ప్రధాన మంత్రి కార్యాలయం

భరూచ్ లో జరిగిన ‘ఉత్కర్ష్ సమారోహ్’ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


మహిళల కు గౌరవాన్ని ఇచ్చేందుకు మరియు వారి జీవనాన్ని సరళతరం గా మార్చేందుకుచేసిన పనులకు గాను  ప్రధాన మంత్రి కిధన్యవాదాలు తెలియజేసిన ఆ ప్రాంత మహిళ లు; వారు ఒక పెద్ద రాఖీ ని ప్రధాన మంత్రి కి కానుకగా ఇచ్చారు

ప్రధాన మంత్రి వివిధ పథకాల లబ్ధిదారుల తో మాట్లాడారు

‘‘ప్రభుత్వం నిజాయతీ తో లబ్ధిదారు చెంతకు ఒక సంకల్పం తో చేరుకొన్నప్పుడు  అర్థవంతమైనఫలితాలు దక్కుతాయి’’

ప్రభుత్వం 8 సంవత్సరాలు గా ‘సేవ, సుపరిపాలన మరియు పేద ప్రజల సంక్షేమం’.. వీటికి అంకితమైంది

‘‘సేచురేశన్(ప్రయోజనాలు అందరికీ అందాలి అనేదే) నా యొక్క స్వప్నం.  మన అందరి ప్రయాసలతో అనేక పథకాలను 100 శాతం లబ్ధి కి చేరువ గా తీసుకురాగలిగాం.  ప్రభుత్వయంత్రాంగం దీని ని ఒక అలవాటు గా చేసుకోవాలి, మరి పౌరుల లో నమ్మకాన్ని అంకురింపచేయాలి’’

‘‘లబ్ధిదారులు యావన్మందికి కవరేజి అంటే ప్రతి ఒక్కవర్గాని కి, ప్రతి ఒక్క తెగ కు సమానమైన రూపం లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ స్ఫూర్తి తో సాగడం అన్నమాట’’

Posted On: 12 MAY 2022 12:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని భరూచ్ లో జరిగిన ఉత్కర్ష్ సమారోహ్ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. అవసరం అయిన వర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని సరి అయిన కాలం లో అందించడానికి తోడ్పడే నాలుగు కీలక పథకాల ను భరూచ్ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మేరకు అమలు పరచినందుకు గుర్తు గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ తదితరులు ఉన్నారు.

ప్రధాన మంత్రి కి ఆ ప్రాంత మహిళ లు ఒక పెద్ద రాఖీ ని కానుక గా ఇచ్చారు. ఆయన ఆరోగ్యం గా ఉండాలని, దీర్ఘాయుష్షు ను కలిగి ఉండాలని వారు ఆకాంక్షించారు. దేశం లో మహిళల గౌరవాన్ని, వారి జీవనాన్ని సరళతరం గా మార్చేందుకు ఆయన చేసిన అన్ని పనుల కు గాను ఆయన కు వారు తమ ధన్యవాదాల ను తెలియజేశారు. ప్రధాన మంత్రి వివిధ పథకాల లబ్ధిదారుల తో మాట్లాడారు.

దృశ్య జ్ఞ‌ానానికి నోచుకోనటువంటి ఒక లబ్ధిదారు తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అతడి కుమార్తె లు ఏమి చదువుతున్నదీ అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భం లో ఆ వ్యక్తి యొక్క కుమార్తె తన తండ్రి కి ఉన్న సమస్య ను గురించి వివరిస్తూ భావోద్వేగాని కి లోనయ్యారు. ఆ వేళ ప్రధాన మంత్రి విచలితుడై, ఆమె సూక్ష్మ బుద్ధి ఆమెకు ఉన్నటువంటి బలం అని తెలియజెప్పారు. ఆ వ్యక్తి మరియు అతని కుటుంబ సభ్యులు ఈద్ ను ఏ విధం గా జరుపుకొన్నారంటూ ప్రధాన మంత్రి అడిగారు. ఆయన టీకా మందు ను వేయించుకొని, పుత్రిక ల ఆకాంక్షల ను నెరవేర్చాలని పాటుపడుతున్నందుకు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. ఒక మహిళా లబ్ధిదారు తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఆమె జీవనం ఎలా సాగుతోందో తెలుసుకోగోరారు. హుందాగా మనుగడ సాగించాలి అని ఆమె పెట్టుకొన్నటువంటి దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఒక యువ వితంతు మహిళ మాట్లాడుతూ తన పిల్లల కు ఒక మంచి జీవనాన్ని ఇస్తున్న తన జీవన యాత్ర ను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు. చిన్న పొదుపు మొత్తాల పథకం లో చేరవలసిందంటూ ఆమె కు ప్రధాన మంత్రి సూచన చేశారు. ఆ మహిళ సంకల్పాన్ని నెరవేర్చుకొనేటట్లు ఆవిడ కు తోడ్పాటు ను ఇవ్వండి అని అధికారుల తో ప్రధాన మంత్రి చెప్పారు.

శ్రోతల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రభుత్వం నిజాయతీ తో, ఒక సంకల్పం తో, లబ్ధిదారు చెంతకు చేరుకొన్నప్పుడు ఒనగూరే ఫలప్రదమైనటువంటి ఫలితాల కు ఒక నిదర్శనం నేటి ఉత్కర్ష్ సమారోహ్అన్నారు. సామాజిక భద్రత కు సంబంధించిన నాలుగు పథకాల ను లక్షిత లబ్ధిదారులు అందరికీ వర్తింపజేసినందుకు గాను గుజరాత్ ప్రభుత్వాన్ని మరియు భరూచ్ జిల్లా పాలన యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. లబ్ధిదారుల లో ఆత్మవిశ్వాసం, సంతృప్తి ఉట్టిపడుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీలు, షెడ్యూల్డు కులాలు, ఇంకా అల్పసంఖ్యాక సముదాయాల కు చెందిన చాలా మంది పౌరుల కు సమాచారం వారి వరకు చేరని కారణం గా పథకాల తాలూకు ప్రయోజనాల కు వారు దూరం గా ఉండిపోతున్నారు అని ఆయన అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్తాలూకు భావన మరియు చిత్తశుద్ధి తో కూడిన ఉద్దేశ్యాలు ఎల్లప్పుడూ మంచి ఫలితాల ను ఇస్తాయని ఆయన అన్నారు.

త్వరలో ప్రభుత్వం యొక్క 8వ వార్షికోత్సవం రానుందని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం యొక్క 8 ఏళ్ళ కాలం సేవ కు, సుపరిపాలన కు, పేదల సంక్షేమాని కిఅంకితం చేయడం జరిగింది అని పేర్కొన్నారు. తన పాలన యంత్రాంగం యొక్క సాఫల్యాల తాలూకు ఖ్యాతి ని ప్రజల లో ఒకరు గా ఉంటూ, నిరాదరణ, పేదరికం మరియు అభివృద్ధి.. ఈ విషయాల ను గురించి నేర్చుకొంటూ తాను గడించినటువంటి అనుభవానిది అని ఆయన వివరించారు. పేదరికం తాలూకు స్వీయ అనుభవం మరియు సామాన్య ప్రజానీకం యొక్క అవసరాల కు అనుగుణం గా తాను పాటుపడతానని ఆయన చెప్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కి పథకం యొక్క పూర్తి ప్రయోజనం లభించాలి అని స్పష్టం చేశారు. సాధించిన విజయాల ను చూసుకొని విశ్రాంతి తీసుకోకూడదని గుజరాత్ గడ్డ తనకు నేర్పించింది అని ప్రధాన మంత్రి అన్నారు. పౌరుల సంక్షేమం యొక్క పరిధి ని మెరుగు పరచడం, విస్తరించుకుంటూ పోవడం.. ఇవే ఎల్లవేళలా తన ధ్యేయం అని ఆయన అన్నారు. ‘‘100 శాతం మంది కి హితం అనేదే (సేచురేశన్) నా కల. మనం 100 శాతం లబ్ధి దిశ లో ముందుకు సాగవలసివుంది. ప్రభుత్వ యంత్రాంగం దీనిని అలవరచుకోవాలి. మరి పౌరుల లో ఒక విశ్వాసాన్ని అంకురింప చేయాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

2014వ సంవత్సరం లో దేశ జనాభా లో సుమారు సగం మంది టాయిలెట్ ల సదుపాయం, టీకా మందు సౌకర్యం, విద్యుత్తు కనెక్షన్ సదుపాయం మరియు బ్యాంకు ఖాతా సదుపాయాల కు నోచుకోకుండా ఉండిపోయారు అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన కొన్నేళ్ళ లో మనం, అందరి ప్రయాసల తో అనేక పథకాల ను లక్షిత లబ్ధిదారులు యావన్మందికీ వర్తింప చేసే స్థితి (సేచురేశన్) కి చేరువ గా తీసుకురాగలిగాం. 8 ఏళ్ళ కాలం తరువాత, మనం కొత్త దృఢత్వం మరియు సరికొత్త సంకల్పం తో మనల ను మనం పునరంకితం చేసుకోవలసిన అవసరం ఉంది అంటూ ప్రధాన మంత్రి ఉద్భోదించారు.

లబ్ధిదారులు యావన్మందికీ మేలు చేయడం (100 శాతం కవరేజి) అంటే దాని అర్థం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్స్ఫూర్తి తో ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క తెగ ను సమానం గా చూడడం అని ప్రధాన మంత్రి వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన ప్రతి ఒక్క పథకం పరిధి లో నుంచి ఏ ఒక్కరిని వెనుకపట్టు న వదలి వేయకూడదు. దీని ద్వారా సంతృప్తిపరచేటటువంటి రాజకీయాలు అంతం అవుతాయి. ఇక్కడ శాచ్యురేశన్ అంటే ప్రయోజనం అనేది సమాజం లో చిట్టచివరి వ్యక్తి వరకు చేరడం అని అర్థం అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆ ప్రాంతాని కి చెందిన వితంతు సోదరీమణులు తనకు నజరానాగా ఇచ్చినటువంటి ఒక రాఖీ తనకు బలాన్ని ఇచ్చిందంటూ వారికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వారి ఆకాంక్ష లు తనకు ఒక కవచం వంటివి అని ఆయన చెప్తూ, అవి మరింత ఎక్కువ గా శ్రమించడాని కి తన కు ప్రేరణ గా ఉంటాయన్నారు.

 

 

అందరి ప్రయాసలు మరియు విశ్వాసం.. వీటి వల్లే ఎర్రకోట బురుజుల మీది నుంచి సేచురేశన్ తాలూకు లక్ష్యాన్ని తాను ప్రకటించగలిగినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఇది సామాజిక భద్రత పరం గా చూసినప్పుడు ఒక భారీ కార్యక్రమం అని ఆయన అన్నారు. ఈ ఉద్యమం పేద ప్రజల కు గౌరవాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం (గరీబ్ కో గరిమ’) అని ఆయన అభివర్ణించారు.

ప్రధాన మంత్రి గుజరాతీ భాష లో మాట్లాడుతూ, వాణిజ్య పరం గా, సంస్కృతి పరం గా భరూచ్ ప్రాంతాని కి ఉన్నటువంటి వారసత్వాన్ని గుర్తు కు తీసుకు వచ్చారు. భరూచ్ తో తనకు ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని కూడా ఆయన స్మరించుకొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి మరియు స్థానిక యువత యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం, ఇంకా ప్రగతి తాలూకు ప్రధాన మార్గంలో భరూచ్ కు చోటు ల గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం మరియు కనెక్టివిటీ వంటి కొత్త రంగాల లో గల అవకాశాల ను గురించి కూడా ఆయన మాట్లాడారు.

 

**********

DS/AKP/AK

 

 

 

 

 



(Release ID: 1825089) Visitor Counter : 209