ప్రధాన మంత్రి కార్యాలయం

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్జర్మనీ చాన్స్ లర్ తో సమావేశమైన ప్రధాన మంత్రి 

Posted On: 27 JUN 2022 9:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ సమావేశమయ్యారు.

 




ఈ సంవత్సరం ఇద్దరు నేత ల మధ్య సమావేశం జరగడం ఇది రెండో సారి; మునుపటి సమావేశం ఇండియా-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల కోసం ఇదే సంవత్సరం లో మే 2వ తేదీ నాడు ప్రధాన మంత్రి బెర్లిన్ యాత్ర కాలం లో చోటు చేసుకొంది. జి-7 శిఖర సమ్మేళనాని కి తనను ఆహ్వానించినందుకు గాను చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కిందటి నెల లో జరిపిన చర్చల కు తరువాయి గా నేత లు ఇరువురు వారి యొక్క హరిత మరియు సతత అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేశారు. సమావేశం లో జలవాయు సంబంధి కార్యాచరణ, తత్సంబంధిత ఆర్థిక సహాయం లతో పాటుగా సాంకేతిక విజ్ఞానం బదలాయింపు వంటి అంశాల పైన కూడా చర్చను చేపట్టడమైంది. వ్యాపారాన్ని, పెట్టుబడి ని మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాల ను మరింత గా పెంపొందింపచేసుకోవలసిన ఆవశ్యకత ఉందనే అంశాల పై ఇరువురు నేత లు వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.

సమావేశం సాగిన క్రమం లో, అంతర్జాతీయ సంస్థల లో ఇప్పటి కంటే ఎక్కువ గా సమన్వయాన్ని ఏర్పరచుకోవలసి ఉందనే అంశం పైన, విశేషించి భారతదేశం త్వరలో జి-20 అధ్యక్ష స్థానాన్ని స్వీకరించనున్న సందర్భం లో కూడా చర్చించడం జరిగింది. నేతలు ఇద్దరూ ప్రాంతీయ స్థాయి లోను, ప్రపంచవ్యాప్తం గాను చోటు చేసుకొన్న ఘటన క్రమాల పైన వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు.

**



(Release ID: 1837594) Visitor Counter : 95