ఎఫ్ఐడీఈ  పోటీ చరిత్రలో మొదటి సారిగా టార్చ్ రిలేను ప్రారంభించిన మొదటి దేశం కూడా భార‌త దేశ‌మే కావ‌డం విశేషం. ఈ పోటీని నిర్వ‌హిస్తున్న భారతదేశం 44వ ఎఫ్ఐడీఈ  చెస్ ఒలింపియాడ్‌లో 20 మంది ఆటగాళ్లను రంగంలోకి త‌న వంతుకు రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉంది. ఓపెన్ మరియు మహిళల విభాగంలో భారత్‌కు 2 జట్లను బరిలోకి దింపేందుకు అర్హత ఉంది. చెస్ ఒలింపియాడ్ చరిత్రలో అత్యధికంగా 188 దేశాల నుండి 2000 మందిఈ ఈవెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 44వ ఎఫ్ఐడీఈ  చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జూలై 28 నుండి ఆగస్టు 10, 2022 వరకు జరుగుతుంది.
                                                                             

*******


(Release ID: 1838110) Visitor Counter : 125