రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

అగ్నిపథ్- ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, 16 డిపిఎస్యులలో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్

Posted On: 18 JUN 2022 3:34PM by PIB Hyderabad

అవసరమైన అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అగ్నివీర్లకు రక్షణ మంత్రిత్వ శాఖలో 10% ఉద్యోగ ఖాళీలను రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. 10% రిజర్వేషన్లు ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, మొత్తం 16 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలలో అమలు చేస్తారు. అవి... హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఈఎల్), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఈఎంఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్ (జిఆర్ఎస్ఈ) లిమిటెడ్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్ఎల్), హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్), మజాగన్ డాక్ షిప్‌బిల్డర్స్ (ఎమ్‌డిఎల్), మిశ్రా ధాతు నిగామ్ (మిధానీ) లిమిటెడ్, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఎవిఎన్‌ఎల్), అడ్వాన్స్‌డ్ వెపన్స్ & ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (అవ్ & ఎల్), మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (మిల్), యంట్రా ఇండియా లిమిటెడ్ (యిల్) . ఈ రిజర్వేషన్ మాజీ సైనికుల కోసం ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లకు అదనంగా ఉంటుంది. 

ఈ నిబంధనలను అమలు చేయడానికి సంబంధిత నియామక నిబంధనలకు అవసరమైన సవరణలు చేస్తారు. డిపిఎస్‌యులు తమ నియామక నిబంధనలకు ఇలాంటి సవరణలు చేయాలని సూచించారు. ఈ పోస్ట్‌లకు అగ్నివీర్ల నియామకాన్ని ప్రారంభించడానికి అవసరమైన వయస్సు సడలింపు నిబంధన కూడా రూపొందిస్తారు. 

 

*******(Release ID: 1835234) Visitor Counter : 102