సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలు ఇవ్వవద్దు: మీడియాకు మంత్రిత్వ శాఖ సూచన


భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మరియు సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలు

'వినియోగదారులకు భారీ ఆర్థిక, సామాజిక ప్రమాదాన్ని బెట్టింగ్ కలిగిస్తుంది'

Posted On: 13 JUN 2022 3:11PM by PIB Hyderabad

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక సూచనను జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మరియు ఆన్‌లైన్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు/ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన అనేక ప్రకటనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సలహాను జారీ చేసింది.

దేశంలోని చాలా ప్రాంతాలలో చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మరియు జూదం వినియోగదారులకు, ముఖ్యంగా యువత మరియు పిల్లలకు గణనీయమైన ఆర్థిక మరియు సామాజిక-ఆర్థిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఈ ప్రకటనలు ఎక్కువగా నిషేధించబడిన ఈ కార్యకలాపాన్ని ప్రచారం చేసే ప్రభావాన్ని కలిగి ఉన్నాయని ఇది జోడించింది. " ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ప్రకటనలు తప్పుదారి పట్టించేవి మరియు వినియోగదారుల రక్షణ చట్టం 2019, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1995 మరియు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ చట్టం, 1978 ప్రకారం అడ్వర్టైజింగ్ కోడ్ మరియు జర్నలిస్టిక్ ప్రవర్తనా నిబంధనల ప్రకారం ప్రకటన నిబంధనలకు ఖచ్చితమైన అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదు. " అని పేర్కొంది.

ప్రజా ప్రయోజనాల కోసం ఈ సూచన జారీ చేయబడింది మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలను ప్రచురించకుండా ఉండాలని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సూచించింది. ఆన్‌లైన్ ప్రకటనల మధ్యవర్తులు మరియు పబ్లిషర్‌లతో సహా ఆన్‌లైన్ మరియు సోషల్ మీడియాకు కూడా ఇది భారతదేశంలో ఇటువంటి ప్రకటనలను ప్రదర్శించవద్దని లేదా భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించింది.

4 డిసెంబర్ 2020న, ప్రింట్ మరియు ఆడియో కోసం నిర్దిష్టంగా చేయవలసినవి మరియు చేయకూడనివి ఉండే ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సిఐI) మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్‌లకు ఒక సలహాను జారీ చేసింది.

వివరణాత్మక సూచన ఈ క్రింది లింక్‌లో చదవవచ్చు:

https://mib.gov.in/sites/default/files/Advisory%20on%20online%20betting%20advertisements%2013.06.2022%282%29_0.pdf

***


(Release ID: 1833537) Visitor Counter : 240