మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అమృత్ కాల్ లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


మన విద్య, నైపుణ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకోండి -శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

పి ఎం శ్రీ పాఠశాలలు జాతీయ విద్యా విధానం 2020 ప్రయోగశాలగా ఉంటాయి;భవిష్యత్తు కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి పూర్తి సన్నద్ధత కలిగి ఉంటాయి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

జాతీయ పాఠశాల విద్యాశాఖ మంత్రుల సదస్సు 2వ రోజున ప్రారంభోపన్యాసం చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 02 JUN 2022 3:45PM by PIB Hyderabad

జాతీయ పాఠశాల విద్యా మంత్రుల సదస్సు రెండవ గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభ సమావేశంలో

ప్రసంగించారు. గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ ప టేల్; గోవా ముఖ్య మంత్రి శ్రీ ప్రమోద్ సావంత్; కేంద్ర విద్య , నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కొత్త జాతీయ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి ప ర చ డం కోసం ఏర్పాటయిన స్టీరింగ్ క మిటీ

చైర్ పర్సన్  శ్రీ కె కస్తూరి రంగన్ , విద్యా మంత్రిత్వ శాఖ , రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి

హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, పాఠశాల విద్య ఒక విజ్ఞాన ఆధారిత

సమాజానికి పునాది అని, జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) సర్వతోముఖాభివృద్ధి కి దోహదపడేలా, విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన ఒక నాలెడ్జ్ డాక్యుమెంట్ అని అన్నారు.

 

మనం అమృత్ కాల్ శకం లో ఉన్నామని మంత్రి చెప్పారు. ప్రపంచ సంక్షేమానికి కట్టుబడి ఉన్న విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఆవిష్కరించడానికి రాబోయే 25 సంవత్సరాలు చాలా కీలకమైనవని ఆయన అన్నారు. మనది వసుధైక కుటుంబాన్ని విశ్వసించే నాగరికత , మనకు మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ బాధ్యతలు కూడా ఉన్నాయని మనం గ్రహించాలి అని అన్నారు.

 

21వ శ తాబ్దం అవకాశాలు, సవాళ్ల కు సంసిద్ధ మవుతున్న సందర్భంగా మనం

మన విద్యను, నైపుణ్య వంతమైన వ్య వ స్థ ను బలోపేతం చేసుకోవడానికి సాంకేతిక

పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కోరారు. నిన్న వివిధ విద్య, నైపుణ్య సంస్థల సందర్శన సందర్భంగా మనమంతా 21వ శతాబ్దపు భవిష్యత్ విద్యా వ్యవస్థల వివిధ కోణాలను సంగ్రహంగా తెలుసుకున్నామని ఆయన అన్నారు.

 

ఇ సి సి ఇ, టీచర్ ట్రైనింగ్,  వయోజన విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, స్కూలు ఎడ్యుకేషన్ తో స్కిల్ డెవలప్ మెంట్ అనుసంధానం,   21వ శతాబ్దపు ప్రపంచ పౌరులను తయారు చేయడానికి మాతృభాషలో అభ్యసనకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ప్రీ స్కూల్ నుంచి సెకండరీ వరకు ఎన్ ఈ పి 5+3+3+4 అప్రోచ్ ని మంత్రి వివరించారు.

 

విద్యార్థులను భవిష్యత్ కు సిద్ధం చేసేందుకు పూర్తి స్థాయి యంత్రాంగం కలిగిన  పీఎం శ్రీ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ అత్యాధునిక పాఠశాలలు ఎన్ఈపీ 2020 ప్రయోగశాలగా ఉంటాయి. పిఎం శ్రీ స్కూళ్ల రూపంలో ఒక భవిష్యత్ ప్రామాణిక నమూనా  ను సృష్టించడం కోసం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు , మొత్తం విద్యా వ్యవస్థల నుంచి ఆయన సలహాలు,  ఫీడ్ బ్యాక్ ని అభ్యర్థించారు.

 

ఈ నాటి సదస్సు లో జరిగిన  నిర్మాణాత్మక, ఫలితాల ఆధారిత చర్చల్లో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల నుంచి అనుభవం, పరిజ్ఞానాన్ని పంచుకోవడం ఎన్ఈపీ 2020కి అనుగుణంగా, సహజ అభ్యసన విధాన ప్రక్రియను మార్చే దిశగా మరో ముందడుగు అని మంత్రి నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో

జరుగుతున్న చర్చలు దేశ వ్యాప్తంగా

విద్యా వ్యవస్థ ను బలోపేతం చేయడానికి ఎంతో తోడ్పడగలవని ఆయ న విశ్వాసం

వ్యక్తం చేశారు.

 

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర ప lటేల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బోధన,  అభ్యాస ప్రక్రియ నిరంతర పునర్ నిర్వవచనం,  రీడిజైన్ అవసరాన్ని గుర్తించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 34 సంవత్సరాల నాటి విద్యా విధానాన్ని మార్చారని, మ న సంస్కృతి కి అనుగుణంగా విజ్ఞానాన్ని అత్యున్నత నిధిగా భావించి దేశానికి కొత్త జాతీయ విద్యా విధానాన్ని అందించారని చెప్పారు.అందరికీ సమాన , అధిక నాణ్యత కలిగిన విద్యను అందించాలనే జాతీయ విద్యావిధానం లక్ష్యాన్ని సాకారం చేయడానికి ప్రధాన మంత్రి నాయకత్వంలో యావత్ దేశం చేతులు కలుపుతోందని అన్నారు.

 

‘‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా, సమాజమైనా అభివృద్ధి చెందడానికి విద్య, ఆరోగ్యం, భద్రత కీలక కారకాలు.  ఒకే మూస, కాలం చెల్లిన విద్య స్థానంలో సమ్మిళిత,  సమానమైన విద్యను అందించడం ఇప్పటి అవసరం. 

ఇందుకు కట్టుబడి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాలలకు,  దేశ భ విష్యత్తు తరాలకు విద్య ను అందించడానికి ఈ కొత్త విద్యా విధానాన్ని ఇచ్చారు ‘‘ అని  గుజరాత్ ముఖ్యమంత్రి  అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ

పదవి కాలంలో దేశంలో అనేక కొత్త కార్య క్ర మాలను చేపట్టారు. వాటిలో నూతన విద్యావిధానం ఒకటి.ఈ విధానం ఫలితంగా దేశంలోని యువత తమ ప్రాంతీయ భాషలో కూడా ఉన్నత విద్యను కూడా పొందుతారు. దేశంలో విద్యపై వ్యయం దాదాపు రెట్టింపు అయింది, అదే సమయంలో, నైపుణ్యాభివృద్ధికి తగినంత ప్రాధాన్యత లభించింది. ఇంకా  దేశంలోని 1.34 కోట్ల మంది యువతలో నైపుణ్యాలు పెంపొందించబడ్డాయి.

 

దేశవ్యాప్తంగా విద్యాశాఖ మంత్రులు, విద్యావేత్తల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కింద గుజరాత్‌లో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు విద్యారంగాన్ని మరింత సమర్థవంతంగా బలోపేతం చేస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్,  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ కు అవకాశం ఇచ్చినందుకు గుజరాత్ విద్యాశాఖ మంత్రి శ్రీ జీతూ వాఘాని సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, నూతన విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం,  మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారతం దార్శనికతను సాకారం చేయడం ద్వారా విద్యా రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు 'పాఠశాల విద్యా మంత్రుల జాతీయ సదస్సు' ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు.

 

జాతీయ విద్యావిధానం అనేది నిపుణులచే జాగ్రత్తగా అధ్యయనం చేయబడిన ఒక విధానమని, దాని అమలుతో సమాజంలో ఒక కొత్త మార్పును మనం చూడగలమని మంత్రి శ్రీ జీతూ వాఘాని అన్నారు.‘‘జాతీయ విద్యావిధానం - దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి ఒక ముఖ్యమైన పత్రంగా నిలుస్తుంది. అందువలన అటువంటి విధానాన్ని అమలు చేయడం మనందరి బాధ్యత. విద్య సమాజానికి మన అతిపెద్ద బాధ్యత.నూతన విద్యా విధానం ఈ బాధ్యతను పూర్తి విధేయతతో నెరవేర్చడంలో ఒక బంగారు అడుగు అవుతుంది‘‘ అన్నారు.

 

భారత ప్రభుత్వ పాఠశాల విద్య కార్యదర్శి శ్రీమతి అనితా కర్వాల్ సదస్సు ఉద్దేశాన్ని తెలియచేస్తూ, మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి, పిల్లలకు తగిన మద్దతు లభించేలా చూడటానికి బహుముఖ మరియు సంపూర్ణ విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రతి వాటాదారుడు చేపట్టాల్సిన చర్య, కార్యకలాపాల సూచనాత్మక వార్షిక క్యాలెండర్, ప్రస్తుత జోక్యాలను ఉపయోగించుకునే ప్రస్తుత జోక్యాలు , ఒకేసారి ఒక సారి కొలతగా నిధులతో అదనపు మద్దతును వివరించే సమగ్ర అభ్యసన రికవరీ ప్రణాళిక (ఎల్ఆర్పి) తయారు చేయబడిందని ఆమె తెలియజేశారు.

 

రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ప్రతిపాదనలో జోక్యాలను ఈ క్రింది విధంగా అనుసరించవచ్చు:

 

 *   విద్యార్థులందరి కోసం లెర్నింగ్ ఎన్ హాన్స్ మెంట్ ప్రోగ్రామ్ ( ఎల్ ఇ పి )

 

*   టీచర్ రిసోర్స్ ప్యాకేజీ (రు ఆర్ పి )

 

*   ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ స్టడీ (ఓ ఆర్ ఎఫ్)

 

*    బ్లాక్ రిసోర్స్ సెంటర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సదుపాయం: బి ఆర్ సి స్థాయిలో ఐ సి టి సౌకర్యాలు

 

*     క్లస్టర్ రిసోర్స్ సెంటర్ లను బలోపేతం చేయడం- సి ఆర్ సిలకు మొబిలిటీ సపోర్ట్

 

ఈ సమావేశం సందర్భంగా కేంద్ర విద్యా శాఖా మంత్రి శ్రీ  దర్మేంద్ర ప్రధాన్ తో పాటు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు,  స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ , ఎల క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి; శ్రీ రాజీవ్ చంద్ర శేఖ ర్ , విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి,  విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ , విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు 2022 జూన్ 1న విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్కే), భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ), నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ), ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఏసీఈ)లను సందర్శించారు.

*****



(Release ID: 1830648) Visitor Counter : 165