ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి
Posted On:
23 MAY 2022 4:09PM by PIB Hyderabad
టోక్యో లో 2022 మే నెల, 23వ తేదీన జపాన్ వ్యాపార ప్రముఖులతో ఏర్పాటైన బిజినెస్-రౌండ్-టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
జపాన్‌కు చెందిన 34 కంపెనీల ఉన్నతాధికారులు, సీ.ఈ.వో. లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటిలో చాలా కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు, కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, స్టీల్, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌తో సహా విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో భారత, జపాన్ దేశాలకు చెందిన - కీడాన్రెన్; జపాన్-ఎక్స్‌టర్నల్-ట్రేడ్-ఆర్గనైజేషన్ (జెట్రో); జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా); జపాన్-బ్యాంక్-ఫర్-ఇంటర్నేషనల్-కో-ఆపరేషన్ (జె.బి.ఐ.సి); జపాన్-ఇండియా-బిజినెస్-కన్సల్టేటివ్-కమిటీ (జె.ఐ.బి.సి.సి); ఇన్వెస్ట్-ఇండియా వంటి కీలక వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి.
భారత, జపాన్ దేశాలు సహజ భాగస్వాములని ప్రధానమంత్రి పేర్కొంటూ, భారత, జపాన్ దేశాల అపారమైన సామర్థ్యానికి బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యాపార వర్గాలను ప్రశంసించారు. 2022 మార్చిలో ప్రధాన మంత్రి కిషిదా భారత పర్యటన సందర్భంగా - వచ్చే 5 సంవత్సరాల్లో, రెండు దేశాలు ఐదు ట్రిలియన్ల మేర జపాన్ యెన్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు , ప్రధాన మంత్రి తెలియజేశారు. ఆర్థిక సంబంధాలలో భాగంగా - భారత-జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం (ఐ.జె.ఐ.సి.పి); క్లీన్-ఎనర్జీ-భాగస్వామ్యం వంటి ఇటీవలి పరిణామాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొన్నారు. నేషనల్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-పైప్-లైన్ (ఎన్.ఐ.పి); ప్రొడక్షన్-లింక్డ్-ఇన్సెంటివ్ (పి.ఎల్.ఐ) పథకం; సెమీకండక్టర్ విధానం వంటి కార్యక్రమాలతో పాటు, భారతదేశం లోని పటిష్టమైన అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ గురించి కూడా ప్రత్యేకంగా వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డిఐలు మందగించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ. ని ఆకర్షించిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది భారతదేశ ఆర్థిక సామర్థ్యం పై విశ్వాసానికి లభించిన గుర్తింపు అని, ఆయన అభివర్ణించారు. జపాన్ కు చెందిన సంస్థలు భారతదేశంలో ఎక్కువగా పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ యొక్క సహకారాన్ని 'జపాన్ వీక్' రూపంలో జరుపుకోవాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు.
ఈ వ్యాపార సదస్సులో దిగువ పేర్కొన్న వ్యాపారవేత్తలు పాల్గొన్నారు:
పేరు
|
హోదా
|
సంస్థ
|
శ్రీ సీజీ కురైషి
|
చైర్మన్ & డైరెక్టర్
|
హోండా మోటార్ కం., లిమిటెడ్
|
శ్రీ మకోటో ఉచిడా
|
రిప్రజంటేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ & సి.ఈ.ఓ.
|
నిస్సాన్ మోటార్ కార్పొరేషన్
|
శ్రీ అకియో టయోడా
|
అధ్యక్షుడు మరియు డైరెక్టర్ల బోర్డు సభ్యుడు
|
టయోటా మోటార్ కార్పొరేషన్
|
శ్రీ యోషిహిరో హిడాకా
|
అధ్యక్షుడు, సి.ఈ.ఓ. & రిప్రజెంటేటివ్ డైరెక్టర్
|
యమహా మోటార్ కార్పొరేషన్
|
శ్రీ తోషిహిరో సుజుకి
|
అధ్యక్షుడు & రిప్రజెంటేటివ్ డైరెక్టర్
|
సుజుకి మోటార్ కార్పొరేషన్
|
శ్రీ సీజీ ఇమై
|
మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్
|
మిజుహో బ్యాంక్ లిమిటెడ్.
|
శ్రీ హిరో అకి ఫుజిసూ
|
సలహాదారుడు, ఎం.యు.ఎఫ్.జి. బ్యాంకు లిమిటెడ్., &
చైర్మన్, జె.ఐ.బి.సి.సి
|
ఎం.యు.ఎఫ్.జి. బ్యాంక్ లిమిటెడ్ మరియు జె.ఐ.బి.సి.సి.
|
శ్రీ తకేషి కునిబే
|
సుమిటోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ (ఎస్.ఎం.ఎఫ్.జి)
మరియు
సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్.ఎం.బి.సి)
రెండు సంస్థల చైర్మన్.
|
సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్
|
శ్రీ కోజి నగై
|
చైర్మన్
|
నోమురా సెక్యూరిటీస్ కం.,
లిమిటెడ్.
|
శ్రీ కజువో నిషితాని
|
సెక్రటరీ జనరల్
|
జపాన్-ఇండియా వ్యాపార సహకార కమిటీ
|
శ్రీ మసకజు కుబోటా
|
అధ్యక్షుడు
|
కీదాన్రెన్
|
శ్రీ క్యోహీ హోసోనో
|
డైరెక్టర్ & సి.ఓ.ఓ.
|
డ్రీమ్ ఇంక్యుబేటర్ ఇంక్.
|
శ్రీ కెయిచి ఇవాటా
|
అధ్యక్షుడు, సుమిటోమో
కెమికల్ కం., లిమిటెడ్
& వైస్-చైర్మన్, జపాన్
పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్
|
సుమిటోమో కెమికల్ కం. లిమిటెడ్
|
శ్రీ సుగియో మిత్సుకా
|
బోర్డు చైర్మన్
|
ఐ.హెచ్.ఐ.కార్పొరేషన్
|
శ్రీ యోషినోరి కనేహనా
|
బోర్డు చైర్మన్
|
కవాసకి హెవీ ఇండస్ట్రీస్, లిమిటెడ్.
|
శ్రీ ర్యూకో హిరా
|
అధ్యక్షుడు &
రిప్రజంటేటివ్ డైరెక్టర్
|
హోటల్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్ కం. లిమిటెడ్
|
శ్రీ హిరోకో ఒగావా
|
సి.ఓ. & సి.ఈ.ఓ.
|
బ్రూక్స్ & కో. లిమిటెడ్
|
శ్రీ వివేక్ మహాజన్
|
సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ & సి.టి.ఓ.
|
ఫుజిట్సు లిమిటెడ్
|
శ్రీ తోషియా మత్సుకి
|
సీనియర్ ఉపాధ్యక్షుడు
|
ఎన్.ఈ.సి. కార్పొరేషన్
|
శ్రీ కాజుషిగే నోబుటాని
|
అధ్యక్షుడు
|
జెట్రో
|
శ్రీ యమద జునిచి
|
ఎగ్జిక్యూటివ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్
|
జికా
|
శ్రీ తదాశి మేడ
|
గవర్నర్
|
జె.బి.ఐ.సి.
|
శ్రీ అజయ్ సింగ్
|
మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
|
మిట్సుయ్ ఓ.ఎస్.కె. లైన్స్
|
శ్రీ తోషియాకి హిగాషిహరా
|
డైరెక్టర్, రిప్రజంటేటివ్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & సి.ఈ.ఓ.
|
హిటాచీ లిమిటెడ్.
|
శ్రీ యోషిహిరో మినెనో
|
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & బోర్డు సభ్యుడు.
|
డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
|
శ్రీ యోషిహిసా కిటానో
|
అధ్యక్షుడు & సి.ఈ.ఓ.
|
జె.ఎఫ్.ఈ. స్టీల్ కార్పొరేషన్
|
శ్రీ ఈజీ హషిమోటో
|
రిప్రజంటేటివ్ డైరెక్టర్ & ప్రెసిడెంట్
|
నిప్పన్ స్టీల్ కార్పొరేషన్
|
శ్రీ అకిహిరో నిక్కాకు
|
అధ్యక్షుడు & బోర్డు రిప్రజంటేటివ్ మెంబర్
|
టోరే ఇండస్ట్రీస్, ఐ.ఎన్.సి.
|
శ్రీ మోటోకి యునో
|
రిప్రజంటేటివ్ డైరెక్టర్ & సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ ఆఫీసర్.
|
మిత్సుయి & కో. లిమిటెడ్.
|
శ్రీ మసయోషి ఫుజిమోటో
|
రిప్రజంటేటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సి.ఈ.ఓ.
|
సోజిట్జ్ కార్పొరేషన్
|
శ్రీ తోషికాజు నంబు
|
ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, రిప్రజంటేటివ్ డైరెక్టర్.
|
సుమిటోమో కార్పొరేషన్
|
శ్రీ ఇచిరో కషితాని
|
అధ్యక్షుడు
|
టయోటా సుషో కార్పొరేషన్
|
శ్రీ ఇచిరో తకహర
|
వైస్-చైర్మన్, బోర్డు సభ్యుడు
|
మరుబేని కార్పొరేషన్
|
శ్రీ యోజి తగుచి
|
చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
|
మిత్సుబిషి కార్పొరేషన్
|
*****
(Release ID: 1827827)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam