సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేన్స్ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో శ్రీ అనురాగ్ ఠాకూర్ తో కలిసి పాల్గోనున్న సినీ రంగ ప్రముఖులు
ఆర్. రెహమాన్, శేఖర్ కపూర్, అక్షయ్ కుమార్, రిక్కీ కేజ్ తదితర ప్రముఖులకు రెడ్ కార్పెట్ స్వాగతం
Posted On:
10 MAY 2022 6:02PM by PIB Hyderabad
కేన్స్ చలన చిత్రోత్సవం 2022 ప్రారంభ కార్యక్రమం 2022 మే 17న అట్టహాసంగా ప్రారంభం కానున్నది. ప్రారంభోత్సవం రోజున భారతీయ ప్రతినిధి బృందానికి నిర్వాహకులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నారు. ఎర్ర తివాచీపై నడుస్తూ భారతీయ ప్రతినిధి బృందం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే కార్యక్రమం భారతీయ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నది.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ నాయకత్వంలో భారత ప్రతినిధి బృందం కేన్స్ చలన చిత్రోత్సవంలో పాల్గొంటుంది. ప్రముఖుల జాబితాలో భారతదేశంలోని సంగీత రంగానికి చెందిన ప్రముఖ తారలు ఉన్నారు. భారత ప్రతినిధి బృందంలో కింది ప్రముఖులు సభ్యులుగా ఉంటారు.
శ్రీ అక్షయ్ కుమార్ (నటుడు మరియు నిర్మాత, బాలీవుడ్)
శ్రీ AR రెహమాన్ (అంతర్జాతీయ సంగీత స్వరకర్త)
శ్రీ మామ్ ఖాన్ (జానపద సంగీత స్వరకర్త, గాయకుడు)
శ్రీ నవాజుద్దీన్ సిద్ధిఖీ (నటుడు, బాలీవుడ్)
నయనతార (నటి, మలయాళం, తమిళం)
పూజా హెగ్డే (నటి, హిందీ, తెలుగు)
శ్రీ ప్రసూన్ జోషి (చైర్మన్,సీబీ ఎఫ్ సి )
శ్రీ ఆర్ . మాధవన్ (నటుడు, నిర్మాత), కేన్స్‌లో ప్రపంచ ప్రీమియర్ ఆఫ్ రాకెట్రీ
రిక్కీ కేజ్ (సంగీత స్వరకర్త)
శ్రీ శేఖర్ కపూర్ (చిత్ర నిర్మాత)
తమన్నా భాటియా (నటి, హిందీ, తెలుగు, తమిళ చిత్రాలు)
వాణీ త్రిపాఠి (నటి)
భారతదేశ సంస్కృతి, వారసత్వం, విలువలు, అభివృద్ధిని చలన చిత్రాల ద్వారా ప్రపంచ దేశాలకు వివరించాలని నిర్ణయించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశ సంపద వివిధ అంశాలను సూచించే విధంగా దేశం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను ప్రతినిధి వర్గం సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది.
ఇటీవల జరిగిన 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చలన చిత్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను రూపొందించారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలతో కలిసి పనిచేయడం, 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో మరియు బ్రిక్స్ చలన చిత్రోత్సవాన్ని గుర్తించడం లాంటి అంశాలకు 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆమోదం తెలిపింది. అదే స్ఫూర్తితో, కేన్స్ చలన చిత్రోత్సవంలో అనేక నూతన మరియు ఉత్తేజకరమైన కార్యక్రమాలు చోటు చేసుకోనున్నాయి.
ప్రస్తుత చలన చిత్రోత్సవంలో భారతదేశం గౌరవనీయమైన అధికారిక దేశం హోదాలో పాల్గొంటుంది. గౌరవనీయమైన అధికారిక దేశం హోదాని ఒక దేశానికి కల్పించడం ఇదే తొలిసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో భారతదేశానికి ఈ గౌరవం లభించడం గమనార్హం. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.
కేన్స్ నెక్స్ట్‌లో కూడా భారతదేశం గౌరవప్రదమైన దేశమని గుర్తింపు పొందిందని ఇంతకు ముందు మంత్రి ప్రకటించారు. దీని కింద 5 కొత్త స్టార్టప్‌లకు ఆడియో-విజువల్ రంగానికి చెందిన 5 అంకుర సంస్థలకు ప్రచారం కల్పించి, ప్రోత్సహిస్తామని మంత్రి వెల్లడించారు.
(Release ID: 1824281)
Visitor Counter : 164