మంత్రిమండలి

ఆరోగ్య రంగం లో భారతదేశాని కి మరియు యుఎస్ఎ కు మధ్య సంతకాలు జరిగిన అవగాహనపూర్వక ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 08 JUN 2022 4:44PM by PIB Hyderabad

హెచ్ఐవి, క్షయ వ్యాధి (టిబి), కోవిడ్-19, ఇంకా ఇతరత్రా తటాలున బయటపడుతున్న సాంక్రామిక వ్యాధులు మరియు ఉపేక్ష కు గురైన వ్యాధుల కు చికిత్స ను అందించడాని కి మరియు వాటి వ్యాప్తి ని నివారించడాని కి ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పరచడం తో పాటు గా సరికొత్త బయోమెడికల్ టూల్స్ ను అభివృద్ధి పరచే దిశ లో తోడ్పాటు ను అందించడాని కి భారత గణతంత్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగాని (డిబిటి) కి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) కు మరియు యుఎస్ఎ కు చెందిన ఇంటర్ నేశనల్ ఎయిడ్స్ వేక్సీన్ ఇనిశియేటివ్ (ఐఎవిఐ) కి మధ్య సంతకాలు జరిగిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు పరస్పరం హితం ముడిపడినటువంటి రంగాల లో అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రపరమైన సహకారానికి మరియు సాంకేతిక పరమైన సహకారాని కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పరిధి లో భారతదేశాని కి, యుఎస్ఎ కు మధ్య గల సంబంధాల ను మరింత గా బలపరచనుంది.

***



(Release ID: 1832252) Visitor Counter : 150