గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2014 నుండి, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కార్యక్రమాన్ని , దేశ ఆర్థిక, సుస్థిర వృద్ధి లక్ష్యాలను సాధించడానికి వివిధ గుణాత్మక విధానాలు , జోక్యాలను చేపట్టింది: శ్రీ హర్దీప్ ఎస్. పూరి;


పారిస్ ఒప్పందం వాతావరణ మార్పు కట్టుబాట్లను నెరవెర్చేలా భారతదేశ సుస్థిర పట్టణ రవాణా విధానాలకు రూపకల్పన

Posted On: 29 JUN 2022 1:36PM by PIB Hyderabad

భారతదేశం ప్ర పంచంలోనే రెండో అతిపెద్ద

 పట్టణ వ్యవస్థ అని, మొత్తం ప్రపంచ పట్టణ జనాభాలో 11% మంది భారతీయ

నగరాలలో నివసిస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి

 శ్రీ హర్దీప్ ఎస్. పూరి అన్నారు.2018-2050 మధ్య కాలంలో మన పట్టణ జనాభాలో 416 మిలియన్ల మంది చేరతారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోందని ఆయన చెప్పారు.భారత దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడం లో మాత్రమే గాక సుస్థిర వృద్ధి లక్ష్యాలను సాధించడంలో కూడా మన

నగరాలు కీలకమైన పాత్రను పోషిస్తాయని, భారత దేశ  నగరాలు జాతీయ జీడీపీలో దాదాపు 70% వాటాను అందిస్తున్నాయని, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో 44% వాటాను భారత నగరాలు కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

 

పోలాండ్ లోని కోటవిస్ లో జరుగుతున్న 11వ వరల్డ్ అర్బన్ ఫోరమ్ లో మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ లో జూన్ 28న భారత ప్రతినిధి వర్గం నాయకుడు, ఎంఒహెచ్ యుఎ

అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు.

 

భారత ప్రభుత్వం నిద్రాణ స్థితిలో ఉన్న సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుందని పేర్కొన్న మంత్రి, 2014 నుండి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని, న్యూ అర్బన్ ఎజెండా ప్రధాన సూత్రాలను అవలంబించే వివిధ పరివర్తనాత్మక విధానాలు, జోక్యాల ఫలితంగా  భారతదేశ ఆర్థిక , సుస్థిర వృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతీయ నగరాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు.

 

భారతదేశ పట్టణాభివృద్ధి ప్రాధాన్యతల పిరమిడ్ సహకార , పోటీ సమాఖ్య, ప్రాథమిక సేవల సార్వత్రికీకరణ, గ్రామీణ-పట్టణ కొనసాగింపుపై ఆధారపడి ఉందని శ్రీ హర్దీప్ ఎస్.పూరి అన్నారు.హౌసింగ్ ఫర్ ఆల్' 'క్లీన్ ఇండియా మిషన్' పథకాలు గృహనిర్మాణం,  పారిశుధ్య ప్రాథమిక అవసరాలను తీరుస్తాయని ఆయన అన్నారు.ముఖ్యంగా 'క్లీన్ ఇండియా మిషన్' ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, నగరాల వార్షిక పరిశుభ్రత సర్వే ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుధ్య సర్వే అని ఆయన అన్నారు.

పై రెండు పథకాలను,  పట్టణ ప్రాంతాల నిర్దిష్ట అవసరాలను విజయవంతంగా పరిష్కరించిన ఇతర ప్రధాన (ఫ్లాగ్ షిప్ ) కార్య క్రమాలను గురించి ప్రస్తావిస్తూ, అటల్

మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్

ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్ ) మంచి నీటి సరఫరా, పార్కులు, వీధి దీపాలు వంటి మౌలిక పౌర సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి చెప్పారు.భారతదేశ స్మార్ట్ సిటీస్ మిషన్ పౌర-కేంద్రిత కార్యక్రమాల ద్వారా 100 స్మార్ట్ నగరాల్లో జీవన నాణ్యతను గణనీయంగా పెంచిందని తెలిపారు. పిఎం స్ట్రీట్ వెండర్స్ స్వావలంబన నిధి ఒక ప్రత్యేకమైన ప్రయోగం అని, దీని ద్వారా మహమ్మారి సమయంలో అత్యంత నిస్సహాయ వర్గమైన వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించారని శ్రీ పూరి అన్నారు.‘‘మా స్థిరమైన పట్టణ రవాణా విధానాలు పారిస్ ఒప్పందంలోని వాతావరణ మార్పు కట్టుబాట్లను నెరవేర్చడానికి రూపొందించబడ్డాయి.ప్రతి సంవత్సరం, వాతావరణ మార్పులకు ప్రతిఘటనగా భారతదేశ పట్టణ ప్రకృతి దృశ్యానికి రికార్డు స్థాయిలో ప్రజా రవాణా , చలనశీలత ఎంపికలు జోడించబడుతున్నాయి‘‘ అని ఆయన తెలిపారు.

 

మహమ్మారి ప్రారంభం పట్టణ లోపాల రేఖలను తీవ్రతరం చేసిందని, సహజ అసమానతలను బహిర్గతం చేసిందని శ్రీ పూరి అన్నారు, మహమ్మారి నుండి మనం బయటపడుతున్న ప్రస్తుత సమయం లో మన విధానాలను సమ్మిళితం, లింగ సమానత్వం , పర్యావరణ న్యాయం దిశగా అనుసంధానించ వలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

పట్టణ సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రభుత్వాలు సాధికారత కల్పించాలని ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీలు, సంక్షేమ ప్రయోజనాల పోర్టబిలిటీ, సరసమైన ధరలో అద్దె గృహాలు వంటి చర్యల ద్వారా భారతదేశం మహమ్మారి కష్టాలను తగ్గించిందని ఆయన అన్నారు.

 

వసుదైక కుటుంబం అంటే 'ప్రపంచం ఒకే కుటుంబం' అనే తత్త్వాన్ని అనుసరించే వారిగా, తోటి దేశాలతో ఉత్తమ విధానాలను పంచుకోవడం ప్రాముఖ్యతను భారతదేశం విశ్వసిస్తుందని మంత్రి అన్నారు.

సంపన్నమైన , సుస్థిరమైన ప్రపంచం కోసం  భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన అనుభవాలను తెలుసుకోవడానికి , పంచుకోవడానికి 11వ వరల్డ్ ఫోరమ్ దోహద పడాలని మంత్రి ఆకాంక్షించారు. 

***


(Release ID: 1837933)