ప్రధాన మంత్రి కార్యాలయం

మే 17న ‘ట్రాయ్‌’ రజతోత్సవాల సందర్భంగా ప్రసంగించనున్న ప్రధాని


ప్రధానమంత్రి ఇక్కడ 5జి ‘టెస్ట్ బెడ్’ను ప్రారంభిస్తారు; భారతీయ పారిశ్రామిక..

అంకుర సంస్థలు తమ ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలు, అల్గారిథమ్‌లను 5జి..

భవిష్యత్తరం సాంకేతికతల సాయంతో ధ్రువీకరించేందుకు ఇది మద్దతునిస్తుంది

Posted On: 16 MAY 2022 4:15PM by PIB Hyderabad

   భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) రజతోత్సవాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు. దీంతోపాటు ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఐఐటీ-మ‌ద్రాస్ నేతృత్వంలోని 8 సంస్థల ద్వారా ద్వారా బహుళ సంస్థల సహకార ప్రాజెక్టు కింద రూపొందించబడిన ప్రయోగాత్మక 5జి వేదిక (టెస్ట్‌ బెడ్‌)ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇతర సంస్థలలో ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, కాన్పూర్, ఐఐటీలు సహా బెంగళూరులోని ఐఐఎస్‌సి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్‌ రీసెర్చ్ (సమీర్‌), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ (సెవిట్‌) కూడా ఉన్నాయి.

  ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం రూ.220 కోట్లకుపైగా వ్యయం చేశారు. ఈ టెస్ట్ బెడ్ భారతీయ పరిశ్రమలు, అంకుర సంస్థలకు సహాయక పర్యావరణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ఆ మేరకు అవి తమ ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలు, అల్గారిథమ్‌లను 5జి, భవిష్యత్తరం సాంకేతికతల ద్వారా ధ్రువీకరించడంలో తోడ్పాటునిస్తుంది.

   కాగా, టెలికాం నియంత్రణ ప్రాధికార చట్టం-1997 ప్రకారం భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ‘ట్రాయ్‌’ 1997లో ఏర్పాటు చేయబడింది.



(Release ID: 1825909) Visitor Counter : 135