వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచ తేనెటీగ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా మే 20,2022న గుజ‌రాత్‌లో జ‌ర‌గ‌నున్న జాతీయ కార్య‌క్ర‌మం.


ప్ర‌పంచ తేనెటీగ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా 5 రాష్ట్రాల‌లో ని 7 ప్రాంతాల‌లో తెనె ప‌రీక్షా కేంద్రాల‌ను ప్రారంభించ‌నున్న కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి.

Posted On: 19 MAY 2022 5:35PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన  వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ 2022, మే 20న గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా టెంట్ సిటీ -2 ఏక‌తా న‌గ‌ర్‌లో ప్ర‌పంచ తేనెటీగ‌ల దినోత్స‌వం నిర్వ‌హిస్తోంది. ప్ర‌పంచ తేనెటీగ‌ల దినోత్స‌వంలో  కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ పాల్గొంటారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీగారి మార్గ‌నిర్దేశ‌క‌త్వంలో, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ దేశంలోని చిన్న రైతుల ప్ర‌యోజ‌నంకోసం తెనెటీగ‌ల పెంపకాన్ని ప్రోత్స‌హించేందుకు తెనెటీగ‌ల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంది. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి జ‌మ్ము కాశ్మీర్ లోని పుల్వామా, బందిపుర‌, జ‌మ్ము, క‌ర్ణాట‌క‌లోని తుముకూరు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ష‌హ‌రాన్ పూర్‌, మ‌హారాష్ట్ర‌లోని పూణె, ఉత్త‌రాఖండ్ ల‌లో తేనె ప‌రీక్షా కేంద్రాల‌ను గుజ‌రాత్ నుంచి దృశ్య‌మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్నారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ మే 20 వ తేదీని ప్ర‌పంచ తేనెటీగ‌ల దినోత్స‌వంగా ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌ల‌ను , ఈ విశాల విశ్వాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో తెనెటీగ‌లు ఇత‌ర ప‌రాగ సంప‌ర్క‌కార‌కాల కీల‌క‌పాత్ర‌పై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ తెనెటీగ‌ల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.
 కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ స‌హాయ మంత్రులు శ్రీ కైలాష్ చౌద‌రి , సుశ్రీ శోభా క‌రండ్ల‌జె, గుజ‌రాత్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సుశ్రీ మతేజా ఒడెబ్‌, రిప‌బ్లిక్ ఆఫ్ స్లొవేనియా రాయ‌బారి శ్రీ కొండారెడ్డి చావా, ఇండియాలో ఎఫ్‌.ఎ.ఒ ప్ర‌తినిధులు, వ్య‌వ‌సాయం రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ సీనియ‌ర్ అధికారులు, గుజ‌రాత్ ప్ర‌భుత్వ అధికారులు , తేనె ఉత్ప‌త్తి రంగం తో సంబంధం ఉన్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా తేనెటీగ‌ల పెంప‌కం దారులు, తేనె ప్రాసెసింగ్ రంగంలోని వారు, తేనెటీగ‌ల రంగంలోని వివిధ వ‌ర్గాల వారు ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసె ఎగ్జిబిష‌న్ లో స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ ర‌కాల తేనెటీగ‌లు, అలాగే తేనె ఉత్ప‌త్తి రంగంలో వివిధ ఉత్ప‌త్తుల‌ను తెలియజేయ‌నున్నారు.మ‌ధుక్రాంతి పోర్ట‌ల్ అమ‌లు ఏజెన్సీ అయిన ఇండియ‌న్ బ్యాంక్ ఈ సంద‌ర్భంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయ‌నుంది. మ‌ధుక్రాంతి పోర్ట‌ల్‌లో తెనెటీగ‌ల పెంప‌కం దారుల పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేయించుకోనున్నారు.

శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో తెనెటీగ‌ల పెంప‌కానికి సంబంధించి ప‌రిశోధ‌న అభివృద్ధి, ఉత్ప‌త్తి సాంకేతిక‌త విష‌యంలో అనుభ‌వాలు, స‌వాళ్ల పై ఒక టెక్నిక‌ల్ సెష‌న్‌ను అలాగే మార్కెటింగ్ స‌వాళ్లు, ప‌రిష్కారాలు (దేశీయంగా, అంత‌ర్జాతీయంగా)- అనే అంశంపై చ‌ర్చా కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హిస్తారు. రైతులు, తెనెటీగ‌ల పెంప‌కందారుల‌కు తెనెటీగ‌ల పెంప‌కంపై శాస్త్రీయ స‌మాచారాన్ని కూడా ఈ సంద‌ర్బంగా అందిస్తారు.

దేశ‌వ్యాప్తంగా తేనెటీగ‌ల పెంపకానికి ప్రాచుర్యం తెచ్చేందుకు తేనెటీగ‌ల దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్దేశించారు.భార‌త ప్ర‌భుత్వ‌ జాతీయ తేనెటీగల పెంపకం కార్య‌క్ర‌మం, హనీ మిషన్ (NBHM). చిన్న ,సన్నకారు రైతులలో శాస్త్రీయప‌ద్ధ‌తిలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్స‌హిస్తోంది., ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు, పంట‌ నిర్వహణ కు మౌలిక సదుపాయాల అభివృద్ధి , పరిశోధనకు మద్దతునిస్తోంది.  "తీపి విప్లవ" లక్ష్యాన్ని సాధించడం కోసం జాతీయ తేనెటీగ బోర్డు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కింద భారతదేశం ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తోంది.

***

 



(Release ID: 1826799) Visitor Counter : 167