ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ లో జరిగిన రోడ్డు దుర్ఘటన లో ప్రాణ నష్టంవాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
22 JUN 2022 9:42PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రం గా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
‘‘ ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ లో జరిగిన దుర్ఘటన అత్యంత బాధకారమైంది గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నేను ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక పాలన యంత్రాంగం శాయశక్తులా సాయపడడం లో తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.
*****
DS/ST
(Release ID: 1836474)
Visitor Counter : 107
Read this release in:
Bengali
,
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam