మంత్రిమండలి
azadi ka amrit mahotsav

సాయుధ దళాల్లో యువత నియామకం కోసం రూపొందించిన విప్లవాత్మక 'అగ్నిపథ్ ' పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం సంబంధిత దళంలో నాలుగేళ్ల కాలానికి అగ్ని వీరుల నియామకం


త్రివిధ దళాల్లో అమలులో ఉన్న విధంగా ప్రమాదం, కఠిన కష్టాలకు అలవెన్స్‌లతో కూడిన ఆకర్షణీయమైన నెలవారీ ప్యాకేజీ

నాలుగు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత అగ్నివీరులకు ఒకసారి " సేవ నిధి"ప్యాకేజీ చెల్లింపు

ఈ ఏడాది 46,000 అగ్నివీరుల నియామకం

90 రోజుల్లో నియామకం కోసం ర్యాలీ

భవిష్యత్తు సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సత్తా గల యువత, శారీరక సౌష్టవం, సాంకేతిక నైపుణ్యం గల సిబ్బంది తో సాయుధ దళాలు మరింత బలోపేతం

Posted On: 14 JUN 2022 2:13PM by PIB Hyderabad

సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ అందించే విధంగా యువతను ప్రోత్సహించేందుకు రూపొందించిన నియామక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది.  'అగ్నిపథ్పేరిట అమలు జరిగే ఈ పధకం కింద ఎంపిక అయ్యే వారిని అగ్నివీరులు  "గా పిలుస్తారు.  దేశభక్తిని ప్రేరేపించి దేశానికి సేవ చేసే విధంగా యువతలో స్ఫూర్తి కలిగించే విధంగా  'అగ్నిపథ్పథకానికి రూపకల్పన చేశారు.  సాయుధ దళాల్లో నాలుగు సంవత్సరాలపాటు పనిచేసే అవకాశం  'అగ్నిపథ్ ద్వారా యువతకి కలుగుతుంది. 

సాయుధ దళాలకు యువ రక్తాన్ని అందించాలన్న లక్ష్యంతో  'అగ్నిపథ్రూపొందిందింది. సైనిక దుస్తులు ధరించి దేశానికి సేవ చేయాలన్న  యువత  కలను 'అగ్నిపథ్ సాకారం చేస్తుంది. సమకాలీన సాంకేతిక అంశాలపై అవగాహన కలిగి, ప్రతిభ కలిగిన యువతను ఆకర్షించి వారిని  నైపుణ్యంక్రమశిక్షణ కలిగిన మానవ వనరులుగా  తీర్చి  దిద్ది దేశానికి ప్రయోజనం కలిగించే విధంగా  'అగ్నిపథ్'  అమలు జరుగుతుంది.  'అగ్నిపథ్సాయుధ దళాలకు యువ రూపాన్ని అందించి నూతన స్ఫూర్తి ఉత్తేజాన్ని అందిస్తుంది. ప్రస్తుత సమయంలో అత్యంత అవసరమైన  సాంకేతిక పరిజ్ఞానం గల  సాయుధ దళాలుగా త్రివిధ దళాలు బలోపేతం అవుతాయి.  'అగ్నిపథ్పథకం అమలు చేయడం వల్ల  సాయుధ దళాల సగటు వయస్సు  సుమారు 4-5 సంవత్సరాలు తగ్గుతుందని అంచనా వేయబడింది. స్వీయ-క్రమశిక్షణశ్రద్ధ మరియు లోతైన అవగాహన దృష్టితగినంత నైపుణ్యం గల యువ రక్తం కలిగిన సాయుధ దళాల వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.  ఇతర రంగాలపై ఈ అంశం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తక్కువ వ్యవధి కలిగిన నియామకాల వల్ల దేశం, సమాజం, యువతకి ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి. దేశభక్తిని పెంపొందించడం,  సమిష్టి కృషి చేయడంశారీరక దృఢత్వాన్ని పెంపొందించడందేశం పట్ల అంతర్లీనంగా ఉన్న విధేయతను బహిర్గతం చేసి విదేశాల నుంచి వచ్చే  బెదిరింపులుఅంతర్గత బెదిరింపులు తిప్పికొట్టడం,  ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు  శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండడడం లాంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల కలుగుతాయి. 

త్రివిధ దళాలు, సాయుధ బలగాల  మానవ వనరుల విధానంలో నూతన  శకానికి నాంది పలికేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన రక్షణ విధాన సంస్కరణ ఇది. తక్షణం అమల్లోకి వచ్చే ఈ విధానం, ఇకపై మూడు సర్వీసుల నియామకాలను  నియంత్రిస్తుంది. 

అగ్నివీరులకు ప్రయోజనాలు:

అగ్నివీరులకు   మూడు సేవలలో వర్తించే విధంగా రిస్క్ మరియు హార్డ్‌షిప్ అలవెన్స్‌లతో పాటు ఆకర్షణీయమైన  నెలవారీ ప్యాకేజీ ఇవ్వబడుతుంది. నాలుగు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత   అగ్ని వీరులకు   ఒక సారి 'సేవ నిధి' ప్యాకేజీ చెల్లించబడుతుంది, ఇది వారు చెల్లించే మొత్తం దానిపై వచ్చే వడ్డీ, ప్రభుత్వం చెల్లించే మొత్తం కలిగి ఉంటుంది.  ' సేవ నిధి' మొత్తం కింది విధంగా ఉంటుంది. 

అగ్నివీరులకు ప్రయోజనాలు

అగ్నివీర్లకు  మూడు సేవలలో వర్తించే విధంగా రిస్క్ మరియు హార్డ్‌షిప్ అలవెన్స్‌లతో పాటు ఆకర్షణీయమైన కస్టమైజ్డ్ నెలవారీ ప్యాకేజీ ఇవ్వబడుతుంది. నాలుగు సంవత్సరాల నిశ్చితార్థం వ్యవధి పూర్తయిన తర్వాత,  అగ్నివీర్‌లకు  ఒక సారి 'సేవా నిధి' ప్యాకేజీ చెల్లించబడుతుంది, ఇది వారి సహకారంతో సహా వారి విరాళాన్ని కలిగి ఉంటుంది, దానిపై వచ్చిన వడ్డీ మరియు దిగువ సూచించిన వడ్డీతో సహా వారి సహకారం యొక్క పోగుచేసిన మొత్తానికి సమానం:

సంవత్సరం

అనుకూలీకరించిన ప్యాకేజీ (నెలవారి)

చేతికి వచ్చేది  (70%)

అగ్నివీర్  కార్పస్ ఫండ్‌కు సహకారం  (30%)

కేంద్ర ప్రభుత్వం   కార్పస్ ఫండ్‌కు సమకూర్చే మొత్తం 

రూ.లో అన్ని గణాంకాలు (నెలవారీగా )

  సంవత్సరం

30000

21000

9000

9000

  సంవత్సరం

33000

23100

9900

9900

  సంవత్సరం

36500

25580

10950

10950

  సంవత్సరం

40000

28000

12000

12000

 నాలుగు సంవత్సరాల తర్వాత అగ్నివీర్ కార్పస్ ఫండ్‌ మొత్తం  

రూ 5.02 లక్షలు

రూ 5.02 లక్షలు

సంవత్సరాల తర్వాత నిష్క్రమణ 

సేవ నిధి ప్యాకేజీగా రూ. 11.71 లక్షలు

(వర్తించే వడ్డీ రేట్ల ప్రకారం పై మొత్తం పై సేకరించబడిన వడ్డీ సహా కూడా చెల్లించబడుతుంది)

 

'సేవ నిధి' ఆదాయపు పన్ను నుంచి  మినహాయించబడుతుంది.గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు  ఎటువంటి అర్హత ఉండదు.   భారత సాయుధ దళాలలో పని చేసే  చేసుకునే కాలం వరకు అగ్నివీర్‌లకు రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందించబడుతుంది.

దేశానికి సేవ చేసే ఈ కాలంలో అగ్ని వీరులకు  వివిధ సైనిక నైపుణ్యాలు మరియు అనుభవం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, ధైర్యం మరియు దేశభక్తి వంటివి అందించబడతాయి.  నాలుగు సంవత్సరాల తరువాత అగ్ని వీరులు  పౌర సమాజం భాగస్వాములు అవుతారు.  దేశ నిర్మాణ ప్రక్రియకు వారు తమ వంతు సహకారాన్ని  అపారంగా అందించగలుగుతారు.  ప్రతి  అగ్నివీరుడు  సంపాదించిన నైపుణ్యాలు  అతని ప్రత్యేకమైన రెజ్యూమ్‌లో భాగంగా  సర్టిఫికేట్‌లో గుర్తించబడతాయి.   నాలుగు సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత అగ్ని వీరులకు  వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా తనకు/ఆమె  మెరుగైన అవకాశాలు  పొందేందుకు అవసరమైన పరిపక్వత మరియు స్వీయ-క్రమశిక్షణ కలిగి  ఉంటారు. అగ్నివీర్ పదవి కాలం తర్వాత దేశంలో  వారి పురోగతికి అందుబాటులోకి  మార్గాలు మరియు అవకాశాలు   ఖచ్చితంగా దేశ నిర్మాణానికి సహకరిస్తాయి. అంతేకాకుండా సేవ నిధి గా అందే  సుమారు  11.71 లక్షల రూపాయల మొత్తం ఆర్థిక ఒత్తిడి లేకుండా అతని/ఆమె భవిష్యత్తు కలలను కొనసాగించేందుకు అగ్నివీర్‌కు సహాయం చేస్తుంది.  ఇది సాధారణంగా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు వర్తిస్తుంది.

సాధారణ కేడర్‌గా సాయుధ దళాలలో పనిచేసేందుకు  ఎంపిక చేయబడిన వ్యక్తులు   కనీసం 15 సంవత్సరాల పాటు పని చేయాల్సి  ఉంటుంది.  భారత సైన్యంలోని జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు/ఇతర ర్యాంక్‌ల సర్వీస్ నియమాలు మరియు షరతులు వీరికి వర్తిస్తాయి. భారత నౌకా దళం, వైమానిక దళంలోనాన్ కంబాటెంట్ సిబ్బందికి వర్తించే  విధంగా  లేదా  కాలానుగుణంగా సవరించబడిన నియమ నిబంధనలు వీరికి వర్తిస్తాయి. 

నూతన పథకం సాయుధ దళాల్లో యువత మరియు అనుభవజ్ఞులైన సిబ్బంది మధ్య  సమతుల్యతను తీసుకు వచ్చి  యువత మరియు సాంకేతికంగా నైపుణ్యం కలిగిన యుద్ధ పోరాట శక్తి ని తీర్చిదిద్దుతుంది. 

ప్రయోజనాలు

·         సాయుధ దళాల నియామక విధానం రూపాంతర సంస్కరణ.

·         దేశానికి సేవ చేయడానికి మరియు దేశ నిర్మాణానికి సహకరించడానికి యువతకు ఒక అపూర్వ అవకాశం.

·         సాయుధ దళాల రూపు  యవ్వనంగా మరియు చైతన్యవంతంగా కనిపిస్తుంది. 

·         అగ్ని వీరులకు ఆకర్షణీయమైన ఆర్థిక ప్యాకేజీ  .

·         ఉత్తమ సంస్థలలో శిక్షణ పొందేందుకు మరియు వారి నైపుణ్యాలు  అర్హతలను పెంచుకోవడానికి    అగ్ని వీరులకు    అవకాశం  .

·         పౌర సమాజంలో సైనిక నైతికతతో మంచి క్రమశిక్షణ మరియు నైపుణ్యం కలిగిన యువత లభ్యత.

·         సమాజానికి తిరిగి వచ్చేవారికి మరియు యువతకు రోల్ మోడల్స్‌గా ఎదగగల వారికి తిరిగి  ఉపాధి పొందేందుకు  తగిన అవకాశాలు.

నిబంధనలుషరతులు

అగ్నిపథ్ పథకం కింద  అగ్ని వీరులు  నాలుగు సంవత్సరాల పాటు సంబంధిత దళంలో సంబంధిత చట్ట ప్రకారం నియమించబడతారు. వారు సాయుధ దళాలలో ప్రత్యేకమైన ర్యాంక్‌నుకలిగి ఉంటారు.  ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంకులకు భిన్నంగా ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలం  పూర్తయిన తర్వాత సంస్థాగత అవసరాలు మరియు సాయుధ దళాలు ఎప్పటికప్పుడు ప్రకటించే విధానాలకు అనుగుణంగా సాయుధ దళాల్లో   శాశ్వత నియామకం  కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అగ్ని వీరులకు  అందించబడుతుంది. ఈ దరఖాస్తులు వారి నాలుగు సంవత్సరాల పని కాలంలో చూపించిన ప్రతిభ, ప్రమాణాల ఆధారంగా కేంద్రీకృత విధానంలో ప్రత్యేకంగా  పరిగణించబడతాయి.  ప్రతి నిర్దిష్ట బ్యాచ్  అగ్నివీర్‌లలో 25% వరకు  సాయుధ దళాల సాధారణ కేడర్‌లో నమోదు చేయబడతారు. వివరణాత్మక మార్గదర్శకాలు విడిగా జారీ చేయబడతాయి.

మూడు దళాల నియామకం  కోసం ఆన్‌లైన్ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలైన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ వంటి వాటిలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ర్యాలీలు ద్వారా నిర్వహించడం జరుగుతుంది.  నమోదు 'ఆల్ ఇండియా ఆల్ క్లాస్' ఆధారంగా ఉంటుంది.  అర్హత వయస్సు 17.5 నుంచి  21 సంవత్సరాల వరకు ఉంటుంది. సంబంధిత వర్గాలు/ట్రేడ్‌లకు వర్తించే విధంగా సాయుధ దళాలలో నియామకం  కోసం నిర్దేశించిన వైద్య అర్హత షరతులను అగ్ని వీరులకు వర్తిస్తాయి.  వివిధ కేటగిరీల్లో నియామకం నిర్దేశించిన విద్యార్హత {ఉదాహరణకు: జనరల్ డ్యూటీ (GD) సైనికుడికి  విద్యార్హత 10వ తరగతి) ప్రమాణాలు అగ్ని వీరులకు వర్తిస్తాయి. 

***


(Release ID: 1833909) Visitor Counter : 569