రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఎన్‌హెచ్‌53లో 105 గంటల 33 నిమిషాల్లో ఒకే లేన్‌లో 75 కిలోమీటర్ల బిటుమినస్ కాంక్రీట్‌ను వేయడం ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Posted On: 08 JUN 2022 12:06PM by PIB Hyderabad

ఎన్‌హెచ్‌53పై ఒకే వరుసలోలో 105 గంటల 33 నిమిషాల్లో 75 కిలోమీటర్ల బిటుమినస్ కాంక్రీట్‌ను వేయడంలో ఎన్‌హెచ్‌ఏఐ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఏఐ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించిందని శ్రీ గడ్కరీ ఒక వీడియో సందేశంలో తెలిపారు. అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఎన్‌హెచ్‌ 53లో 105 గంటల 33 నిమిషాల్లో 75 కిలోమీటర్ల మేర బిటుమినస్‌ కాంక్రీట్‌ వేయడంతో రికార్డు సృష్టించామన్నారు. 75 కిలోమీటర్ల సింగిల్ లేన్ బిటుమినస్ కాంక్రీట్ రహదారి మొత్తం పొడవు 37.5 కిమీ రెండు-లేన్ చదును చేయబడిన రహదారికి సమానం. 3 జూన్ 2022న ఉదయం 7:27 గంటలకు ఈ పని ప్రారంభమై 7 జూన్ 2022 సాయంత్రం 5 గంటలకు పూర్తయిందని వివరించారు.

ఇందుకోసం 2,070 మెట్రిక్‌ టన్నుల బిటుమెన్‌తో కూడిన 36,634 మెట్రిక్‌ టన్నుల బిటుమినస్‌ మిశ్రమాన్ని వినియోగించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును 720 మంది కార్మికులు ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌ల బృందంతో కలిసి పగలు రాత్రి శ్రమించి ఈ పనిని పూర్తి చేశారని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 2019లో ఖతార్‌లోని దోహాలో 25.275 కి.మీ.లు నిర్మించడం ద్వారా నిరంతరంగా బిటుమినస్‌ను ఏర్పాటు చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని శ్రీ గడ్కరీ తెలిపారు. ఈ పని పూర్తి చేయడానికి 10 రోజులు పట్టింది.

అమరావతి నుండి అకోలా సెక్షన్ ఎన్‌హెచ్ 53లో భాగమని..ఇది కోల్‌కతా, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మరియు సూరత్ వంటి ప్రధాన నగరాలను కలిపే ముఖ్యమైన తూర్పు-తూర్పు కారిడార్ అని మంత్రి చెప్పారు. ఈ మార్గం పూర్తయిన తర్వాత ఈ మార్గంలో ట్రాఫిక్ మరియు సరకు రవాణాను సులభతరం చేయడంలో ఈ స్ట్రెచ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఈ ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడిన ఎన్‌హెచ్‌ఏఐ మరియు రాజ్‌పాత్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్‌లు, కార్మికులందరికీ ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ అభినందనలు తెలిపారు.


 

****



(Release ID: 1832130) Visitor Counter : 223