మంత్రిమండలి
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల రంగం లో సహకారం కోసంభారతదేశ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన విభాగాని కి, సింగపూర్ వ్యాపారం మరియు పరిశ్రమలమంత్రిత్వ శాఖ కు మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు)ఆమోదం తెలిపిన మంత్రిమండలి
प्रविष्टि तिथि:
29 JUN 2022 3:50PM by PIB Hyderabad
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల రంగాల లో సహకారం కోసం భారతదేశ గణతంత్రానికి చెందిన విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన విభాగాని కి, సింగపూర్ కు చెందిన వ్యాపారం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) యొక్క వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి తెలియపరచడమైంది. ఈ ఎమ్ఒయు పై 2022 ఫిబ్రవరి లో సంతకాలు అయ్యాయి.
ఈ ఎమ్ఒయు ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఆ యంత్రాంగం దీనికై ఒక ఇకోసిస్టమ్ ను రూపొందించడం లో సాయపడుతుంది. దీనిలో పరస్పర సహకారం అనే మాధ్యమం ద్వారా నూతన సాంకేతికత నిర్మాణం, సిబ్బంది కి శిక్షణ, ఐపి జనరేశన్ లకై ఉభయ దేశాల లోనూ నూతన ఆవిష్కరణ లను మరియు నవపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించవచ్చును.
ఈ సహకారం లో భాగం గా అమలుపరచేటటువంటి కార్యక్రమాల ద్వారా అందే నూతన జ్ఞానం మరియు సాంకేతికవిజ్ఞాన సంబంధి అభివృద్ధి అనేవి ‘ఆత్మనిర్భర్ భారత్’ కు వేగాన్ని అందిస్తాయి. ఈ ఎమ్ఒయు రెండు దేశాల లో కొత్త సాంకేతికత ను సృష్టించడానికి, సిబ్బంది కి శిక్షణ ను ఇవ్వడానికి, ఐపి జనరేశన్ కు దారితీసే విధం గా నూతన ఆవిష్కరణల కు, నవపారిశ్రామికత్వాని కి ప్రోత్సాహాన్ని అందించే ఒక ఇకోసిస్టమ్ ను స్థాపించేందుకు తగిన యంత్రాంగాన్ని అందజేస్తుంది. ఎమ్ఒయు లో పొందుపరచిన కార్యకలాపాల లో ఉత్పాదన సంబంధి అభివృద్ధి మరియు సాంకేతికత యొక్క ఆదాన ప్రదానం అనేవి భాగం గా ఉంటాయి. ఫలితం గా కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు కు మరియు ఉపాధి అవకాశాల కు ఆస్కారం ఉంటుంది.
ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం యొక్క ఉద్దేశ్యం భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ లలో సమానమైన ఆసక్తి ఉన్న రంగాల లో సహకారాన్ని ప్రోత్సహించడం, దానిని వికసింపచేయడమే కాక సౌకర్యవంతం గా తీర్చిదిద్దడమూ ను. పరస్పర హితం ముడిపడినటువంటి ఏ రంగం లో అయినా ఈ విధమైన సహకారానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది; ఆ సహకారం అనేది ఈ కింద ప్రస్తావించిన రంగాల లో పరిశోధన, నూతన ఆవిష్కరణ మరియు సాంకేతికపరమైన వికాసం లో ప్రగతి ని ప్రోత్సహించగలిగేది గా ఉండాలి :
i. వ్యవసాయం, ఆహార సంబంధిత విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం;
ii. అధునాతన తయారీ మరియు ఇంజీనియరింగ్;
iii. హరిత ఆర్థిక వ్యవస్థ, శక్తి, జలం, జలవాయు మరియు ప్రాకృతిక వనరులు;
iv. డేటా సైన్స్, కొత్త గా ఉనికి లోకి వస్తున్న సాంకేతికత లు;
v. అడ్వాన్స్ డ్ మెటీరియల్స్; ఇంకా
vi. ఆరోగ్యం మరియు బయోటెక్నాలజీ.
ఉమ్మడి హితం ముడిపడ్డ ఇతర రంగాల ను కూడా పరస్పర సమ్మతి తో చేర్చడం జరుగుతుంది.
***
(रिलीज़ आईडी: 1837962)
आगंतुक पटल : 343
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam