పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘అందరికీ స్వచ్ఛమైన గాలి’ అనే విధానాన్ని ఒక భాగస్వామ్య మిషన్‌ గా చేద్దాం: కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 21 MAY 2022 1:40PM by PIB Hyderabad

అందరికీ స్వచ్ఛమైన గాలి - అనే విధానాన్ని ఒక భాగస్వామ్య మిషన్‌ గా మార్చడానికి ఇదే సరైన సమయం.  గాలి నాణ్యత మెరుగుదల ప్రయత్నాలు దేశవ్యాప్తంగా నగరాల్లో మెరుగైన గాలి నాణ్యతను సాధించడంలో సానుకూల ధోరణులను చూపించాయి. కానీ మనం అనుకున్నది సాధించాలనుకుంటే, ‘జన్-భగీదారి’ లేదా భాగస్వామ్య పాలన అనేది కీలకం." అని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు చెన్నైలో -  నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎం.సి.ఏ.పి) మరియు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి, డామన్-డియూ-దాదర్-నగర్ హవేలీ తో కూడిన దక్షిణ ప్రాంత XV-ఎఫ్.సి. మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ (XV-ఎఫ్.సి. ఎం.పి.సి.సి.ఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సెన్సిటైజేషన్-కమ్- రివ్యూ-వర్క్‌షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, ఆయన ఈ విషయం చెప్పారు.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు రోజుల ప్రాంతీయ వర్క్‌ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే;  తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ శివ.వి.మేయ్యనాథన్;  పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీమతి లీనా నందన్;  తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పు, అటవీ శాఖ, అదనపు ప్రధాన కార్యదర్శి, శ్రీమతి సుప్రియా సాహు;  పర్యావరణ అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి, శ్రీ నరేష్ పాల్ గంగ్వార్ ప్రభృతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, 3 మిలియన్లకు పైగా జనాభా గల చెన్నై, మదురై, తిరుచ్చి నగరాల వాయు నాణ్యత జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణాల పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ రాష్ట్రాన్ని అభినందించారు. మండలి అధికారులందరూ ప్రతి బుధవారం శిలాజ ఇంధన రహిత వాహనాల ద్వారా కార్యాలయానికి చేరుకునే విధంగా, "ఈ-కమ్యూట్"  కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ని కూడా ఆయన ప్రశంసించారు.

మరొక విప్లవాత్మక చర్యల్లో భాగంగా, భారతదేశం బి.ఎస్-VI ప్రమాణానికి దూసుకుపోయిందని, ఇంధనం మరియు వాహనాల కోసం దాని నిబంధనలను అనుసరించడం వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో మైలురాయి విధాన నిర్ణయాలలో ఒకటి అని ఆయన నొక్కి చెప్పారు. 

ఎన్.సి..పికింద, 2014-2018 నుంచి వాయు నాణ్యత డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా 132 నాన్-ఎటైన్మెంట్ నగరాలను గుర్తించడం జరిగింది.   జాబితా అన్ని పరిమాణాలురకాలు మరియు దక్షిణ భారతదేశంలోని నగరాల యొక్క భిన్నమైన మిశ్రమంగా ఉంది.  వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 13 నగరాలు,  తమిళనాడుకర్ణాటకతెలంగాణ నుంచి నగరాల చొప్పున ఉన్నాయి", అని ఆయన వివరించారు. 

సమగ్ర విధానం ద్వారా దాదాపు 100 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం ద్వారా ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలిని అందించాలనే ప్రధానమంత్రి నిబద్ధతను శ్రీ భూపేందర్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

స్థిరమైన జీవనశైలి, తగిన ప్రవర్తనలు, వైఖరులను అవలంబించడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరిచే మిషన్‌ లో చురుకైన ఏజెంట్లు మారడంతో పాటు, సమాజంలో మార్పుకు ప్రతినిధులుగా వ్యవహరించాలని మంత్రి యువతకు విజ్ఞప్తి చేశారు.  వాటాదారులందరి సమన్వయం, సహకారం, భాగస్వామ్యం, నిరంతర కృషితో వాయు కాలుష్య సమస్యను సమగ్రంగా పరిష్కరించడంలో ఎన్.సి.ఏ.పి. లక్ష్యాలను సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

*****


(Release ID: 1827369) Visitor Counter : 175