నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

సిఎపిఎఫ్‌లు,(ఎన్ఎస్ జి) ఆవ‌ర‌ణ‌ల‌లో సౌర శక్తి పానెళ్ళ‌ను, భవనాల పై కప్పులపై పానెళ్ళ‌ను నెలకొల్పేందుకు ఎంహెచ్ఎతో అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేసిన ఎస్ఇసిఐ


సుస్థిర భవిష్యత్తు సాధనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో ముందడుగు

Posted On: 09 MAY 2022 1:29PM by PIB Hyderabad

కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాలు (సిఎపిఎఫ్‌లు), జాతీయ భ‌ద్ర‌తా గార్డు (ఎన్ఎస్ జి) ఆవ‌ర‌ణ‌ల‌లో అందుబాటులో ఉన్న భవనాల పై కప్పులపై లభించే సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖతో సోలార్జ్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఇసిఐ) అవ‌గాహ‌నా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, ఎమ్ఎన్ఆర్ఈ కార్యదర్శి శ్రీ ఇందు శేఖర్ చతుర్వేది హాజరయ్యారు.   

అవ‌గాహ‌నా ఒప్పందంపై ఎంహెచ్ఎ సంయుక్త కార్యదర్శి శ్రీ రాకేష్ కుమార్ సింగ్, ఎస్ఇసిఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సుమన్ శర్మ సంత‌కాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి సుమన్ శర్మ మాట్లాడుతూ "భారత వాతావరణ లక్ష్యాల సాధన  కోసం  భారత ప్రభుత్వానికి సేవలు అందించే అవకాశం ఎస్ఇసిఐ లభించడం సంతోషంగా ఉంది.  దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటిక‌ప్పుపై పానెళ్ళ‌ను అమర్చి  రూఫ్‌టాప్ సోలార్ సెక్టార్‌ను విస్తరించడానికి ఎదురుచూస్తున్నాము " అని అన్నారు.

 

దేశ భద్రతా బలగాలకు గ్రీన్ పవర్ సరఫరా దిశగా ఈ ఎంఒయు ఒక ముందడుగుగా ఉంటుంది.   సుస్థిర భవిష్యత్తు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి సహకారం అందిస్తుంది. రెస్కో మోడల్ కింద ఇంటిక‌ప్పుపై సౌర విద్యుత్ పానెళ్ళ‌ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి  ఎంహెచ్‌ఏకు ఎంఓయూ సహకారం అందిస్తుంది.

 

***



(Release ID: 1823848) Visitor Counter : 176