వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డబ్ల్యుటి ఓ 12వ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కు సారధ్యం వహించి సందేశం అందించిన భారత్: పీయూష్ గోయల్


‘పేదల సంక్షేమంపై ప్రధాని మోదీ దృష్టిని
ప్రపంచ వేదిక పై ఆవిష్కరించనున్న భారత్‘

ఎం ఎస్ ఎం ఇ లు, రైతులు , మత్స్యకారులకు గట్టి మద్దతు గా నిలిచిన భారత్: డబ్ల్యుటిఒలో భారత్ సంకల్పం ద్వారా పేదలు, దుర్బల వర్గాల స్వరానికి బలం చేకూరింది: శ్రీ గోయల్

డబ్ల్యుటిఒ చర్చలకు కేంద్ర బిందువు గా భారతదేశం: ప్రతి డబ్ల్యుటిఒ సమావేశం ఫలితంలో భారతదేశ దృఢమైన ముద్ర కనిపిస్తుంది: శ్రీ గోయల్

"చర్చల ఆటుపోట్లను వైఫల్యం, నిరాశ , వినాశనం నుండి ఆశావాదం, ఉత్సాహం ఏకాభిప్రాయ ఆధారిత ఫలితం దిశగా మార్చిన భారత్ నాయకత్వం: శ్రీ గోయల్

‘ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా సమస్యలను చర్చించడానికి సభ్య దేశాలను వేదిక పైకి తీసుకురావడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలు ప్రపంచ ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చాయి

భారతదేశం తన స్వంత సమస్యలను ప్రస్తావించడమే కాకుండా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎల్ డి సి లు, , పేదలు నిస్సహాయుల సమస్యలను ఎంతో సున్నితత్వంతో లేవనెత్తింది.

పేదలను బాధపెట్టే ఫలితాలను అంగీకరించడానికి భారతదేశం చేతులు ముడుచుకునే రోజులు పోయాయి": శ్రీ గోయల్

Posted On: 17 JUN 2022 2:17PM by PIB Hyderabad

మన రైతులు మత్స్యకారులపై ప్రపంచవ్యాప్త ప్రచారం బలంగా ఉన్నప్పటికీ, చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం డబ్ల్యుటిఓలో అనుకూలమైన ఫలితాన్ని పొందగలిగిందని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం ,ప్రజా పంపిణీ,జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. నేడు జెనీవాలో డబ్ల్యుటిఓ 12 వ మంత్రిత్వ సదస్సు ముగిసిన అనంతరం శ్రీ గోయెల్ మాట్లాడుతూ, ఇప్పుడే ముగిసిన ఎమ్ సి12ను "ఫలిత ఆధారిత" విజయంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్విరామదిశానిర్దేశం మేరకు భారత ప్రతినిధి బృందం ఈ సదస్సు లో

భారత దేశానికి , అభివృద్ధి చెందుతున్న

దేశాలకు చెందిన ప్రాధాన్య సమస్యలను

ప్రపంచం ముందుంచడంలో నూటికి నూరు శాతం విజ యవంతం అయ్యిందని శ్రీ గోయల్ అన్నారు.

 

గ త కొన్ని సంవత్సరాలుగా ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో బలపరచిన పటిష్ట సంబంధాలను భారత ప్రతినిధి బృందం సమర్థంగా ఉపయోగించుకుందని, శ్రీ గోయల్ పేర్కొన్నారు.

 

ఇండియా మొండి వైఖరి వల్ల ఎలాంటి పురోగతి కనిపించడం లేదని తప్పుడు ప్రచారాన్ని సృష్టించేందుకు మొదట ఆది, సోమవారాల్లో  కొన్ని దేశాలు ప్రయత్నించాయి.అయితే .వాస్తవ పరిస్థితి అందరి దృష్టికి వచ్చింది. భారతదేశం లేవనెత్తిన సమస్యలు అన్నీ ప్రధాన మంత్రి నిర్దేశించినవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిని సరైన ఎజెండా గా గుర్తించాయి. అంతిమంగా భారతదేశం అన్ని పరిష్కారాలను సాధించడంలో కీలక పాత్ర పోషించింది" అని శ్రీ గోయల్ జెనీవాలో విలేకరుల సమావేశంలో చెప్పారు.

 

డబ్ల్యుటిఓలో ఈ రోజు 135 కోట్ల మంది భారతీయులకు గర్వించదగిన రోజు అని శ్రీ గోయల్ చెబుతూ,భారత దేశం ఈ

సమావేశానికి ముందు ఉండి కేంద్ర బిందువుగా నిలిచిందని అన్నారు. "ఇది పూర్తి వైఫల్యం, నిరాశ , వినాశనం నుండి ఆశావాదం, ఉత్సాహం ,ఏకాభిప్రాయ ఆధారిత నిర్ణయానికి చర్చల సరళిని మార్చింది‘‘ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా సమస్యలను చర్చించడానికి సభ్యులను ఒక వేదికపైకి తీసుకురావడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలు ప్రపంచ వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా చూసాయి" అని ఆయన అన్నారు.

 

30 సంవత్సరాల క్రితం డబ్ల్యుటిఒను స్థాపించినప్పుడు , ఉరుగ్వే రౌండ్ చర్చల సమయంలో భారతదేశం , ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని రాజీ నిర్ణయాలను అంగీకరించడం వాస్తవమే అన్న శ్రీ గోయల్, n నేడు పర్యావరణం, స్టార్టప్ లు, ఎమ్ఎస్ఎమ్ఈలు లేదా లింగ సమానత్వం వంటి వివిధ సమస్యలపై భయపడకుండా భారతదేశం నేడు ముందు వరుసలో ఉందని అన్నారు. ఇది న్యూ ఇండియా ఆత్మవిశ్వాస ఫలితమేనని,  భారతదేశం ఏకాభిప్రాయాన్ని నిర్మించి, ప్రపంచానికి గెలుపు-గెలుపు ఫలితాన్ని పొందగలదని ఆయన అన్నారు.

 

"ఎం ఎస్ పి వంటి వ్యవసాయానికి సంబంధించినదైనా, జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం లేదా పిఎం గరీబ్ కళ్యాణ్ పథకం, ట్రిప్స్ మాఫీ, ఇ-కామర్స్ మారటోరియం, కోవిడ్ స్పందన  , చేపల వేట కు సంబంధించి మత్స్యకారుల ఆందోళన వంటి ఏ సమస్య పైనా కనీస ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఈ రోజు మేము భారతదేశానికి తిరిగి బయలు దేరుతున్నాం‘‘అని శ్రీ గోయల్ అన్నారు,

"అదే విధంగా , భవిష్యత్తులో భారతదేశంలోని చేతివృత్తుల, సాంప్రదాయ మత్స్యకారులకు ఇబ్బందులు తెస్తుందని మన మత్స్యకారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న చేపల వేట ఆంక్షలు ఇక లేవు.  భారతదేశం వంద శాతం విజయవంతమైంది; భారత దేశం లేదా ప్రభుత్వంపై ఎటువంటి పరిమితులు లేదా నిబంధనలు ఉంచబడలేదు, బదులుగా మేము చట్టవిరుద్ధమైన ఫిషింగ్, అండర్-రిపోర్టింగ్ లేదా బయటి నియంత్రణ, అంటే ఐ యు యు ఫిషింగ్‌పై తనిఖీలను ప్రవేశపెట్టడంలో విజయవంతమయ్యాము‘‘ అని తెలిపారు. .

 

ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్ పి)కి మద్దతు ఇవ్వడానికి భారత దేశం కట్టుబడి ఉంద ని శ్రీ గోయల్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కు ఇటీవల గోధుమ సరఫరాను ఉదహరిస్తూ, ఇతర దేశాలలో ఆహార భద్రత కోసం డబ్ల్యుఎఫ్ పి కొనుగోళ్లపై ప్రభుత్వం ఎటువంటి ఎగుమతి ఆంక్షలను విధించలేదని ఆయన చెప్పారు. అయితే దేశీయ ఆహార భద్రతకు ఎలాంటి ప్రాధాన్యత లోపం ఉండదని స్పష్టం చేశారు.

 

కోవిడ్ 19 కు వ్య తిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం గురించి శ్రీ గోయ ల్ మాట్లాడుతూ, మేధోసంపత్తి హక్కుల వాణిజ్య సంబంధిత అంశాల (ట్రిప్స్ ) నిర్ణయం వ్యాక్సిన్ ఈక్విటీ, యాక్సెసబిలిటీ, స్థోమత ను పెంపొందిస్తుంది. ఇది పేటెంట్ పొందిన వ్యాక్సిన్ల ఉత్పత్తికి అనుమతిని సులభతరం చేస్తుంది.  దేశీయ అవసరాలు ,ఎగుమతుల కోసం భారతదేశం ఉత్పత్తి చేయగలదని చెప్పారు.

 

డబ్ల్యుటిఒ సంస్కరణల ఎజెండా గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, ఏకాభిప్రాయం, ఎస్ అండ్ డిటి నిబంధనలు, ఎస్ డిజి లక్ష్యాలతో సహా డబ్ల్యుటిఒ ప్రాథమిక నిర్మాణం , ప్రధాన సూత్రాలను మరింత సమకాలీనంగా మారుస్తూనే నిలుపుకోబడతాయని అన్నారు. ఇది డబ్ల్యుటిఓకు మంచిదని, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచిదని, పారదర్శక మార్గాల ద్వారా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

 

‘వసుధైక కుటుంబకం' అనే భారతదేశ నినాదం డబ్ల్యుటిఓలో ప్రతిధ్వనించిందని,  భారతదేశం తన స్వంత సమస్యలను ప్రస్తావించడమే కాకుండా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎల్ డి సి లు, , పేదలు నిస్సహాయుల సమస్యలను ఎంతో సున్నితంగా లేవనెత్తిందని, వారి ప్రయోజనం కోసం ధైర్యంగా పోరాడిందని శ్రీ గోయల్ అన్నారు.

 

డబ్ల్యుటిఓ ఎం సి 12 సమావేశం ఫలితాలు

 

*చేపల పరిశ్రమ కు సంబంధించి  మన జలాల్లో , అక్రమంగా నివేదించబడని , క్రమబద్ధీకరించని ఇతర ప్రాంతాల్లో చేపల వేటపై నియంత్రణ ఉంటుంది. చేపల నిల్వలను పునరుద్ధరించడానికి ఓవర్ ఫిష్డ్ ప్రాంతాలపై చాలా కఠినమైన నియంత్రణలు ఉంటాయి.ఇంకా , ఇ ఇ జెడ్ లేదా అర్ ఎఫ్ ఎం ఓ లకు వెలుపల ప్రాంతాల్లో ఫిషింగ్ కోసం ఎలాంటి సబ్సిడీలు ఇవ్వబడవు.

 

*ట్రిప్స్ నిర్ణయం ఎగుమతి, వ్యాక్సిన్ ఈక్విటీ, ప్రాప్యత , స్థోమతను పెంచుతుంది.ఒక దేశం ఇతర చోట్ల పేటెంట్ పొందిన వ్యాక్సిన్ల ఉత్పత్తికి అధికారం ఇవ్వవచ్చు .ఎటువంటి అంగీకారం అవసరం ఉండదు. ఎగుమతుల పై  పరిమితి ఉండదు.డయగ్నాస్టిక్స్/ థెరప్యూటిక్స్ పై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోబడుతుంది. భవిష్యత్తులో వేగవంతమైన మహమ్మారి ప్రతిస్పందన ఉంటుంది.  ఇంకా మహమ్మారి సమయాలలో వాణిజ్య అడ్డంకులు తక్కువగా ఉంటాయి

 

*డబ్ల్యుటిఒ సంస్కరణలపై నిర్ణయించిన అజెండా డబ్ల్యుటిఓను మరింత సమర్థవంతమైన, చురుకైన సంస్థగా మారుస్తుంది.వివాద పరిష్కార సంస్థ పునరుద్ధరించబడుతుంది.  వాణిజ్య వివాదాలను పరిష్కరించడంలో దాని ఆశించిన పాత్రను పోషిస్తుంది.ఈ సంస్కరణ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మెరుగైన వాణిజ్య ఫలితాలను అందిస్తుంది. డబ్ల్యుటిఒ సంస్కరణ అజెండాలో జెండర్, ఎన్విరాన్ మెంట్, ఎం ఎస్ ఎం ఇ గురించి ప్రస్తావించబడింది.

 

*తాత్కాలిక మారటోరియంకు అంగీకరిస్తూనే, ఈ-కామర్స్  మారటోరియంపై దాని పరిధి, నిర్వచనం , దానిపై వివేచనాత్మక నిర్ణయం తీసుకోవడానికి ప్రభావంతో సహా చర్చలను తీవ్రతరం చేయాలని భారతదేశం కోరింది.

 

*ఆహార భద్రతా ప్రకటన,- ఉత్పాదకత , ఉత్పత్తిని పెంచే దిశగా పనిచేస్తూనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహారాన్ని అందుబాటులో ఉంచడంపై దృష్టి సారిస్తుంది.

 

*వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యుఎఫ్ పి) విషయానికి వస్తే, ఇతర దేశాలలో ఆహార భద్రత కోసం డబ్ల్యుఎఫ్ పి కొనుగోళ్లపై ఎగుమతి ఆంక్షలు ఉండవు. అయినా దేశీయ ఆహార భద్రత కే  ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

 

***


(Release ID: 1835058) Visitor Counter : 264