ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆరోగ్య రికార్డుల నిర్వహణకు ఏబిహెచ్ఏ మొబైల్ అప్లికేషన్ ను ఆధునీకరించిన నేషనల్ హెల్త్ అథారిటీ
మెరుగైన వినియోగం కోసం అదనపు సౌకర్యాలు, మరియు కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ అందించనున్న పునర్వ్యవస్థీకరించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబిహెచ్ఏ)
Posted On:
24 MAY 2022 10:30AM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబిహెచ్ఏ) మొబైల్ అప్లికేషన్‌ను పునర్వ్యవస్థీకరించి ప్రారంభించినట్లు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ( ఏబిడిఎమ్ ) ను ప్రధాన పథకం గా అమలు చేస్తున్న నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఏ) ప్రకటించింది. గతంలో ఎన్ డీహెచ్ఎం హెల్త్ రికార్డ్స్ యాప్‌గా అందుబాటులో ఉన్న ఏబిహెచ్ఏ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే 4 లక్షలకు పైగా వినియోగదారులు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు . పునర్వ్యవస్థీకరించి ఏబిహెచ్ఏ యాప్ అదనపు సేవలు అందించి, వినియోగదారు ఇంటర్‌ఫేస్ సౌకర్యాన్ని అందిస్తుంది. యాప్ ను వినియోగించేవారు తమ ఆరోగ్య రికార్డులను ఎప్పుడైనా, ఎక్కడైనా నవీకరించబడిన సౌకర్యం ద్వారా పొందేందుకు వీలుగా నవీకరించబడిన యాప్ ద్వారా పొందేందుకు దీనిలో సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే ఏబిహెచ్ఏ యాప్ కలిగి ఉన్న నియోగదారులు తమ మునుపటి యాప్ వెర్షన్‌లను కూడా తాజా వాటికి అప్‌డేట్ చేయవచ్చు.
ఏబిహెచ్ఏ మొబైల్ అప్లికేషన్ ఒక వ్యక్తిని ఏబిహెచ్ఏ చిరునామాను (username@abdm) సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. 14 అంకెలతో యాదృచ్ఛికంగా రూపొందించబడిన ఏబిహెచ్ఏ నంబర్‌తో లింక్ చేయబడే వినియోగదారు పేరును సులభంగా గుర్తుంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏబిడిఎమ్ హెల్త్ సౌకర్యంలో వినియోగదారుడు తన ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసి వాటిని వారి స్మార్ట్‌ఫోన్‌లలో వాటిని వీక్షించడానికి మొబైల్ అప్లికేషన్ అనుమతిస్తుంది. ఏబిడిఎమ్ నెట్‌వర్క్ లో ప్రతి ఒక్కరూ తమ డయాగ్నస్టిక్ రిపోర్ట్‌లు, ప్రిస్క్రిప్షన్లు, కో విన్ టీకా సర్టిఫికేట్ మొదలైన డిజిటల్ హెల్త్ రికార్డ్‌లను పొందుపరచుకోవచ్చు. సదరు వ్యక్తి అనుమతించిన తరువాత అన్ని రికార్డులను ఏబిడిఎమ్ కంప్లైంట్ హెల్త్ లాకర్‌లలో పొందుపరిచిన శారీరక ఆరోగ్య రికార్డులను స్వీయ-అప్‌లోడ్ చేయడానికి అప్లికేషన్ అనుమతిస్తుంది.
ఏబిహెచ్ఏ మొబైల్ అప్లికేషన్‌లో వ్యక్తిగత వివరాలను సవరించడం, లింక్ చేయడం మరియు ఏబిహెచ్ఏ చిరునామాతో ఏబిహెచ్ఏ నంబర్ (14 అంకెలు)ని అన్‌లింక్ చేయడం వంటి నూతన సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. ముఖ ప్రామాణీకరణ / వేలిముద్ర/ బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అయ్యే వీలు కల్పించడం, వేగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఏబిడిఎమ్ పొందేందుకు QR కోడ్‌ని స్కాన్ సౌకర్యం లాంటి ఇతర సౌకర్యాలు కూడా త్వరలో విడుదల చేయబడతాయి.
ఏబిహెచ్ఏ మొబైల్ యాప్ ప్రయోజనాలను నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ వివరించారు. “పౌరులు తమ ఆరోగ్య సంబంధిత రికార్డులను భద్రపరుచు కొనేందుకు ఏబిహెచ్ఏ యాప్ ఉపయోగపడుతుంది. రోగులు వారి ఆరోగ్య రికార్డులను వారి ఏబిహెచ్ఏ చిరునామా సహాయంతో సెకన్లలో చూసేందుకు అవకాశం కలుగుతుంది. ఇది వారికి అనేక విధాలుగా సాధికారత కల్పిస్తుంది. ఇది వారి ఆరోగ్య చరిత్రను ఒకే వేదికలో భద్రపరుచుకుని అవసరమైనప్పుడు ఆరోగ్య రికార్డులను ఎప్పుడైనా మరియు ఎక్కడైనా చూడవచ్చు. ఆరోగ్య రికార్డులు కనిపించకుండా పోయాయని ఆందోళన చెందనవసరం ఉండదు. వాటిని అవసరమైన వారితో పంచుకోవచ్చు. డిజిటల్ విధానంలో జరిగే సమాచార వల్ల మెరుగైన వైద్య పరమైన నిర్ణయం తీసుకోవడానికి అంతరాయం లేకుండా వైద్య సంరక్షణ అందించేందుకు యాప్ సహకరిస్తుంది" అని డాక్టర్ శర్మ వివరించారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ( ఏబిహెచ్ఏ ) మొబైల్ యాప్ (గతంలో ఎన్ డీహెచ్ఎమ్ హెల్త్ రికార్డ్స్ లేదా పీహెచ్ఆర్ యాప్ అని పిలుస్తారు) ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా https://play.google.com/store/apps/details?id=in.ndhm.phr లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏబిహెచ్ఏ మొబైల్ యాప్ iOS వెర్షన్ త్వరలో విడుదల అవుతుంది.
ఏబిడిఎమ్ గురించి మరింత సమాచారం : https://abdm.gov.in/ లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1827870)
Visitor Counter : 281