వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పిజి) 20వ సమావేశం
Posted On:
09 JUN 2022 2:29PM by PIB Hyderabad
నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ప్రణాళిక యంత్రాంగ బృందం- ఎన్‌పిజి) 08 జూన్, 2022న న్యూఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో తన 20వ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి డిపిఐఐటి లాజిస్టిక్స్ విభాగం, ప్రత్యేక కార్యదర్శి ఎస్ హెచ్ అమృత్‌లాల్ మీనా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎంఒఆర్‌టిహెచ్, ఎంఒసిఎ, ఎంఒఆర్, ఎంఒపిఎస్‌డబ్ల్యు, ఎంఒపి, డిఒటి, నీతి ఆయోగ్ సహా సభ్య మంత్రిత్వ శాఖల/ విభాగాల ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు. ఈ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు లాజిస్టిక్ సామర్ధ్యాలు, పిఎం గతిశక్తికి సంబంధించిన వివిధ ఎజెండాలను చర్చించారు.
ఇటీవలే ప్రారంభించిన టెలికమ్యూనికేషన్స్ శాఖ గతిశక్తి సంచార్ పోర్టల్‌ను ప్రశంసిస్తూ, ఈ పోర్టల్‌పై 36 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలను ఏకీకృతం చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పోర్టల్‌ను జాతీయ బృహత్ ప్రణాళికలో ఏకీకృతం చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం త్వరలోనే ఎన్‌పిజి సభ్యులతో సమావేశం కానుంది.
బహుళ నమూనా మౌలిక సదుపాయాల దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలోనే రహదారులకు, ఓడరేవులకు తేలికైన అనుసంధానతను కలిగిన 100 కార్గో టెర్మినళ్ళను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న ప్రాంతాలను గుర్తించడం, కాలక్రమాలు, మ్యాపింగ్ కు సంబంధించిన వివిధ వివరాలను మంత్రిత్వ శాఖలు / విభాగాల మధ్య లోతైన సమన్వయం కోసం మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పంచుకున్నారు.
అంతర్ మంత్రిత్వ శాఖల ప్రణాళిక, సమన్వయాన్నిఏకీకృతం చేయడంలో జాతీయ బృహత్ ప్రణాళిక పోర్టల్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రత్యేక కార్యదర్శి ప్రముఖంగా ప్రస్తావించారు. పోర్టల్‌పై క్రమం తప్పకుండా ప్రాజెక్టు వివరాలను తాజా పరుస్తూ ఉండాలని, బిఐఎస్ఎజి-ఎన్తో క్రమం తప్పకుండా చర్చిస్తూ ఉండవలసిందిగా ఎన్‌పిజి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ప్రణాళిక యంత్రాంగ బృందం ద్వారా లాజిస్టిక్స్, ప్రాజెక్టు అనుసంధానతను తప్పనిసరి చేయడం సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాల గురించి ఎన్‌పిజి సభ్యులకు వివరించారు.
ప్రణాళిక యంత్రాంగ బృందం ద్వారా మొత్తం 8 మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఏకీకృత ప్రణాళికను రూపొందించడం, ఏకకాలంలో అమలు చేయడం, ఏకీకృత నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.
***
(Release ID: 1832780)
Visitor Counter : 174