ఆయుష్
azadi ka amrit mahotsav

ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ పొందిన ఆయుష్ సంస్థ


ఎన్ఏఆర్ఐపి, సీసీఆర్ఏఎస్ ద్వారా ఆయుష్ చేస్తున్న ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలకు ఇదొక మంచి ఊతం

Posted On: 08 JUN 2022 1:40PM by PIB Hyderabad

కేరళలోని త్రిస్సూర్ చెరుతురుత్తిలోని జాతీయ పంచకర్మ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (ఎన్ఏఆర్ఐపి), బయోకెమిస్ట్రీ, పాథాలజీ డిపార్ట్‌మెంట్ అందించే క్లినికల్ లాబొరేటరీ సేవలకు ఎన్ఏబిఎల్ ఎం(ఈఎల్)టి గుర్తింపు పొందింది.  ఎన్ఏఆర్ఐపి అనేది కేంద్ర  ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆయుర్వేద శాస్త్రాలలో పరిశోధన కోసం సెంట్రల్ కౌన్సిల్ కింద ఉన్న ప్రధాన పరిశోధనా సంస్థలో ఒకటి. సీసీఆర్ఏఎస్ కింద క్లినికల్ లాబొరేటరీ సేవలకు గాను ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన మొదటి ఇన్‌స్టిట్యూట్ ఇదే. ఈ సందర్భంగా కౌన్సిల్ సీనియర్ అధికారుల సమక్షంలో 2022 జూన్ 7న జరిగిన కార్యక్రమంలో సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబీనారాయణ ఆచార్య ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఏఆర్ఐపి డైరెక్టర్ డాక్టర్ డి.సుధాకర్ అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్ఏఆర్ఐపి అధికారులు హాజరయ్యారు.

థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఆధారంగా, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి నిర్దిష్ట పరీక్షలు/కొలతలకు సాంకేతిక సామర్థ్యాన్ని అధికారిక సంస్థ అధికారికంగా గుర్తించే ప్రక్రియే ప్రయోగశాల అక్రిడిటేషన్ అని డైరెక్టర్ జనరల్ తెలిపారు. ధృవీకరణ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్, కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక బోర్డు) ద్వారా అందించారు. “ఈ ఇన్‌స్టిట్యూట్‌లోని అధికారులు, సిబ్బంది అందరు అంకితభావంతో, ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్‌ను సాధించడానికి స్థిరమైన ప్రయత్నాలకు నేను అభినందిస్తున్నాను. టీమ్ గొప్పగా పని చేస్తుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.

'ఎన్ఏబిఎల్ మెడికల్ (ఎంట్రీ లెవల్) టెస్టింగ్ ల్యాబ్‌ల' సర్టిఫికేట్ ఎన్ఏఆర్ఐపి - డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ పాథాలజీకి 14 ఏప్రిల్, 2022న జారీ చేశారు. ఈ లేబొరేటరీ అక్రిడిటేషన్ వల్ల పౌరులు ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవ లభిస్తుంది. ఆయుర్వేద పరిశోధనా సంస్థగా, ఈ గుర్తింపు పొందిన ల్యాబ్ నుండి విడుదల అయ్యే శాస్త్రీయమైన డేట ఖచ్చితత్వంతో పాటు విశ్వసనీయతను కూడా కలిగి ఉంటుంది. ఒక సంవత్సరంలో 80,000 మంది వ్యక్తులు ఎన్ఏఆర్ఐపి ఓపీడీ/ఐపిడి సేవలకు వస్తున్నందున అక్రిడిటేషన్ కలిగి ఉండడం ముఖ్యమైనది. ఇది కాకుండా, విభిన్న పరిశోధన ప్రాజెక్టులు, ఔట్‌రీచ్ మెడికల్ క్యాంపులు మొదలైన వాటితో సహా శాస్త్రీయ సంఘాల సభ్యులు కూడా గుర్తింపు పొందిన ల్యాబ్‌ల నుండి ప్రయోజనం పొందుతారు. బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. తమీజ్ సెల్వం మాట్లాడుతూ పూర్తి ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, ఫుల్లీ ఆటోమేటెడ్ హెమటాలజీ ఎనలైజర్, పీరియాడికల్ క్యాలిబ్రేషన్‌తో కూడిన ఎలిసా సిస్టమ్స్ వంటి అధునాతన పరికరాలతో ప్రయోగశాల అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.   

 

***


(Release ID: 1832531) Visitor Counter : 164