నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారత సాయుధ దళాల కోసం యువ మరియు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించేందుకు అగ్నిపత్

Posted On: 17 JUN 2022 3:52PM by PIB Hyderabad

దేశ సాయుధ బలగాలను ఆధునీకరించడంయువతకు దేశ సేవ చేసే అవకాశాల కల్పనసైనికోద్యోగం ద్వారా భారతదేశం యొక్క మొత్తం రక్షణ సంసిద్ధతకు దోహదపడే నైపుణ్యం కలిగిన యువకుల పెద్ద సమూహాన్ని సృష్టించడం కోసం అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆవిష్కరించింది. దీనితో పాటు వారి నైపుణ్యాలు, అనుభవంతో తమకు తాముగా అవకాశాలను సృష్టించుకుని ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారు.

 

స్కిల్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (MSDE) అగ్నిపథ్ పథకంతో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాయి. యువ భారతీయుల సైన్యాన్ని సిద్ధం చేస్తున్నందున ఈ కార్యక్రమ అమలులో సాయుధ దళాలతో కలిసి పని చేయనుంది.

 

స్కిల్ ఇండియా మరియు ఎంఎస్‌డీఈ లు సాయుధ బలగాల యొక్క వివిధ విభాగాలతో కలిసి ఈ ఉద్యోగ పాత్రలకు తగినట్లుగా విద్యార్థులకు అదనపు నైపుణ్యాలలో శిక్షణనిస్తాయి.

 

అంతేకాకుండా, అగ్నివీర్‌లు అందరూ సర్వీస్‌లో ఉన్నప్పుడు స్కిల్ ఇండియా సర్టిఫికేషన్‌ను పొందుతారుఇది వారి పదవీకాలం పూర్తయిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపకత మరియు ఉద్యోగాలలో విస్తృత అవకాశాలను కొనసాగించేందుకు వీలు కల్పిస్తుంది.

 

స్కిల్ ఇండియా - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC), వివిధ రంగాల స్కిల్ కౌన్సిల్‌లువ్యవస్థాపకత సంస్థలు NIESBUD మరియు ఐఐఈఅలాగే స్కిల్స్ రెగ్యులేటర్ ఎన్‌సీవీఈటీ యొక్క అన్ని సంస్థలు ఇందులో అనుసంధానించబడతాయి. సేవలో ఉన్నప్పుడు వారి ఉద్యోగ పాత్రలకు సంబంధించి అవసరమైన నైపుణ్య ధృవపత్రాలను ఇవ్వనున్నారు. ఉద్యోగంలో నేర్చుకున్న కొన్ని నైపుణ్యాలు ఎన్ఎస్‌క్యూఎఫ్ సిలబస్‌తో ప్రత్యక్ష సమానత్వాన్ని కలిగి ఉండవచ్చు. కొందరికిఅదనపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్థియరీ లేదా హ్యాండ్-ఆన్ స్కిల్స్‌తో వారి ఉద్యోగ అనుభవాన్ని అందించడం అవసరం కావచ్చు. ఈ వివరాలుఅలాగే సాయుధ దళాల శిక్షకులకు శిక్షణ నిర్వాహకులకుప్రాధాన్యంగా బలగాల నుండిఅంచనా వేయడానికి ధృవీకరించడానికి ఈ అంశాలన్నీ పని చేయబడుతున్నాయి. నిష్క్రమణ సమయంలోమొత్తం నైపుణ్య వ్యవస్థ ఈ యువ అగ్నివీర్‌లకు అందుబాటులో ఉంటుందివారు వారికి అందుబాటులో ఉన్న అనేక నైపుణ్యం/మల్టీ-స్కిల్లింగ్ శిక్షణ మరియు వ్యవస్థాపకత కోర్సుల ద్వారా ప్రయోజనం పొందుతారు.

 

ఈ అగ్నిపథ్ పథకం భారతదేశ టెక్నాలజీ, యువ శ్రామిక శక్తి దేశ ప్రాథమిక విలువలైన నేషన్ ఫస్ట్ తో పాటు దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన సరిహద్దుల రక్షణలో మరియు భారతదేశాన్ని ఆధునికసాంకేతికతతో కూడినయువ గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చడానికి ఈ అగ్నివీర్స్ మారుపేరుగా నిలుస్తారు.

*****



(Release ID: 1835063) Visitor Counter : 152