విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన బొగ్గు పరిమాణాన్ని నిర్దేశించండి
శక్తి-బి కేటగిరీ పవర్ ప్లాంట్ల విషయంలో
సి.ఇ.ఎ.కి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశం
Posted On:
29 MAY 2022 1:21PM by PIB Hyderabad
శక్తి-బి(viii)(a) కేటగిరీ కింద పనిచేసే విద్యుత్ ప్లాంట్లకు అవసరమయ్యే స్వదేశీ తయారీ బొగ్గు పరిమాణాన్ని నిర్ధారించవలసిందిగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్రీయ విద్యుత్ ప్రాధికార సంస్థ (సి.ఇ.ఎ.)ని ఆదేశించింది. దిగుమతి చేసుకునే 10శాతం బొగ్గును (ఇది 15శాతం స్వదేశీ బొగ్గుకు సమానం) పరిగణనలోకి తీసుకుంటూ విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును నిర్ధారించవలసిందిగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సి.ఇ.ఎ.కి సూచించింది.
2022 జూన్ 15నుంచి 2023 మార్చి నెలాఖరు వరకూ భారం ప్రాతిపదికన 10శాతం బొగ్గును తప్పనిసరిగా మిశ్రమం చేసే షరతుపై విద్యుత్ ఉత్పత్తిని సాగించడానికి సంబంధించి, శక్తి-బి(viii)(a) కేటగిరీ విద్యుత్ ప్లాంట్లు వినియోగించే బొగ్గు పరిమాణాన్ని లెక్కించవలసిందిగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సి.ఇ.ఎ.ని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుతో ఈ కేటగిరీలోని విద్యుత్ ప్లాంట్లు విదేశీ బొగ్గును సేకరించేందుకు దాదాపు 3 వారాల వ్యవధి అందుబాటులోకి వస్తుంది.
విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరగడం, బొగ్గు వినియోగానికి తగినట్టుగా స్వదేశీ బొగ్గు కంపెనీలనుంచి బొగ్గు సరఫరా లేకపోవడం తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ, స్వతంత్ర (ప్రైవేటు) విద్యుత్ ఉత్పాదనా సంస్థలతో సహా వివిధ రాష్ట్రాల విద్యుత్ ఉత్పాదన కంపెనీలకు (జెంకోలకు) 2022 మే నెల 28న విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక సూచన చేసింది. విద్యుత్ ఉత్పత్తికోసం పదిశాతం దిగుమతి బొగ్గును మిశ్రమం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. స్వదేశీ బొగ్గు సరఫరాలో నెలకొన్న కొరతను భర్తీ చేసేందుకు ఈ చర్య తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
****
(Release ID: 1829299)
Visitor Counter : 150