హోం మంత్రిత్వ శాఖ
ప్రధాని మోదీ నాయకత్వంలో 8ఏళ్ల పాలన దిగ్విజయం!
ప్రజలకు హోమ్ మంత్రి అమిత్ షా అభినందనలు
ప్రజలకు సేవలందించేందుకు అధికారాన్ని
ఒక మాధ్యమంగా భావించిన నరేంద్ర మోదీ..
పేదలు, రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలకు
కావలసినవన్నీ అందించిన అధినేత..
దీనితో ప్రజాస్వామ్య వ్యవస్థపై
ప్రజల విశ్వాసం మరింత బలోపేతం..
ప్రగతి పయనంలో వారికీ దక్కిన భాగస్వామ్యం...
ఎనిమిదేళ్లలో ఎన్నో చారిత్రిక విజయాలు
సొంతంచేసుకున్న మోదీ ప్రభుత్వం...
గత ఎమిదేళ్లలో ప్రతి పౌరుడి కలలకు, ఆశయాలకు రెక్కలు తొడిగిన ప్రధాని నరేంద్ర మోదీ,.
దీనితో వారిలో పెరిగిన కొత్త ఆత్మవిశ్వాసం..
దేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడమేకాక ప్రజల గౌరవంపెంచే నిర్ణయాలు తీసుకున్న మోదీ..
అన్ని వర్గాల ప్రజల ఆశల మేరకు నిర్విరామంగా,
కఠోరంగా శ్రమిస్తున్న ప్రధానమంత్రి మోదీ.
ఈ రోజున 130కోట్ల మంది ప్రజల విశ్వాస బలంతో
ప్రతిరంగంలో ప్రగతి దిశగా దేశం పురోగమనం..
సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి-సంక్షేమ రంగాల్లో ప్రధాని విజయాలన్నీ ప్రపంచానికే ఉదాహరణలు..
సమర్థ నాయకత్వంతో ఆపదలను అవకాశాలుగా
ఎలా మార్చుకోవచ్చునో ప్రధాని నేతృత్వంలో
ప్రపంచానికి చేసి చూపించిన న
प्रविष्टि तिथि:
30 MAY 2022 4:04PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా అనేక సందేశాలతో ఆయన ఈ అభినందనలు తెలిపారు. "అధికారం ప్రజలకు సేవచేసేందుకు ఒక మాధ్యమంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావించారు. నిరుపేదలకు, రైతులకు, అవకాశాలకు నోచుకోని అట్టడుగువర్గాలకు దక్కవలసిన హక్కులను అందించారు. దీనితో ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసం మరింత బలోపేతమైంది. దేశాభివృద్ధి పయనంలో వారు భాగస్వాములయ్యారు. అనేక చారిత్రిక విజయాలతో ప్రభుత్వం ఎనిమిదేళ్లు ముగించిన సందర్భంగా పౌరులందరికీ అభినందలు తెలుపుతున్నాను.” అని అమిత్ షా తన సందేశాల్లో పేర్కొన్నారు. “గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజల కలలకు, ఆశయాలకు ప్రధానమంత్రి మోదీ రెక్కలు తొడిగారు. ప్రజల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పారు.” అని అమిత్ అన్నారు.
నరేంద్రమోదీ తన సమర్థవంతమైన నాయకత్వ పటిమతో, బలమైన సంకల్పంతో దేశాన్నిసురక్షితంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రజల గౌరవాన్ని పెంపొందేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని అమిత్ షా అభినందించారు. నిర్విరామ కఠోర శ్రమతో ఆయన ప్రజల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా పనిచేశారని, సమాజంలో ప్రతి వర్గం విశ్వాసాన్ని చూరగొన్నారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ రోజున 130కోట్ల మంది ప్రజల విశ్వాస బలమే దేశాన్ని ప్రతి రంగంలోనూ ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.
“సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి, పేదల సంక్షేమం..ఇలా ఏ రంగంలో అయినా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన విజయాలు ప్రపంచానికే ఉదాహరణలుగా నిలిచాయి.” అని అమిత్ షా అన్నారు.
“జమ్ము కాశ్మీర్ లేదా ఈశాన్య ప్రాంతం, లేదా వామపక్ష తీవ్రవాదం.. ఇలా దశాబ్దాలుగా ఎవరూ ముట్టుకోవడానికి కూడా సాహసించని సవాళ్లను, సమస్యలను కూడా నరేంద్ర మోదీ చేపట్టి సమర్థవంతంగా పరిష్కరించారు. తన నాయకత్వ పటిమ, ముందుచూపుతో అభివృద్ధిలోనూ శాంతి స్థాపనలోను ఆయన కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ రోజున ఈశాన్య ప్రాంతం కూడా దేశంలోని మిగతా ప్రాంతాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు పురోగమిస్తోంది.” అని అమిత్ షా అన్నారు.
“స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా సాగేందుకు తగిన పునాదులు వేసుకుంటోంది. ప్రధానిలోని ఈ దృఢనిశ్ఛయాన్ని గుర్తుంచుకోవడం దేశంలోని ప్రతి పౌరులందరి బాధ్యత. అప్పుడే రాబోయే తరాలకు బలమైన, స్వావలంబనతో కూడిన దేశాన్ని అందించగలుగుతాం." అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన సందేశాల్లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1829592)
आगंतुक पटल : 270