ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నేషనల్ హెల్త్ మిషన్ కింద పురోగతి స్థితిగతులను సమీక్షించేందుకు రాష్ట్రాలు/ యుటిలతో చర్చించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ; ఇసిఆర్ పి-II, 15వ ఆర్ధిక కమిషన్ నిధుల కింద పథకాలను వేగవంతం చేయనున్న రాష్ట్రాలు
అన్ని రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం (పిఎం-ఎన్‌డిపి)ను విస్తరింపచేయడంపై దృష్టి
పిఎంఎన్‌డిపి కింద ఉచిత డయాలిసిస్ సేవలను ఉపయోగించుకుంటున్నఅందరు లబ్ధిదారుల వివరాలను గ్రహించడానికి ఎపిఐ ఆధారిత ఐటి వేదిక అయిన పిఎంఎన్‌డిపి పోర్టల్‌ను విస్త్రతంగా వినియోగించవలసిందిగా రాష్ట్రాలు / యుటిలకు సూచన
Posted On:
17 JUN 2022 3:04PM by PIB Hyderabad
నేషనల్ హెల్త్ మిషన్ (జాతీయ ఆరోగ్య మిషన్ -ఎన్‌హెచ్ఎం) కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ (ఇసిఆర్‌పి)-II, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎం- ఎబిహెచ్ఐఎం), 15 ఆర్ధిక కమిషన్ గ్రాంట్లు & ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం (పిఎం -ఎన్‌డిపి) తదితర అంశాల అమలులో సాధిస్తున్న భౌతిక, ఆర్ధిక పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషన్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ (విసి) ద్వారా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు.
దేశవ్యాప్తంగా భరించగల ఖర్చుతో, అందుబాటులో, సమానమైన ప్రజారోగ్య సంరక్షణ సేవలను అందించేలా భారత ప్రభుత్వం తీసుకున్న పలు చొరవలు, చర్యలను పట్టి చూపుతూ, ఎన్‌హెచ్ఎం కింద నిధుల పంపిణీ, కార్యక్రమాల అమలు స్థితిగతులపై వివరణాత్మక ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇసిఆర్‌పి -II ప్యాకేజీ కింద, పిఎం- ఎబిహెచ్ఐఎం కింద వివిధ ప్రాజెక్టులను తెలియచేశారు. ఈ సమావేశం నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాంను 100% విస్తరించడం పై సమావేశం దృష్టి పెట్టింది.
పలు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ ఎం) కింద కేటాయించిన ప్రభుత్వ వనరులును సద్వినియోగం చేసేందుకు కార్యక్రమాలు, చొరవల అమలును వేగవంతం చేసి, నిధులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఉద్ఘాటించారు. నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ సర్టిఫికెట్ల వంటి అవసరమైన పత్రాలు/ వినియోగ సర్టిఫికెట్లను సమర్పించాలని, వినియోగించని నిధులను తిరిగి చెల్లించాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు. దీనితో పాటుగా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (పిఎఫ్ఎంఎస్) పోర్టల్‌పై ఈ బదలాయింపులను మ్యాప్ చేయవలసిందిగా రాష్ట్రాలకు విజ్క్షప్తి చేశారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి సహా అన్ని స్థాయిల్లో సంరక్షణకు సంబంధించిన అవిచ్ఛిన్నత కోసం ఆరోగ్య వ్యవస్థల, సంస్థల సామర్ధ్యాలను అభివృద్ధి చేసి, వర్తమాన, భవిష్యత్ మహమ్మారి ఉపద్రవాలకు సమర్ధవంతంగా స్పందించడం కోసం 2021-22 నుంచి 2025-26 కాలానికి రూ. 64, 180 కోట్ల రూపాయలను పిఎం- ఎబిహెచ్ఐఎం కింద కేటాయించారు. మూలధన పెట్టుబడి కోసం ఈ నిధులను వినియోగించాలన్న ఉద్ఘాటన కారణంగా, పిఎం-ఎబిహెచ్ఐఎం కింద కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను, ఎంఒయులను పంపడం వేగవంతం చేయవలసిందిగా రాష్ట్రాలు/ యుటిలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు నిధులను సకాలంలో విడుదల చేయడం సాధ్యమవుతుందన్నారు. భౌతిక, ఆర్ధిక పురోగతిని మ్యాప్ చేసేందుకు రాష్ట్రాలను భౌతిక సౌకర్యాలను గుర్తించి ఈ మ్యాపింగ్ పనిని ఎన్‌హెచ్ఎం - ప్రోగ్రెస్ మానిటరింగ్ (పిఎంఎస్) పోర్టల్‌పై సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరారు.
ఇసిఆర్‌పి- II ప్యాకేజీ కింద విడుదల చేసిన నిధులను వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని పట్టి చూపుతూ, కేంద్ర వాటా మొత్తాన్ని 100% రాష్ట్రాలకు విడుదల చేసినట్టు వారికి తెలిపారు. ఇసిఆర్‌పి- II కింద వారి ఖర్చు స్థితిగతులను రాష్ట్రాలకు తెలియచేస్తూ, ఎన్‌హెచ్ఎం-పిఎంఎస్ పోర్టల్‌పై ఆమోదించిన వాటి మ్యాపింగ్‌ని పూర్తి చేసి, ఈ స్థితిగతులనను నియమిత కాలంలో సమీక్షిస్తూ ఉండవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేశారు. అదనంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని కోరడానికి బదులుగా ఇసిఆర్‌పి- II కింద రాష్ట్ర ఆరోగ్య సొసైటీలకు (ఎస్‌హెచ్ఎస్) కార్యక్రమాలకు సంబంధించిన మిగిలిన ఆమోదాలను ఇచ్చేందుకు అధికారమిచ్చారు. అంతిమంగా, ఇసిఆర్‌పి- II కింద అన్ని కార్యక్రమాలను 31 డిసెంబర్ 2022నాటికి పూర్తి చేయవలసిందిగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి జాతీయ డయాలిసిస్ కార్యక్రమాన్ని (పిఎంఎన్‌డిపి) దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు అన్ని జిల్లాలలో హీమోడయాలిసిస్ కార్యక్రమాన్ని అమలు చేయడమే కాక, పెరిటోనియల్ డయాలిసిస్ కార్యక్రమాన్ని దానితో పాటుగా ప్రోత్సహించవలసిందిగా రాష్ట్రాలను కోరారు. ఎందుకంటే, ఇది రోగులకు తక్కువ పరిమితులను కలిగి ఉండటమే కాక, సంస్థపై తక్కువ సాంకేతిక డిమాండ్ ఉంటుందని వివరించారు. అలాగే, పిఎంఎన్‌డిపి కింద ఉచిత డయాలిసిస్ సేవలను వినియోగించుకుంటున్న లబ్ధిదారుల వివరాలను సంగ్రహించడం కోసం పిఎంఎన్‌డిపి పోర్టల్‌ను, ఎపిఐ ఆధారిత ఐటి ప్లాట్‌ఫాంను విస్త్రతంగా ఉపయోగించుకోవలసిందిగా రాష్ట్రాలకు సూచించారు. నకలు చేయడాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను, సామర్ధ్యాన్ని, అంతర్ కార్యాచరణను సాధించేందుకు, ఎబిహెచ్ఎ ఐడికి సంబంధించిన 14 అంకెల ప్రత్యేక సంఖ్యను ఉపయోగించి నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలను కోరారు. పూర్తి కవరేజ్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఉపయోగిస్తుంటే, ఎపిఐలను పంచుకుని, పిఎంఎన్‌డిపి పోర్టల్‌తో అనుసంధానం చేయాలని కూడా వారిని కోరారు.
ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో ఎఎస్& ఎండి రోలీ సింగ్, శ్రీ విశాల్ చౌహాన్, సంయుక్త కార్యదర్శి ఇంద్రాణీ కౌశల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్ధిక సలహా దారు, ఇతర సీనియర్ అధికారులు కూడా ఎన్‌హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
***
(Release ID: 1835064)