నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఎనిమిదేళ్ళ ప్రభుత్వ పనితీరుపై డిడి న్యూస్ సదస్సు
సదస్సు 2వ రోజున కార్యక్రమంలో పాలుపంచుకున్న కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
గత ఎనిమిదేళ్ళలో ఆయుష్ ప్రొఫైల్ పెరగడమే కాక భారతదేశంలోనూ, విదేశాలలో విశ్వాసాన్ని చూరగొంది: శ్రీ సర్బానంద్ సోనోవాల్
పిఎం గతిశక్తి కింద వివిధ మంత్రిత్వ శాఖలు సమన్వయపూర్వక వైఖరిని కొనియాడిన కేంద్ర మంత్రి
Posted On:
07 JUN 2022 2:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కింద ప్రభుత్వం ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకోవడంతో వారంరోజుల పాటు ఆఠ్ సాల్ మోదీ సర్కార్: సపనే కితనే హుయే సాకార్ ( ఎనిమిదేళ్ళ మోడీ సర్కారు: ఎన్ని కలలు సాకారమయ్యాయి) అనే ఇతివృత్తంతో 3 నుంచి 11 జూన్ 2022 వరకు న్యూస్ కాంక్లేవ్‌ను (వార్తా సదస్సు) డిడి న్యూస్ నిర్వహిస్తోంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు & ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సదస్సు రెండవ రోజైన 4 జూన్ 2022న పాలుపంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శననికత కారణంగా భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఆయుష్ విశ్వాసాన్ని, ఆమోదయోగ్యతను పొందేలా చేసిందని తన ఇంటర్వ్యూ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్. అదనంగా, జామ్‌నగర్లో సంప్రదాయ ఔషధానికి డబ్ల్యుహెచ్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయడంతో, అన్ని దేశాల సంప్రదాయ ఔషధాల అభివృద్ధిలో భారతదేశం నాయకత్వాన్ని వహిస్తోందని అన్నారు. భారతదేశం యోగకు ఎప్పుడూ విశ్వగురువుగానే ఉందని, ఈసారి25 కోట్లమందికి పైగా ప్రజల భాగస్వామ్యంతో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకను జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఓడరేవుల ఆధునీకరణ, ఓడ రవాణా, జలమార్గాలలో పిఎం గతిశక్తి పథకాలను ప్రస్తావిస్తూ, భారతదేశం తన ఓడరేవుల పోటీతత్వాన్ని తన సామర్ధ్యం, నైపుణ్యాలను పెంచుకోవలసి ఉందని అభిప్రాయపడ్డారు. అశాంతి సృష్టించడానికి స్వార్ధప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ఈశాన్య ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు విస్మరించడాన్ని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
పూర్తి ఇంటర్వ్యూను https://youtu.be/PFtxu_yZs7I అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
***
(Release ID: 1832120)
Visitor Counter : 163