వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఈ కామర్స్ సైట్లలో తప్పుడు సమీక్షలపై కేంద్రం దృష్టి


తప్పుడు సమీక్షల పరిణామాలను చర్చించడానికి, ముందస్తుగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి ఇ-కామర్స్ సంస్థలు, వాటాదారులతో సమావేశాన్ని నిర్వహించనున్న వినియోగదారుల వ్యవహారాల విభాగం.

Posted On: 26 MAY 2022 3:28PM by PIB Hyderabad

ఆన్‌లైన్ సేవలు లేదా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులను తప్పుదారి పట్టించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై నకిలీ సమీక్షల పరిమాణాన్ని అంచనా వేయడానికి, ముందస్తు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికిఅడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)తో కలిసి వినియోగదారుల వ్యవహారాల శాఖ (DoCA) శుక్రవారం27 మే2022న వివిధ వాటాదారులతో కలిసి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనుంది.

వినియోగదారులపై నకిలీ, తప్పుదారి పట్టించే సమీక్షల ప్రభావం, అటువంటి క్రమరాహిత్యాలను నివారించడానికి ఈ చర్చలు జరగనున్నాయి. దీనికి సంబంధించిసెక్రటరీ వినియోగదారుల వ్యవహారాల శాఖశ్రీ రోహిత్ కుమార్ సింగ్ వాటాదారులకు లేఖలు రాశారు: ఫ్లిప్‌కార్ట్అమెజాన్టాటా సన్స్రిలయన్స్ రిటైల్ వంటి ఈ-కామర్స్ సంస్థలువినియోగదారుల ఫోరమ్‌లున్యాయ విశ్వవిద్యాలయాలులాయర్లుఫిక్కీసీఐఐవినియోగదారుల హక్కుల కార్యకర్తలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

లేఖతో పాటుశ్రీ రోహిత్ కుమార్ సింగ్ 223 ప్రధాన వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్ వినియోగదారు సమీక్షలపై యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా స్క్రీనింగ్ ఫలితాలను చూపుతూ జనవరి 202022 నాటి యూరోపియన్ కమీషన్ యొక్క ప్రెస్ రిలీజ్‌ను కూడా పంచుకున్నారు. స్క్రీనింగ్ ఫలితాలు కనీసం 55% వెబ్‌సైట్‌లు ఈయూ యొక్క అన్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నాయని నొక్కి చెబుతున్నాయి. సమాచారం ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు సరైన సమాచారాన్ని అందించడం అవసరం. ఇంకాతనిఖీ చేసిన 223 వెబ్‌సైట్‌లలో 144లోసమీక్షలు ప్రామాణికమైనవని నిర్ధారించడానికి వ్యాపారులు తగినంతగా పనిచేస్తున్నారని అధికారులు నిర్ధారించలేకపోయారు. అనగాసమీక్షించబడిన ఉత్పత్తి లేదా సేవను వాస్తవంగా ఉపయోగించిన వినియోగదారులు పోస్ట్ చేసారా లేదా అన్నది తెలియలేదు.

'పెరుగుతున్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వినియోగంతోవినియోగదారులు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ఉత్పత్తిని భౌతికంగా వీక్షించడానికి లేదా పరిశీలించడానికి ఎటువంటి అవకాశం లేకుండా వర్చువల్ షాపింగ్ అనుభవాన్ని ఇ-కామర్స్ కలిగి ఉన్నందునవినియోగదారులు ఇప్పటికే వస్తువులు లేదా సేవను కొనుగోలు చేసిన వినియోగదారు యొక్క అభిప్రాయం మరియు అనుభవాన్ని చూడటానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసిన సమీక్షలపై ఎక్కువగా ఆధారపడతారు. తత్ఫలితంగానకిలీ, తప్పుదారి పట్టించే సమీక్షల కారణంగావినియోగదారుల రక్షణ చట్టం2019 ప్రకారం వినియోగదారుల హక్కు అయిన సమాచారం పొందే హక్కు ఉల్లంఘించబడింది.

'ఈ సమస్య ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. వినియోగదారుగా వారి హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టిదీనిని మరింత పరిశీలన మరియు వివరాలతో పరిశీలించడం చాలా ముఖ్యంఅని లేఖ పేర్కొంది.

****



(Release ID: 1828637) Visitor Counter : 175