సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పీఎం కేర్స్ పిల్లల కోసం సెంట్రల్ సెక్టార్ పథకం స్కాలర్‌షిప్
Posted On:
30 MAY 2022 3:21PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధానమంత్రి పిల్లల కోసం 29 మే, 2021న పిల్లల కోసం పీఎం కేర్స్ పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకం కింద, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా అచేతనమైన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడానికి ఫిబ్రవరి 2022లో ఒక చొరవ ప్రారంభించబడింది. ఈ చొరవ అనుగుణంగా, సామాజిక న్యాయం , సాధికారత శాఖ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఎలాంటి ఆటంకం లేకుండా తమ చదువు కొనసాగించేందుకు గాను స్కాలర్‌షిప్ సాయంఅందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం వీరి ప్రయోజనం కోసం కొత్త పథకం రూపొందించబడింది; పీఎం కేర్స్ పిల్లల కోసం స్కాలర్‌షిప్ అనేది సెంట్రల్ సెక్టార్ పథకం. పథకం కింద కోవిడ్ మూలంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన వారికి స్కాలర్‌షిప్ భత్యం ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ. 20,000/- మేర అందిస్తారు, ఇందులో నెలకు రూ.1,000 నెలవారీ భత్యం మరియు వార్షిక విద్యా భత్యం రూ. 8,000 మేర అందిస్తారు. పాఠశాల ఫీజు, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, ఇతర విద్యా సామగ్రి ఖర్చులు ఇందులో కవర్ చేయబడతాయి. ఒకటో తరగతి నుండి 12వ తరగతి పాసయ్యే వరకు పిల్లలకు డీబీటీ పథకం ద్వారా ఈ స్కాలర్‌షిప్ పంపిణీ చేయబడుతుంది. 2022-23లో రూ.7.89 కోట్లతో పథకం కింద 3945 మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకాన్ని గౌరవనీయులైన ప్రధాన మంత్రి మే 30, 2022న ప్రారంభించారు.
*****
(Release ID: 1829617)
Visitor Counter : 165