సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

పారామిలటరీ దళాల 107 క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాన్ని ప్రారంభించిన హోంమంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 09 MAY 2022 5:21PM by PIB Hyderabad

పారామిలటరీ దళాల క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభం కావడంతో  కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రారంభించిన "స్వదేశీ" కార్యక్రమం జాతీయ స్థాయిలో ఊపందుకుంది. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా దేశంలో  పారామిలటరీ దళాల 107 క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాన్ని సోమవారం ప్రారంభించారు. మిగిలిన క్యాంటీన్లలో త్వరలో ఖాదీ వస్తువుల అమ్మకాలు ప్రారంభమవుతాయని శ్రీ అమిత్ షా ప్రకటించారు. 

ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన శ్రీ షా " ఖాదీ అంటే స్వదేశీ అని గాంధీజీ అనేవారు. ప్రస్తుతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఖాదీ ప్రధాన సాధనంగా మారింది. స్వచ్ఛతకు మారుపేరు ఖాదీ. పారామిలటరీ దళాలకు చెందిన  107 క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాన్ని ప్రారంభించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పారామిలటరీ దళాల క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తులు త్వరలో అందుబాటులోకి వస్తాయి" అని అన్నారు. అస్సాంలోని తమూల్పూర్ లో  బిఎస్ఎఫ్ సెంట్రల్ వర్క్‌షాప్ మరియు స్టోర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శ్రీ అమిత్ షా ఖాదీ అమ్మకాలను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా మరియు  బిఎస్ఎఫ్, సీఆర్ఫీఎఫ్   డైరెక్టర్ జనరల్ కూడా పాల్గొన్నారు.

గ్రామీణ భారతదేశంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కార్యక్రమాలను అమలు చేస్తున్న కెవిఐసిని శ్రీ అమిత్ షా అభినందించారు.  కెవిఐసి అమలు చేస్తున్న పథకాలైన హనీ మిషన్, కుమ్మరి సాధికారత  యోజన, తోలు, కార్పెంటర్ సాధికారత పథకాలు అస్సాంలోని బోడోలాండ్‌లో స్థిరమైన ఉపాధిని అందిస్తాయని ఆయన అన్నారు. " స్వయం ఉపాధి కల్పించే పథకాలను కెవిఐసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తే బోడోలాండ్ లో  నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. దీనితో బోడో యువత ఆయుధాలను వదిలి పెట్టి జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తారు" అని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కెవిఐసి 2021-22 లో రికార్డు స్థాయిలో 1.15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధించి 250% వృద్ధి రేటును సాధించిందని శ్రీ అమిత్ షా వివరించారు. 

స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఖాదీ గ్రామీణ కమిషన్ (కెవిఐసి) తయారు చేస్తున్న "స్వదేశీ" ఉత్పత్తులను సీఏపీఎఫ్ క్యాంటీన్లలో సాధ్యమైనంత ఎక్కువగా విక్రయించాలని అంతకుముందు శ్రీ షా ఆదేశాలు జారీచేశారు.  ఢిల్లీ , పంజాబ్, హర్యానా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు ఇతర రాష్ట్రాలలోని క్యాంటీన్లలో జాతీయ జెండా, కాటన్ టవల్స్, తేనె, కచ్చి ఘనీ ఆవ నూనె, అగర్బత్తి ,  దలియా, అప్పడాలు, ఆవకాయ, ఆమ్లా ఉత్పత్తులు మొదలైన వాటితో సహా 32 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. 

పారామిలిటరీ బలగాలకు ఆవనూనె, కాటన్ దుఃర్రీలు  మరియు ఉన్ని దుప్పట్ల సరఫరా కోసం కెవిఐసి  చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో పారామిలటరీ దళాల  క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వివిధ పారామిలిటరీ బలగాలకు ఇప్పటివరకు దాదాపు రూ. 17 కోట్ల విలువైన ఉత్పత్తులను కెవిఐసి  సరఫరా చేసింది. వీటిలో   5.50 కోట్ల రూపాయల విలువ చేసే  3 లక్షల కేజీల (3000 మెట్రిక్‌ టన్నుల)ఆవనూనె,  11 కోట్ల రూపాయల విలువ చేసే  2.10 లక్షల కాటన్ బెడ్  దుఃర్రీలు  ,  40 లక్షల రూపాయల ఉన్ని దుప్పట్లు ఉన్నాయి.

 ఖాదీ ఉత్పత్తులను విక్రయించడానికి  పారామిలిటరీ క్యాంటీన్లు అతి పెద్ద విక్రయ కేంద్రాలుగా ఉంటాయి. ఇది   కెవిఐసి   ఉత్పత్తి మరియు అమ్మకాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఖాదీ దుస్తులు  మరియు రెడీమేడ్ వస్త్రాలు, సౌందర్య సాధనాలు, తినుబండారాలు మరియు మూలికా ఉత్పత్తులతో సహా విస్తృత శ్రేణి ఖాదీ ఉత్పత్తులను  పారామిలటరీ దళాలకు సరఫరా చేసేందుకు  కెవిఐసి ప్రణాళిక రూపొందించింది.

***


(Release ID: 1824025) Visitor Counter : 148