సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం దినోత్స‌వం సంద‌ర్భంగా న‌షా ముక్త్ భార‌త్ అభియాన్ ప‌రుగు

Posted On: 26 JUN 2022 12:15PM by PIB Hyderabad

మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగానికి వ్య‌తిరేకంగా సామాజిక న్యాయం& సాధికార‌త విభాగం ఆదివారం న్యూఢిల్లీలోని ప్ర‌గ‌తివిహార్‌, భీష్మ‌పితామ‌హ మార్గ్‌లోని జ‌వ‌హ‌ర‌లాల్ నెహ్రూ స్టేడియంలో న‌షా ముక్త్ భార‌త్ అభియాన్ ర‌న్‌- 19వ ప‌రుగును నిర్వ‌హించింది.  ఈ ర‌న్‌ను యువ‌త‌ను, ఇత‌రుల‌ను మాద‌క ద్ర‌వ్యాల నుంచి దూరం చేసి దేశాన్ని మాద‌క‌ద్ర‌వ్యాల ముక్తం చేయ‌డం కోసం న్యూఢిల్లీకి చెందిన హెల్త్ ఫిట్‌నెస్ ట్ర‌స్ట్‌తో క‌లిసి నిర్వ‌హించింది. ఈ మేర‌కు ఇందులో పాలుపంచుకున్న వారంద‌రి చేత ప్ర‌తిజ్ఞ చేయించారు. 


మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగానికి వ్య‌తిరేకంగా సామూహిక అవ‌గాహ‌న‌ను వ్యాప్తి చేయ‌డం కోసం ప్ర‌తిజ్ఞ అనంత‌రం సామాజిక న్యాయం & సాధికార‌త శాఖ మంత్రి డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్ ర‌న్‌కు జెండా ఊపి ప్రారంభించారు. 


ప్ర‌పంచాన్ని మాద‌క ద్ర‌వ్యాల ముక్తం చేయాల‌న్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు స‌హ‌కారాన్ని, చ‌ర్య‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఏడాది 26 జూన్‌న అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ‌ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ఈ ర‌న్‌ను దీని గురించి అవ‌గాహ‌న‌ను సృష్టించి, మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగానికి వ్య‌తిరేకంగా ఒక ఐక్య  కూట‌మిని అందించేందుకు నిర్వ‌హించారు.


దేశ‌వ్యాప్తంగా న‌షా ముక్త్ భార‌త్ అభియాన్ పేరుతో దేశంలోని 272 గుర్తించిన జిల్లాల‌లో ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ 272 జిల్లాల్లోనూ ప్ర‌చార కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించేందుకు 8000కు పైగా నిపుణులైన వాలంటీర్లు ఉన్నారు. వీరు 1.20 కోట్ల మంది యువ‌త‌, 31 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు స‌హా మొత్తం 3.10 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ వాస్త‌వంగా నిర్వ‌హించిన వివిధ కార్య‌క‌లాపాల ద్వారా చేరువ కానున్నారు.  నేటి వ‌ర‌కూ నిషా ముక్త అభియాన్ ఫ‌లితాలు ఎంతో ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మంత్రిత్వ శాఖ 2022 సంవ‌త్స‌రాంతానికి  నిర్వ‌చించిన పారామ‌తుల‌కు లోబ‌డి 100 జిల్లాల‌ మాద‌క ద్ర‌వ్యాల ముక్తంగా ప్ర‌క‌టించేందుకు తీవ్రంగా ప‌ని చేస్తోంది. 


ఈ ఏడాది ఇతివృత్తం - మాద‌క‌ద్ర‌వ్యాల‌పై వాస్త‌వాల‌ను పంచుకోండి, జీవితాల‌ను కాపాడండి. ఆరోగ్య సంబంధిత స‌మస్య‌లు, ప్ర‌పంచంలో మాద‌క ద్ర‌వ్యాల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం నుంచి, ప్ర‌మాణాల ఆధారిత నివార‌ణ‌, చికిత్స‌, సంర‌క్ష‌ణ స‌హా మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కానికి సంబంధించిన  వాస్త‌వాల‌ను పంచుకుంటూ, త‌ప్పుడు స‌మాచారంపై పోరాటం చేయాల‌న్న‌ది ఉద్దేశ్యం.  


న‌షా ముక్త భార‌త్ అభియాన్ ర‌న్‌- మాద‌క ద్ర‌వ్యాల‌కు వ్య‌తిరేకంగా ప‌రుగు అన్న సామూహిక కార్య‌క్ర‌మ చొరవ‌ను  1 కిమీ, 5కిమీలు, 10 కిమీల ప‌రుగుతో పాటుగా, జుంబా త‌ర‌గ‌తులు, ఎయిరోబిక్స్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నారు.


****


(Release ID: 1837239) Visitor Counter : 597