మంత్రిమండలి
ఐఎమ్ టి/5జి స్పెక్ట్రమ్ వేలాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
టెలికమ్ సేవల ను అందించే సంస్థల కు వ్యాపార నిర్వహణ వ్యయాన్ని తగ్గించేచర్యల ను తీసుకోవడం జరిగింది
5జి సేవల ను త్వరలో ప్రవేశపెట్టడం జరుగుతుంది, అవి 4జి కంటె ఇంచుమించు 10 రెట్లు వేగవంతం గా ఉంటాయి
72 గీగాహెర్ట్ జ్ (జిహెచ్ జడ్) కు కు పైగా స్పెక్ర్టమ్ ను 20 సంవత్సరాల కాలాని కి గాను వేలం వేయడంజరుగుతుంది
Posted On:
15 JUN 2022 10:56AM by PIB Hyderabad
ప్రజల కు మరియు వ్యాపార సంస్థల కు 5జి సేవల ను అందించడం కోసం స్పెక్ట్రమ్ ను సఫలమైన వేలందారుల కు కేటాయించడం కోసం స్పెక్ట్రమ్ యొక్క వేలం ను నిర్వహించాలి అంటూ టెలికమ్యూనికేశన్స్ విభాగం చేసిన ఒక ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
డిజిటల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ల వంటి కార్యక్రమాల మాధ్యమం ద్వారా డిజిటల్ కనెక్టివిటీ అనేది ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన విధాన సంబంధి కార్యక్రమాల లో ఓ మహత్వపూర్ణ భాగం గా మారింది.
బ్రాడ్ బ్యాండ్ అనేది ప్రత్యేకించి మొబైల్ బ్రాడ్ బ్యాండ్ అనేది పౌరుల దైనందిన జీవనం లో విడదీయలేనటువంటి భాగం అయిపోయింది. 2015వ సంవత్సరం తరువాతి నుంచి దేశవ్యాప్తం గా 4జి సేవ లు శరవేగం గా విస్తరించడం తో దీనికి ఒక పెద్ద ఉత్తేజం లభించింది. 2014వ సంవత్సరం లో నమోదైన 10 కోట్లు గా ఉన్న చందాదారుల తో పోలిస్తే ప్రస్తుతం 80 కోట్ల మంది చందాదారుల కు బ్రాడ్ బ్యాండ్ విస్తరించింది.
ఈ విధమైనటువంటి అగ్రేసర విధాన సంబంధి కార్యక్రమాల మాధ్యమం ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ను, ఆన్ లైన్ ఎడ్యుకేశన్ ను, టెలి మెడిసిన్ ను, ఇ-రేశన్ ల వంటి వాటి ని అంత్యోదయ కుటుంబాల చెంతకు ప్రభుత్వం తీసుకు పోగలిగింది.
దేశం లో రూపుదిద్దినటువంటి 4జి ఇకో-సిస్టమ్ ఇప్పుడు 5జి ని దేశీయం గా అభివృద్ధి పరచడాని కి బాట ను వేసింది. భారతదేశం లో అగ్రగామి సాంకేతిక విజ్ఞాన సంస్థ లు ఎనిమిదింటి లో 5జి టెస్ట్ బెడ్ సెటప్ అనేది భారతదేశం లో దేశవాళీ 5జి సాంకేతికత యొక్క ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నది. మొబైల్ హ్యాండ్ సెట్ లు, టెలికం ఉపకరణాల కోసం ఉద్దేశించిన ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాలు మరియు ఇండియా సెమీకండక్టర్ మిశన్ యొక్క ప్రారంభం అనే పరిణామాలు భారతదేశం లో 5జి సేవల ను ప్రారంభించడాని కి వీలుగా ఒక బలమైన ఇకో-సిస్టమ్ ను నిర్మించడం లో సహాయకారి అవుతాయన్న అంచనా ఉన్నది. భారతదేశం 5జి సాంకేతికత మరియు త్వరలో రానున్న 6జి సాకేంతికత రంగం లో అగ్రగామి దేశం గా ఉనికి లోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టేటట్లేమీ లేదు.
స్పెక్ట్రమ్ అనేది యావత్తు 5జి ఇకో-సిస్టమ్ లో ఒక విడదీయలేనటువంటి మరియు ఎంతో అవసరమైనటువంటి భాగం గా ఉంది. నూతన తరం వ్యాపారాల ను సృష్టించేటటువంటి, వ్యాపార సంస్థల కు అదనపు ఆదాయాన్ని అందించేటటువంటి మరియు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ద్వారా ఉపాధి అవకాశాల ను కల్పించేటటువంటి శక్తియుక్తులు రాబోయే 5జి సేవల కు ఉన్నాయి.
20 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే వ్యవధి తో మొత్తం 72097.85 మెగా హెర్ట్ జ్ (ఎమ్ హెచ్ జడ్) స్పెక్ట్రమ్ ను 2022వ సంవత్సరం జులై నెల ఆఖరు కల్లా వేలం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలాన్ని వివిధ తక్కువ స్థాయి (600 ఎమ్ హెచ్ జడ్, 700 ఎమ్ హెచ్ జడ్, 800 ఎమ్ హెచ్ జడ్, 900 ఎమ్ హెచ్ జడ్, 1800 ఎమ్ హెచ్ జడ్, 2100 ఎమ్ హెచ్ జడ్, 2300 ఎమ్ హెచ్ జడ్), మధ్య స్థాయి (3300 ఎమ్ హెచ్ జడ్) మరియు అధిక స్థాయి లో 26 గీగా హెర్ట్ జ్ (జిహెచ్ జడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లలో ఉండే స్పెక్ట్రమ్ కోసం నిర్వహించడం జరుగుతుంది.
మధ్య బ్యాండ్ స్పెక్ట్రమ్ ను మరియు అధిక బ్యాండ్ స్పెక్ట్రమ్ ను టెలికమ్ సేవలను అందించే సంస్థ లు 5జి టెక్నాలజీ ఆధారితమైన సేవల ను వేగవంతం గాను, సామర్థ్యం తోను అందించడానికి ఉపయోగించుకొంటాయని ఊహించడం జరుగుతున్నది. ఈ వేగం మరియు సామర్థ్యం ఇప్పటి 4జి సేవల తో పోలిస్తే దాదాపు గా 10 రెట్లు ఎక్కువ గా ఉండగలదు.
టెలికమ్ సెక్టర్ లో 2021వ సంవత్సరం సెప్టెంబర్ లో ప్రకటించిన సంస్కరణ ల వల్ల స్పెక్ట్రమ్ వేలాని కి లబ్ధి కలుగనుంది. సంస్కరణల లో సున్నా స్పెక్ట్రమ్ ఉఫయోగ చార్జీ లు (ఎస్ యుసి) ఒక భాగం గా ఉంది. టెలికమ్ నెట్ వర్క్ ల నిర్వహణ వ్యయం పరం గా చూసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ కు ఇది ఒక మహత్వపూర్ణమైన ఉపశమనాన్ని కలుగజేయనుంది. దీనికి అదనం గా, ఒక వార్షిక కిస్తీ కి సమానమైన ఫినాన్శల్ బ్యాంకు గ్యారంటీ ని జమ చేయాలి అనేటటువంటి నిబంధన ను కూడా తొలగించడమైంది.
టెలికమ్ రంగం లో సంస్కరణ ల జోరు ను కొనసాగిస్తోందా అన్నట్లు గా, మంత్రిమండలి ‘వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం’ పరం గా రాబోయే స్పెక్ట్రమ్ వేలం మాధ్యమం ద్వారా వేలందారులు సేకరించే స్పెక్ట్రమ్ కు సంబంధించి అనేక ప్రగతిశీల ఐచ్ఛికాల ను ప్రకటించింది. మొట్టమొదటిసారి గా, సఫల వేలందారు సంస్థ లు ముందస్తు చెల్లింపు జరపాలి అనేటటువంటి ఒక విధియుక్త నియమం అంటూ ఏదీ ఉండబోదు. స్పెక్ట్రమ్ కోసం చెల్లింపుల ను 20 సమాన వార్షిక కిస్తీ ల రూపం లో చెల్లించవచ్చును, వీటిని ప్రతి సంవత్సరం లో ఏడాది ఆరంభంలో అడ్వాన్స్ రూపం లో చెల్లింపు జరపవలసివుంటుంది. ఇది నగదు ప్రవాహాల తాలూకు అవసరాల ను గణనీయం గా సడలిస్తుందని, అంతేకాక ఈ రంగం లో వ్యాపార నిర్వహణ సంబంధి వ్యయాన్ని తగ్గించగలదని అపేక్షించడమైంది. వేలందారు సంస్థల కు మిగతా కిస్తీలకు సంబంధించినంతవరకు ఎటువంటి భవిష్యత్తు లావాదేవీలు జరపకుండానే 10 సంవత్సరాలు గడచిన తరువాత స్పెక్ట్రమ్ ను వదులుకొనే ఐచ్ఛికాన్ని ఇవ్వడం జరుగుతుంది.
5జి సేవల ప్రారంభాని కి వీలు గా తగినంత బ్యాక్ హాల్ స్పెక్ట్రమ్ లభ్యత కూడా అవసరం. బ్యాక్ హాల్ డిమాండు ను నెరవేర్చడం కోసం, మంత్రివర్గం టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ కు ఇ-బ్యాండ్ లో ప్రత్యేకంగా 250 మెగాహెర్ట్ జ్ (ఎమ్ హెచ్ జడ్) సామర్ధ్యం కలిగి ఉండే రెండు కేరియర్స్ ను తాత్కాలికం గా కేటాయించాలి అని మంత్రిమండలి నిర్ణయించింది. 13, 15,18 మరియు 21 గీగాహెర్ ట్ జ్ (జి హెచ్ జడ్) బ్యాండ్ లో ప్రస్తుత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో సాంప్రదాయక మైక్రో వేవ్ బ్యాక్ హాల్ కేరియర్స్ సంఖ్య ను రెండింతలు చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.
ఆటోమోటివ్ రంగం, ఆరోగ్య సంరక్షణ రంగం, వ్యవసాయ రంగం, శక్తి రంగం, ఇంకా ఇతర రంగాల లో మెషీన్ టు మెషీన్ కమ్యూనికేశన్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ల వంటి ఇండస్ట్రీ 4.0 సేవల లో మరిన్ని నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించడం కోసం ప్రైవేట్ కేప్టివ్ నెట్ వర్క్ లను అభివృద్ధి పరచాలని మరియు వాటి ని స్థాపించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది.
***
(Release ID: 1834263)
Visitor Counter : 273
Read this release in:
Malayalam
,
Bengali
,
Tamil
,
English
,
Marathi
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada