హోం మంత్రిత్వ శాఖ
సి.ఎ.పి.ఎఫ్., అస్సాం రైఫిల్స్ ఖాళీల్లో అగ్నివీరులకు పదిశాతం రిజర్వేషన్
అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవల అనంతరం అవకాశం..
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయం.
గరిష్ట వయోపరిమితిని మించి మూడేళ్ల సడలింపు ఇస్తున్నట్టు ప్రకటన
Posted On:
18 JUN 2022 12:34PM by PIB Hyderabad
కేంద్ర సాయుధ పోలీసు బలగం (సి.ఎ.బి.ఎఫ్.), అస్సాం రైఫిల్స్ దళాల్లో 10శాతం పోస్టుల నియామకాలను అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరులకు కేటాయించాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఎ.) నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవలను పూర్తిచేసిన అనంతరం అగ్నివీరులకు ఈ పోస్టులను కేటాయిస్తారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయం ట్విట్టర్ సందేశాల ద్వారా ఈ విషయం తెలపింది.
అలాగే, సి.ఎ.పి.ఎఫ్., అస్సాం రైఫిల్స్ దశాల్లో నియామకాలకోసం అగ్నివీరులకు ఇదివరకు నిర్ణయించిన గరిష్ట వయోపరిమితి మించి మూడేళ్ల సడలింపు ఇవ్వాలని కూడా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు ఆ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. అంటే, తొలి బ్యాచ్ అగ్నివీరులకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని మించి ఐదేళ్ల సడలింపు లభించినట్టయిందని ఆ సందేశం తెలిపింది.
****
(Release ID: 1835122)
Visitor Counter : 235