ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

191.32 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.17 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,692

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,487

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.62%

Posted On: 15 MAY 2022 9:37AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 191.32 కోట్ల ( 1,91,32,94,864 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,39,40,502 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.17 కోట్లకు పైగా ( 3,17,42,189 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,138

రెండో డోసు

1,00,29,513

ముందు జాగ్రత్త డోసు

50,23,857

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,17,603

రెండో డోసు

1,75,65,055

ముందు జాగ్రత్త డోసు

81,69,644

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,17,42,189

రెండో డోసు

1,20,98,191

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,89,67,941

రెండో డోసు

4,39,91,575

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,65,83,062

రెండో డోసు

48,46,70,686

ముందు జాగ్రత్త డోసు

4,07,396

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,31,39,557

రెండో డోసు

18,96,13,860

ముందు జాగ్రత్త డోసు

9,93,324

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,12,594

రెండో డోసు

11,81,88,033

ముందు జాగ్రత్త డోసు

1,62,74,646

ముందు జాగ్రత్త డోసులు

3,08,68,867

మొత్తం డోసులు

1,91,32,94,864

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,692. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,878 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,79,693 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,487 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,05,156 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.38 కోట్లకు పైగా ( 84,38,36,914 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.62 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.61 శాతంగా నమోదయ్యాయి.

 

 

****



(Release ID: 1825628) Visitor Counter : 102