వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
9 సంవత్సరాల విరామం తర్వాత, భారతదేశం యూరప్ దేశాల కూటమి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు తిరిగి ప్రారంభించారు
శ్రీ పీయూష్ గోయల్, యూరోపియన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ వాల్డిస్ డోంబ్రోవ్స్కిస్ బ్రస్సెల్స్ నగరం లోని EU ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక సంయుక్త కార్యక్రమంలో పెట్టుబడి రక్షణ ఒప్పందం , నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం -GI ఒప్పందం కోసం చర్చల ప్రారంభాన్ని కూడా ప్రకటించారు.
జూన్ 27న న్యూఢిల్లీలో తొలి రౌండ్ చర్చలు ప్రారంభం కానున్నాయి.
యూరప్ దేశాల కూటమి తన 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి- భారతదేశానికి అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో, భారతదేశం-EU సరుకుల వాణిజ్యం 2021-22లో 43.5% వృద్ధితో 116.36 బిలియన్ డాలర్ల అత్యధిక విలువ నమోదు చేసింది.
Posted On:
18 JUN 2022 11:21AM by PIB Hyderabad
బ్రస్సెల్స్ లోని యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగిన సంయుక్త కార్యక్రమంలో, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు; ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ యూరోపియన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్ సమక్షంలో యూరోపియన్ కమిషన్ అధికారికంగా భారతదేశం-యూరప్ కూటమి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా, స్వతంత్ర పెట్టుబడి రక్షణ ఒప్పందం (IPA) మరియు భౌగోళిక సూచికలు (GI) ఒప్పందం కోసం కూడా చర్చలు ప్రారంభించారు.
గత సంవత్సరం, 8 మే 2021న పోర్టోలో జరిగిన భారతదేశం మరియు యూరప్ నాయకుల సమావేశంలో, సమతుల్యమైన, ప్రతిష్టాత్మకమైన, సమగ్రమైన, పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద చర్చలను పునఃప్రారంభించడం, స్వతంత్ర పెట్టుబడి రక్షణ ఒప్పందం IPAపై తాజా చర్చలు ప్రారంభించడం, GIలపై ప్రత్యేక ఒప్పందం కోసం మరొక ఒప్పందం కుదిరింది. 2013లో జరిగిన చర్చలు, ఆమోదయోగ్యం అవాల్సిన అంశాల తేడాలు అంచనాల కారణంగా విరమించుకున్నందున, దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఇద్దరు భాగస్వాములు ఇప్పుడు చర్చలు పునఃప్రారంభిస్తున్నారు.
ఏప్రిల్ 2022లో యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఢిల్లీ పర్యటన, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలి యూరప్ పర్యటన FTA చర్చల ప్నురక్రియ వేగవంతం చేసింది. చర్చల కోసం స్పష్టమైన దిశను నిర్వచించడంలో సహాయపడింది.
అమెరికా తర్వాత EU కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినందున ఇది భారతదేశానికి అత్యంత ముఖ్యమైన FTAలలో ఒకటి. భారతదేశం-EU మర్చండైజ్ వాణిజ్యం 2021-22లో 43.5% వృద్ధితో 116.36 బిలియన్ డాలర్ల అధిక విలువ నమోదు చేసింది. EUకి భారతదేశం ఎగుమతులు FY 2021-22లో 57% పెరిగి $65 బిలియన్లకు చేరుకున్నాయి. EUతో భారతదేశం మిగులు వాణిజ్యాన్ని కలిగి ఉంది.
ఇద్దరు భాగస్వాములు ఒకే విధమైన ప్రాథమిక విలువలు ఉమ్మడి ఆసక్తులను కలిగి ఉన్నారని, రెండు అతిపెద్ద బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్నందున, వాణిజ్య ఒప్పందం సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి సురక్షితంగా ఉంచడానికి, పరస్పర వ్యాపారాలకు ఆర్థిక అవకాశాలను పెంచడానికి, ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను తీసుకురావడానికి సహాయపడుతుంది. వాణిజ్య చర్చలు సరసత, పరస్పర అభివృద్ధి సూత్రాల ఆధారంగా విస్తృత-ఆధారిత, సమతుల్యంగా, సమగ్రంగా ఉండాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యానికి ఆటంకం కలిగించే మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం పై కూడా చర్చలు ఈ సమావేశాల్లో జరుగుతాయి.
ప్రతిపాదిత IPA పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి సరిహద్దు-అంతర్లీన పెట్టుబడులకు చట్టపరమైన ఆమోదాన్ని అందిస్తుంది, GI ఒప్పందం హస్తకళలు వ్యవసాయ వస్తువులతో సహా GI ఉత్పత్తుల వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి పారదర్శక నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పుతుందని భావిస్తున్నారు. మూడు ఒప్పందాలను సమాంతరంగా చర్చలు జరిపి, వాటిని ఏకకాలంలో ముగించాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మూడు ఒప్పందాల కోసం మొదటి రౌండ్ చర్చలు 2022 జూన్ 27 నుండి జూలై 1 వరకు న్యూఢిల్లీలో జరుగుతాయి.
భారతదేశం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా, యుఎఇతో రికార్డు సమయంలో FTAలను ముగించింది. కెనడా మరియు బ్రిటన్ లతో FTA చర్చలు కూడా జరుగుతున్నాయి. FTA చర్చలు కీలక ఆర్థిక వ్యవస్థలతో సమతుల్య వాణిజ్య ఒప్పందాలను ఏర్పరచుకోవడానికి, వాణిజ్య పెట్టుబడిని మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలు పునరుద్ధరించడానికి భారతదేశ విస్తృత వ్యూహంలో భాగం.
****
(Release ID: 1835955)
Visitor Counter : 247