గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించిన ‘తలసేమియా సవాళ్లు–2022’ అనే వెబినార్లో కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్ ముండా ప్రసంగించారు.
తలసేమియాను ఎదుర్కోవడానికి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థల సంయుక్త ప్రయత్నాల ద్వారా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం– అర్జున్ ముండా
प्रविष्टि तिथि:
08 MAY 2022 6:18PM by PIB Hyderabad
ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా.. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఆదివారం న్యూఢిల్లీలో "తలసేమియా 2022లో సవాళ్లు" అనే వెబ్‌నార్‌లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, తలసేమియా అసోసియేషన్‌తో పాటు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వెబినార్ నిర్వహించింది. ఈ సదస్సులో భారత్‌తోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.
వెబినార్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా, సంయుక్త కార్యదర్శి నావల్జిత్ కపూర్, వికలాంగులశాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్కుమార్ యాదవ్ ప్రసంగించారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా వెబినార్లో మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ అమృత కాలంలో దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ వైపు నడిపించే కొత్త సంకల్పాలు చేయడంపై ప్రధానమంత్రి దృష్టిసారించారని అన్నారు. అందులోభాగంగానే తలసేమియా సమస్యను కూడా పరిష్కరించడానికి కొత్త సంకల్పాలు చేయాలని పిలుపునిచ్చారు.
“తలసేమియా సమస్యపై దాడిని పెంచడానికి అవసరమైన ఉపాధ్యాయులు -విద్యార్థులు, అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లు వంటి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలతో దేశవ్యాప్త అవగాహన ప్రచారం అవసరం. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు ఐదు నిమిషాలు అదనంగా సమయం కేటాయించాలి. అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తలసేమియా వ్యాధి గురించి వివరించి, నివారణపై అవగాహన కల్పించాలి’’అన్నారు.
స్థానిక స్థాయి కార్మికులకు మార్గనిర్దేశం చేసేందుకు మరియు వారికి అవగాహన కల్పించడంలో సహాయపడటానికి సాధారణ మరియు స్థానిక భాషలో అందరికీ అర్థమయ్యేరీతిలో సమాచారం అందుబాటులో ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు.
"అవగాహన మరియు కౌన్సెలింగ్‌తో పాటు తక్కువ ధరలో మందుల లభ్యత మరియు కమ్యూనిటీ రక్తదానం వంటి ప్రయత్నాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించాలి" అని మంత్రి కోరారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ.. అవగాహన, సమర్థవంతమైన భాగస్వామ్యం మరియు ప్రభుత్వ విధానం ద్వారా భారతదేశంలో తలసేమియా వ్యాధిని నియంత్రించవచ్చు, నిరోధించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు.
తలసేమియా నియంత్రణ రంగంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలకు మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తుందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు.
ముంబై హెమటాలజీ గ్రూప్‌తో కలిసి తలసేమియా ఇండియా, తలసేమియా సికిల్ సెల్ సొసైటీ (టీఎస్సీఎస్) వంటి కీలక అంతర్జాతీయ నిపుణులు మరియు ఇతర భాగస్వాముల ద్వారా స్క్రీనింగ్ మరియు మేనేజ్‌మెంట్‌తో పాటు దాని అధ్యయనాలు, అవగాహన కార్యక్రమాల వంటి అంశాలను ఈ వెబినార్ నొక్కిచెప్పింది.
భారతదేశంలో తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా అనేది β తలసేమియా సిండ్రోమ్ ఉన్న 100,000 మంది రోగులతో మరియు సికిల్ సెల్ వ్యాధి/లక్షణంతో ఉన్న సుమారు 150,0000 మంది రోగులతో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. వీరిలో కొద్దిమందికి మాత్రమే సరిపడా చికిత్సఅందుతోంది. ఎక్కువశాతం కుటుంబాలకు అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్(బీఎంటీ) భారంగా మారింది.
తలసేమియా నిర్వహణలో కీలకమైన అంశం విద్య మరియు అవగాహనను ప్రోత్సహించడం. ఇదే తలసేమియాపై విజయం సాధించడానికి కీలకం. ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు గత 3 నుండి 4 దశాబ్దాలుగా ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాల అమలుతోపాటు దాదాపు 70శాతం జనాభా నివసిస్తున్న అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ కార్యక్రమాలు చేరుకోవడం ఎంతో అవసరం.
***
(रिलीज़ आईडी: 1823794)
आगंतुक पटल : 269