రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వియత్నాం రక్షణ శాఖ జనరల్ ఫాన్ వాన్ గియాంగ్ హనోయ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం పెంపొందించేందుకు వీలు కల్పించే '2030 దిశగా భారతదేశం-వియత్నాం దేశాల దృక్పథంపై రక్షణ భాగస్వామ్య ఒప్పందం'పై సంతకాలు చేసిన మంత్రులు

ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించే రవాణా సంబంధిత అంశాలను సులభతరం చేసేందుకు కుదిరిన ఎమ్ఒయుపై సంతకాలు చేసిన మంత్రులు

Posted On: 08 JUN 2022 10:58AM by PIB Hyderabad

వియత్నాం రక్షణ శాఖ  జనరల్ ఫాన్ వాన్ గియాంగ్ హనోయ్‌తో భారత రక్షణ శాఖ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2022 జూన్ 8న  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించి,  సమర్థవంతమైన మరియు ఆచరణాత్మక కార్యక్రమాలు,  ప్రాంతీయ ప్రపంచ అంశాలపై రెండు దేశాల రక్షణ శాఖల మంత్రుల  మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సంబంధాలను మరింత మెరుగు పరిచి పటిష్టం చేసేందుకు వీలు కల్పించే '2030 దిశగా భారతదేశం-వియత్నాం దేశాల దృక్పథంపై  రక్షణ భాగస్వామ్య  ఒప్పందంపై  కూడా సంతకాలు మంత్రులు చేశారు. 

రవాణా  రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన పై మంత్రుల సమక్షంలో సంతకాలు జరిగాయి. రెండు దేశాల  రక్షణ దళాల సహకారం పెరుగుతున్న నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల రవాణా అంశాలకు సంబంధించిన అంశాలను సులభతరం చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఇటువంటి ఒప్పందంపై వియత్నాం సంతకం చేయడం ఇదే తొలిసారి. 

వియత్నాం దేశానికి భారతదేశం అందించేందుకు అంగీకరించిన $500 మిలియన్ల రక్షణ రుణ సౌకర్యాన్ని సాధ్యమైనంత త్వరగా ను ముందస్తుగా ఖరారు చేయాలని కూడా ఇద్దరు మంత్రులు  అంగీకరించారు. భారతదేశ సహకారంతో వియత్నాం రక్షణ సామర్థ్యం మరింత పదునవడమే కాకుండా 'మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్లక్ష్య సాధనకు దోహదపడుతుంది. 

వియత్నాం  సాయుధ దళాల సామర్ద్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో లాంగ్వేజ్, ఐటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి రెండు సిమ్యులేటర్‌లను మరియు ద్రవ్య గ్రాంట్‌ను భారతదేశం  బహుమతిగా ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. 

హనోయిలోని దివంగత అధ్యక్షుడు హో చి మిన్‌కు ఆయన సమాధి వద్ద  నివాళులు అర్పించి భారత రక్షణ మంత్రి  మంత్రి తన అధికారిక పర్యటనను ప్రారంభించారు.  ట్రాన్ క్వోక్ పగోడా  బౌద్ధ దేవాలయాన్ని శ్రీ రాజనాధ్ సింగ్ సందర్శించారు.   రెండు దేశాల మధ్య పురాతన నాగరికత, రెండు దేశాల   ప్రజల మధ్య ఉన్న సంబంధాలు గుర్తు చేసే విధంగా శ్రీ రాజనాథ్ సింగ్ పర్యటన జరిగింది. 

భారతదేశం, వియత్నాం 2016 నుంచి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.  రక్షణ సహకారం రెండు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యంలో కీలక అంశంగా ఉంది.  భాగస్వామ్యానికి కీలక స్తంభం. భారతదేశం అనుసరిస్తున్న తూర్పు  విధానం మరియు ఇండో-పసిఫిక్ విజన్‌లో వియత్నాం ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. రెండు దేశాలు 2,000 సంవత్సరాలకు పైగా విస్తరించిన నాగరికత మరియు సాంస్కృతిక సంబంధాల  గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. భారతదేశం మరియు వియత్నాం సమకాలీన కాలంలో విస్తృతమైన ఆసక్తి మరియు ఉమ్మడి సహకారంతో  అత్యంత విశ్వసనీయమైన సంబంధాలను కొనసాగిస్తున్నాయి. రక్షణ రంగ విధాన నిర్ణయాలపై తరచు చర్చలు జరుపుతున్న రెండు దేశాలు సైనిక దళాల మార్పిడి,   అత్యున్నత స్థాయి సందర్శనలుసామర్థ్య పెంపుదల మరియు శిక్షణ కార్యక్రమాలుఐక్యరాజ్య సమితి  శాంతి పరిరక్షణలో సహకారంనౌకల సందర్శన, సంయుక్త విన్యాసాలతో  రెండు దేశాల మధ్య రక్షణ పరమైన  ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు ఎంతో కాలం నుండి కొనసాగుతున్నాయి.  

 

***


(Release ID: 1832131) Visitor Counter : 248